రేపు, ఎల్లుండి కలెక్టర్‌లతో సీఎం వైఎస్‌ జగన్‌ కాన్ఫరెన్స్‌ | YS Jagan Holds Collectors Conference At Praja Vedika From Tomorrow | Sakshi
Sakshi News home page

రేపు, ఎల్లుండి కలెక్టర్‌లతో సీఎం వైఎస్‌ జగన్‌ కాన్ఫరెన్స్‌

Published Sun, Jun 23 2019 9:23 PM | Last Updated on Sun, Jun 23 2019 9:36 PM

YS Jagan Holds Collectors Conference At Praja Vedika From Tomorrow - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ సమావేశం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పాడ్డక జరుగుతున్న తొలి కలెక్టర్ల సమావేశం కావడంతో.. దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నిలిపేందుకు స్పష్టమైన కార్యచరణతో ముందుకుసాగుతున్న ముఖ్యమంత్రి ఈ సమావేశంలో తన భవిష్యత్‌ ప్రణాళికలను కలెక్టర్లకు వివరించనున్నారు. అలాగే నవరత్నాల అమలు, అవినీతి రహిత పాలన, పారదర్శక పాలన ప్రధాన అజెండాగా ఈ కాన్ఫరెన్స్‌ సాగనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరుకానున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement