
2018కి అమరావతి అడ్మిన్ సిటీ పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి అడ్మిన్ సిటీ నిర్మాణాన్ని 2018 నాటికల్లా పూర్తి చేసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి అడ్మిన్ సిటీ నిర్మాణాన్ని 2018 నాటికల్లా పూర్తి చేసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం నాడు విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయనీ విషయం వెల్లడించారు. ఇంకా ఆయనేమన్నారంటే...
- 2029కి ఏపీ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉండాలి
- 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ గమ్యస్థానంగా ఏపీ
- పేదలకు తప్పనిసరిగా సంక్షేమ ఫలాలు అందాలి
- సృష్టించిన సంపద పేదలకు అందాలి
- పెన్షన్లపై ప్రజలలో సంతృప్తిగా ఉన్నారు
- ఇ-పాస్ విధానం వల్ల నిత్యావసర వస్తువుల పంపిణీ సక్రమంగా జరుగుతోంది
- ఇంకా సాంకేతిక సమస్యలున్నాయి, వాటిని అధిగమించి ప్రజాపంపిణీలో ఏపీని రోల్ మోడల్‌గా ఉంచుదాం
- రుణ ఉపశమనం కింద ఇప్పటివరకు రూ. 8,400 కోట్లు అందించాం
- మరో విడత చెల్లింపులు చేయనున్నాం
- బ్యాంకర్లు ప్రభుత్వ ప్రాధాన్యం ప్రకారం రుణాలిస్తున్నారా లేదా అనేది కలెక్టర్లు పర్యవేక్షించాలి
- పేదరిక నిర్మూలన ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యం
- సమ్మిళిత వృద్ధి సాధన సాధించాలి
- దీర్ఘకాలిక అభివృద్ధి కోసం పనిచేయాలి
- రహదారుల నిర్మాణంకోసం రూ.65వేల కోట్ల కేంద్రం కేటాయింపులు
- ఆరోగ్యం, విద్యారంగాలలో వృద్ధి సాధిస్తే తప్ప అనుకున్న లక్ష్యాలకు చేరుకోలేం
- ఉపాధి హామీ కార్యక్రమాన్ని డిమాండ్ డ్రివెన్ కార్యక్రమంగా తీసుకోవాలి
- అధికారులు దృష్టిపెట్టిన చోట స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డు కార్యక్రమం మెరుగైన ఫలితాలు సాధించింది
- 8.2 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం
- 2,400 కోట్ల రూపాయల విలువైన పంటను కాపాడుకున్నాం
- 8 లక్షల హెక్టార్లలో పంటను కాపాడుకోగలిగా