పరిశ్రమలకు అనుకులమైన ప్రాంతం
నెల్లూరు(పొగతోట) : పరిశ్రమల ఏర్పాటుకు నెల్లూరు జిల్లా ఎంతో అనుకూలమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. కృష్ణపట్నం పోర్టు ఉందని, త్వరలో దగదర్తిలో విమానాశ్రయం వస్తుందని తెలిపారు. జాతీయ రహదారికి సమీపంలో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయన్నారు. దీంతో పరిశ్రమలు అధికంగా ఏర్పాటుచేసే అవకాశం ఉందని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు 40 వేల ఎకరాల అనుకులమైన భూములను గుర్తించి బ్యాంకింగ్ చేయడం జరిగిందన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో 70 రైస్ మిల్లులు ఉన్నాయన్నారు. వాటిన్నింటిని ఒకేచోటకు తరలిస్తే కాలుష్కం తగ్గుతుందన్నారు. రైస్‌మిల్లుల ఏర్పాటుకు 500 ఎకరాల భూములు అవసరమవుతాయని కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో ఫార్మసి కంపెనీలు ఏర్పాటుకు ప్రతిపాదనలు వస్తున్నయని తెలిపారు. దగదర్తి విమానాశ్రయ భూసేకరణ ప్రక్రియ రెండు వారాల్లో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.