praja vedika
-
నోయిడా ట్విన్ టవర్స్- ఏపీ ప్రజావేదిక.. రెండూ కరెక్టేనా!
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా వద్ద రెండు భారీ ట్విన్ టవర్స్‌ను కూల్చివేసిన ఘట్టం దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షించింది. సుమారు నలభై అంతస్తుల భవనాన్ని కేవలం తొమ్మిది సెకన్లలోనే కూల్చేవేయడం ఒక ముఖ్యమైన అంశం అయితే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మరో ప్రధాన అంశం. సుప్రీంకోర్టు ఇచ్చింది కనుక ఈ ఆదేశాలు వివాదాస్పదం కాలేదు. రాజకీయ పార్టీలు దీనిపై విమర్శలకు దిగలేదు. అక్రమ భవనం అని కోర్టు నిర్థారించింది. అంతకు ముందు గత ఏడాది కేరళలోని కొచ్చి వద్ద నదీతీర ప్రాంతంలో నిర్మించిన మరో భారీ బహుళ అంతస్తుల భవంతిని కూడా సుప్రీం ఆదేశాల మేరకు కూల్చివేయవలసి వచ్చింది. ఈ ఘట్టాలు దేశానికి ఒక మంచి సందేశం ఇచ్చాయనే చెప్పాలి. చదవండి: పవన్ కల్యాణ్‌ని తిట్టిస్తున్నారని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం? తాత్కాలికంగా కొంతమంది వ్యక్తులకు ఈ పరిణామం అసౌకర్యం కలిగించినా, భవిష్యత్తులో బిల్డర్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడడకుండా ఉండడానికి ఇది ఆస్కారం ఇస్తుంది. విశేషం ఏమిటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అక్రమ సౌధం నేలకూలింది అన్న శీర్షికతో వార్తలు ఇచ్చిన ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు, ఏపీలో అక్రమ నిర్మాణాలు తొలగిస్తే మాత్రం విధ్వంసం అని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై బురదచల్లే యత్నం చేశాయి. విజయవాడ సమీపంలోని ఉండవల్లిలో కృష్ణా కరకట్టను ఆనుకుని పలు భవనాలు వెలిశాయి. అవన్ని కోస్టల్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించినవే. ప్రైవేటు వ్యక్తులే కాకుండా ప్రభుత్వం కూడా ఏకంగా ప్రజావేదిక పేరుతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో ఒక అక్రమ నిర్మాణం చేశారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. అధికారులు వద్దని సలహా ఇచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం నదీని అనుకుని ఎలాంటి నిర్మాణాలు జరగరాదు. దానికి నిర్దిష్టదూరంలోనే నిర్మాణాలు ఉండాలి. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. చివరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబే స్వయంగా ఒక అక్రమ నిర్మాణంలో బస చేశారు. కొందరు పర్యావరణ వేత్తలు వచ్చి దీనిపై అభ్యంతరం చెప్పినా, వారిపై నిర్భంధాలు విధించారే కాని, చేసిన తప్పును సరిదిద్దుకోలేదు. ఓటుకు నోటు కేసు తర్వాత హైదరాబాద్ నుంచి అకస్మాత్తుగా విజయవాడకు వెళ్లిపోయిన చంద్రబాబు, లింగమనేని రమేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన అతిథి గృహ భవనంలో మకాం చేశారు. దీనికి ప్రతిగా ఆయనకు రాజధాని భూముల పూలింగ్‌లో మినహాయింపులు ఇచ్చి లాభం చేశారన్న అభియోగం ఉంది. అది వేరే విషయం. చంద్రబాబు ఈ ఇంటిలో దిగడానికి కొన్ని నెలల ముందు ఆయన క్యాబినెట్‌లోని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణానదిలో వరదను పరిశీలించడానికి వెళ్లి, ఈ అక్రమ నిర్మాణాలను గమనించి వీటన్నిటిని తమ ప్రభుత్వం కూల్చివేస్తుందని అప్పట్లో ప్రకటించారు. తీరా సీన్ కట్ చేస్తే ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న టీడీపీ అధినేతే అలాంటి అక్రమ భవనం ఒకదానిలో దిగేసరికి ఉమా కూడా సైలెంట్ అయిపోయారు. తన ఇంటి వద్ద సదుపాయంగా ఉంటుందని భావించి ప్రజావేదిక పేరుతో ఒక కన్వెన్షన్ హాల్ తరహాలో నిర్మించుకున్నారు. 2019లో టీడీపీని ఓడించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి ఈ ప్రజావేదికలో ఒక సదస్సు పెట్టి, ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేయడం ఏమిటని ప్రశ్నించి దానిని కూల్చివేయాలని ఆదేశించారు. అంతే: చంద్రబాబుతో సహా, పలువురు టీడీపీ నేతలు, వారికి వంత పాడే మరికొన్ని ఇతర పార్టీల నేతలు ఇంకేముంది విధ్వంసం అంటూ ప్రచారం చేశారు. ప్రజావేదిక కూల్చి ఏడాది అయిందంటూ మరోసారి ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇదొక్కటే కాదు. ఏపీలో ఎక్కడ అక్రమ కట్టడం ఉన్నా, చివరికి అది గోడ అయినా, దానిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనో టీడీపీ వారు అడ్డుకోవడం, వెంటనే స్టేలు తీసుకు రావడం చేశారు. చిత్రంగా గౌరవ హైకోర్టు వారు కూడా కారణం తెలియదు కాని, అలాంటి అక్రమ కట్టడాల కూల్చివేతకు ఎక్కువ సందర్భాలలో స్టే ఇచ్చారన్న అభిప్రాయం ఉంది. కృష్ణా కరకట్టపై ఉన్న భవనాలకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా, కొందరు హైకోర్టు నుంచి స్టే పొందగలిగారు. చివరికి టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నీటిపారుదల శాఖ స్థలంలో అక్రమంగా నిర్మించిన ప్రహరిగోడను కూల్చినా టీడీపీ మీడియా, టీడీపీ నేతలు రచ్చ,రచ్చ చేశారు. న్యాయ స్థానం నుంచి కూడా వారికి కొంత సానుకూలమైన ఆదేశాలు వచ్చాయి. విశాఖలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమించి గోడ కట్టిన గీతం యూనివర్శిటీలో ఆ గోడను తొలగించినప్పుడు కూడా ఇదే తంతు. కాని ఇప్పుడు సుప్రీంకోర్టు వారు నోయిడాలో ఏకంగా వందల కోట్ల రూపాయల విలువైన భారీ భవనాలను కూల్చివేయించారు. ఈ కూల్చివేతకు సుమారు ఇరవై కోట్ల వ్యయం అయిందని వార్తలు వచ్చాయి. ఈ భవనాలను నిర్మించిన బిల్డర్లు తమకు 500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. అంత ఖరీదైన భవనాల నిర్మాణానికి సహకరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు. కాని కొందరు మాత్రం ఇలా కూల్చడం కన్నా, ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తే బాగుండేదన్న వాదనను తీసుకు వస్తున్నారు. సుప్రీంకోర్టే ఆ పని చేస్తే, ఇక ప్రభుత్వాలు దానిని మరింతగా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రతివాదన చేసేవారు అంటున్నారు. కూల్చివేత ఘట్టం పూర్తి అయ్యాక, ఈ వాద, ప్రతివాదాలకు పెద్దగా విలువ ఉండదు. మరికొన్ని ఘట్టాలు కూడా గుర్తు చేసుకోవాలి. ఉత్తరప్రదేశ్‌లో అఘాయిత్యాలకు పాల్పడిన రౌడీషీటర్ల ఇళ్లను, మతకలహాలకు కారకులైనవారి ఇళ్లను అవి అక్రమమైనవి అయితే బుల్ డోజర్లు తీసుకు వెళ్లి కూల్చివేశారు. దానిని సుప్రీంకోర్టు కూడా నిలువరించలేదు. దాంతో యూపీ ప్రభుత్వానికి బుల్ డోజర్ ప్రభుత్వం అన్న పేరు కూడా కొంతమంది పెట్టారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో వరదనీరు, డ్రైనేజీ వ్యవస్థ పారే నాలాల మీద ఇళ్లు కడితే వాటిని ఎందుకు కూల్చలేదని న్యాయస్థానం ఒక సందర్భంలో ప్రశ్నించింది. దాంతో అక్కడ ఉంటున్నవారికి ప్రత్యామ్నాయం చూపుతూ ఆ ఇళ్లను పలు చోట్ల కూల్చివేశారు. బాచుపల్లి అనే చోట అనుమతులు లేకుండా నిర్మించిన 200 పైగా విల్లాలను కూడా అధికారులు కూల్చివేశారు. అయినా ఇక్కడ ఎవరూ దానిని విధ్వంసంగా అభివర్ణించలేదు. ఏపీలో మాత్రం ప్రతిపక్ష టీడీపీ,దానికి వంతపాడే ఈనాడు, తదితర మీడియా మాత్రం ఆ తరహా ప్రచారం చేశాయి. నొయిడా ఘటన తర్వాత కూడా ప్రజా వేదికను తీసివేసిన విషయాన్ని విధ్వంసంగానే ప్రచారం చేస్తారా? ఏపీకి సపరేట్ రాజ్యాంగం ఉందని వారు భావిస్తారా?. కృష్ణానది అనుకుని ఉన్న విలాసవంత భవనాల ద్వారా కాలుష్యం నదిలో కలుస్తోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అయినా ఏపీ వరకు మినహాయింపు ఇవ్వాలని వీరు అభిలషిస్తారా? ఈ మొత్తం ప్రకియలో టీడీపీ, అనుబంధ మీడియా ఆత్మరక్షణలో పడినట్లయింది. సుప్రీం కోర్టు చేసింది విధ్వంసమా?లేక నిబంధనలు పాటించడమా అన్నదానిపై వీరు నోరు విప్పలేని పరిస్థితి. అయితే కొన్నాళ్లకు అంతా మర్చిపోయారని అనుకున్న తదుపరి యథా ప్రకారం టీడీపీ కాని, వారి మీడియా కాని విధ్వంసపు రాతలు రాయకుండా ఉంటాయని భావించలేం. ఎందుకంటే టీడీపీ ఓడిపోతే రామోజీరావు తదితర మీడియా సంస్థల యజమానులు తామే ఓడిపోయామని ఫీల్ అవుతున్నారు. ఎలాగైనా చంద్రబాబును గద్దె ఎక్కించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చన్నది వారి ఆలోచన. ఇందు కోసం వారు పడరాని పాట్లు పడుతున్నారు. అయినా జగన్ వీటన్నిటిని సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. అంతిమంగా ప్రజావేదిక కూల్చివేత విషయంలో జగన్‌దే కరెక్టు అని సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాల ద్వారా తేలిందని అనుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
హెరిటేజ్ డబ్బుతో ఏమైనా కట్టారా లోకేశ్?
