రెండోరోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభం
Published Thu, Sep 21 2017 11:14 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
విజయవాడ: విజయవాడలో సీఎం అధ్యక్షతన రెండోరోజు కలెక్టర్ల సదస్సు గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా విధానాన్ని సీఎం చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ఈ-ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. సదస్సులో మధ్యాహ్నం నుంచి శాంతి భద్రతలపై సమీక్ష జరుగుతుంది. ఈ సదస్సుకు జిల్లా ఎస్పీలు, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ఈ ఏడాదిని ‘ఈ-ప్రగతి’ సంవత్సరంగా ప్రకటించినట్లు తెలిపారు. ‘ఈ-ప్రగతి’ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాన్నారు. అన్ని జిల్లాలు రియల్‌టైమ్ గవర్నెన్స్ పరిధిలోకి రావాలని అన్నారు. ఏదైనా ఒక కళాశాల తీసుకుని విద్యార్థులకు ఈ-ప్రగతిపై శిక్షణను ఇవ్వాలన్నారు.
Advertisement
Advertisement