సాక్షి, అమరావతి : ‘ప్రజావేదిక అనే రేకుల షెడ్డును హెరిటేజ్ కంపెనీ డబ్బుతో ఏమైనా కట్టారా?’ అని టీడీపీ ఎమ్మెల్సీ నారాలోకేశ్‌ను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ‘అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చేయడంపై మీరు, మీ ముఠా సభ్యులు తెగ ఆవేశపడుతున్నారు. రూ.50 లక్షల విలువ చేయని తాత్కాలిక నిర్మాణానికి రూ.9 కోట్లు దోచుకుతిన్నది బయట పడిందనా..? ఈ ఏడుపులు..? కిరాయి మనుషులతో పరామర్శలు, విషాద ఆలాపనలు ఏందయ్యా?’ అని ఎద్దేవా చేశారు. సోమవారం ట్విటర్ వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకుల డ్రామాలపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ‘ఎవరు సలహా ఇచ్చారో కాని తనను ఓదార్చేందుకు రోజుకు 300 మందిని రప్పించుకుంటున్నారు చంద్రబాబు. వచ్చిన వాళ్లు బాగా రిహార్సల్ చేసి యాక్షన్ ఇరగదీస్తున్నారు. దేశంలోనే సంపన్నుడైన రాజకీయ నేతను, ఇల్లు లేకపోతే మా ఇంటికొచ్చి ఉండండయ్యా అనడం డ్రామా కాకపోతే మరేమిటి?’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజకీయ నేతలెవరైనా గెలిచినా, ఓడినా ప్రజల మధ్యన ఉండాలనుకుంటారని, చంద్రబాబు మాత్రం కాలు బయట పెట్టడానికి జంకుతున్నారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలిచ్చిన దిమ్మతిరిగే షాక్ నుంచి తేరుకోలేదో.. లేక వాళ్ల మీద అలిగారో.. లేకుంటే లింగమనేని ఎస్టేట్ ఉంటుందో పోతుందో అన్న కొత్త టెన్షన్ చంద్రబాబుకు మొదలైందోనని ఎద్దేవా చేశారు. ఆ రేకుల షెడ్డు ఒక హాస్పిటలో, బస్టాండో అయినట్టు చంద్రబాబు డ్రామా ఆర్టిస్టులు టీవీల ముందు ఆవేశపూరిత డైలాగులేస్తున్నారన్నారు. కిరాయి తీసుకున్నామనే సంగతి పక్కకు పెట్టి దానికి రూ.9 కోట్లు పెట్టారంటే ఎలా నమ్మాలయ్యా? అని చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు. ప్రజాధనానికి జవాబు చెప్పాల్సింది చంద్రబాబేనని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. -
ఏ రేకుకు ఆ రేకు విప్పారని అనాలట.!
సాక్షి, అమరావతి : అక్రమ నిర్మాణమైన ప్రజావేదిక కూల్చివేతను కూల్చడం అనొద్దని, ఏ రేకుకు ఆ రేకు విప్పారని అనాలని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన ట్విటర్ వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూలమీడియాపై ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు ప్రభుత్వం రూ.9 కోట్లు బొక్కి నిర్మించిన ప్రజావేదిక నాణ్యతపై సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్లు సర్క్యులేట్ అవుతున్నాయి. గణేశ్ మండపానికి ఎక్కువ, కోళ్ల షెడ్డుకు తక్కువని సోషల్ మీడియాలో యువత చెణుకులు విసురుతోంది. దాన్నికూల్చడం అనొద్దట. ఏ రేకుకు ఆ రేకు విప్పారని అనాలట.’ అని విజయసాయిరెడ్డి సెటైరిక్‌గా ట్వీట్ చేశారు. తమ అధినేత అవినీతిని సమర్థించడం మినహా కళా వెంకట్రావు చేయగలిగిందేముందనక్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు వేసిన అంచనాల ప్రకారం విద్యుత్తు కొనుగోళ్లపై అదనంగా రూ. 2,636 కోట్ల చెల్లింపులు జరిగాయని వెల్లడైందన్నారు. ప్రజాధనం లూటీ చేసిన వారు ఆ మొత్తాలను కక్కక తప్పదని తెలిపారు. అనుకూల మీడియా మళ్లీ చంద్రబాబు పల్లకి సేవ మొదలు పెట్టిందని, నదీ పరిరక్షణ చట్టం-1884, ఎన్జీటీ, సీఆర్డీఏ నిబంధనలు నదిని పూడ్చి నిర్మించిన కట్టడాలు అక్రమమని ఘోషిస్తున్నాయన్నారు. మీడియా కూడా ఈ చట్టాలు చదవాలని సూచించారు. బాబు నిర్మించాడు కాబట్టి కుల మీడియాకు అవి చారిత్రక కట్టడాల్లా కనిపిస్తున్నాయేమోనని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. -
జనచిత్తం దోస్తున్న కొత్తగాలి
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడో కొత్తగాలి వీస్తోంది. పలువురి భయ–సందేహాలను తుడిపేస్తూ, సరికొత్త ఆశల్ని చిగురింప చేస్తూ పిల్ల తెమ్మెరలా మొదలైన ఆ గాలి రోజురోజుకూ బలపడుతోంది. మార్పులకు వాకిళ్లు తెరుస్తోంది. రాజకీయంగానే కాక ఆ గాలి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులకూ సంకేతాలిస్తోంది. దాన్ని గుర్తించడం, అంగీకరించడం, ఆహ్వానించడం ఇప్పుడు ప్రధానం! ఎన్నికల ముందు తానిచ్చిన హామీలను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలుపరుస్తున్న తీరు, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహారశైలి... ఈ కొత్తగాలికి కారణం. అక్రమ నిర్మాణాల్లో తలదాచుకునగోరే ‘దశాబ్దాల అనుభవం’ కన్నా, నేలతో, అడవితో, అట్టడుగు మట్టి మనుషులతో మమేకమైన ‘నెల యోధుడి’ చొరవనే సరైన పాలనకు సంకేతమని జనన్నినాదం! రాజకీయాల్లో మార్పు రావాలన్నది చాలా కాలంగా ప్రజల ఆశ. అనేకుల ఆకాంక్ష. కవుల కల్పన. కళా ప్రక్రియల్లో వస్తువు. ప్రసంగాల్లో ఆదర్శం. కానీ, ఆచరణలో లోపం! ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడో కొత్తగాలి వీస్తోంది. పలువురి భయ–సందేహాలను తుడిపేస్తూ, సరికొత్త ఆశల్ని చిగురింప చేస్తూ పిల్ల తెమ్మెరలా మొదలైన ఆ గాలి రోజు రోజుకూ బల పడుతోంది. మార్పులకు వాకిళ్లు తెరుస్తోంది. రాజకీయంగానే కాక ఆ గాలి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులకూ సంకేతాలిస్తోంది. దాన్ని గుర్తించడం, గుర్తించడం కన్నా ముఖ్యంగా అంగీకరించడం, అంతకన్నా ప్రధానంగా ఆహ్వానించడం ముఖ్యం! ప్రముఖ కవి, రచ యిత, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న మాటల్లో చెప్పాలంటే.... ‘‘పార్టీ పిరాయింపులు మంచిది కాదని నేనీ సినిమాలో పాట రాసిన, కవులు పాటలు రాస్తరు, ఊహ చేస్తరు, ప్రజాస్వామ్యవాదులు, దార్శనికులు, దర్శకులు ఉన్నతమైన ఊహ చేస్తరు... కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి స్వయంగా ఆచరించి చూపాడు, అది ముఖ్యం..’’ అన్నారు. ఇంకో పార్టీ తరపున ఎన్నికై తమ పార్టీలోకి వస్తా మంటే వారిని తాము చేర్చుకోమని, ఫిరాయింపుల్ని ప్రోత్సహించబో మని, పదవులకు రాజీనామా చేయాల్సిందే... అన్నారంటూ ఆ సంద ర్భాన్ని ఆయన గుర్తు చేశారు. ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా గురించి మాట్లాడుతూ వెంకన్న ఈ వ్యాఖ్య చేశారు. దేశంలో పార్టీ ఫిరాయింపులొక ప్రహసనంగా మారి మార్కెట్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నపుడు, చట్టసభ వేదిక నుంచి ఏపీ ముఖ్యమంత్రి ఓ చరిత్రాత్మక ప్రకటన చేశారు. ‘...ఏమరుపాటుగా ఎవరైనా అలా పార్టీ మారి సభ కొచ్చినా... మీ అధికారాన్ని వినియోగించి ఆ సభ్యుల్ని అనర్హులుగా ప్రక టించండి’ అని స్పీకర్‌ను స్వయంగా కోరారు. పార్టీలకతీతంగా, విలు వలతో నడవాల్సిన స్పీకర్ స్థానపు ఔన్నత్యాన్ని అలా గుర్తు చేశారు. స్పీకర్ ఎన్నిక సందర్భంలో మాట్లాడుతూ ఈ సాహసోపేతమైన విలు వను సీఎం ప్రకటించారు. కానీ, ఈ చొరవకు జాతీయ మీడియాతో సహా ప్రసార మాధ్యమాలు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. పేరున్న ఇంగ్లీష్ పత్రికలు కూడా సాదాసీదాగానే రాశాయి. పార్టీ ఫిరాయింపులతో రాజ కీయ విలువలు దిగజారుతున్న ఈ తరుణాన వై.ఎస్. జగన్మోహన్రెడ్డి చూపిన చొరవ విస్తృతస్థాయిలో చర్చ జరగాల్సింది. ఒకటి, రెండు కాదు... గత నెలాఖరున ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన నుంచి ఒకటొ కటిగా జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకట నలు, వెల్లడిస్తున్న అభిప్రాయాలు తెలుగువాళ్లను ఎంతగానో ఆకట్టుకుం టున్నాయి. ఒక రకమైన సంతృప్తి వెల్లువ ఇపుడు రాష్ట్రమంతా అలుము కొని ఉంది. సామాన్య ప్రజానీకం నుంచి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, ఆలోచనాపరుల వరకు అందరూ తాజా పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. గతంతో పోల్చి చూసుకొని, ఏదో తెలియని ‘హాయి’ని పొందుతున్నారు. గిట్టని వాళ్లు, వారి అను‘కుల మీడియా’ పుణ్యమా అని లోగడ ఎంత దుష్ప్రచారం జరిగింది? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రత్యర్థి రాజకీయ వర్గాల్లోని వారికీ, తాజా స్థితి కొంత ఆశ్చర్యంగానే ఉంది. ఎన్నికలకు ముందు ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు, కల్పించిన భరోసా, ప్రకటించిన హామీలు క్రమ క్రమంగా ఆచరణలోకి వస్తున్న తీరు అధికుల్ని విస్మయ పరుస్తోంది. ఏ హంగూ, ఆర్భాటం, నాటకీయత లేకుండా... ఇంత సహజంగా కార్యా చరణ సాధ్యమా? అన్నది వారి ముందొక పెద్ద ప్రశ్న. ఇది విలువల రాజకీయాల్ని పరిచయం చేస్తున్న కొత్తగాలి అనేది వారి భావన. తొలి సంతకం నుంచి ‘అమ్మ ఒడి’ ఇంటర్ విద్యార్థులకు వర్తింపజేస్తామన్న గురువారం నాటి ప్రకటన వరకు... జనహితంలో ఎన్నెన్ని నిర్ణయాలో! బడుగు బలహీన వర్గాలకు సమున్నత స్థానం కల్పిస్తూ మంత్రివర్గాన్ని కూర్చిన తీరు సంచలనమే అయింది. ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన దానికన్నా పిసరంత ఎక్కువే తప్ప లోపం లేదు. డొల్లతనం లేదు, నాన్చుడు లేదు, డొంక తిరుగుడు అంతకన్నా లేదు. ‘ఆశా’కార్యకర్తల జీతాలు వృద్ధి, హోంగార్డులు, పారిశుధ్య పనివారల వేతనాల పెంపు, ఉద్యోగుల సీపీఎస్ రద్దు–ఐ.ఆర్ ప్రకటన, రైతు పెట్టుబడి సహాయాన్ని ముందుకు జరపడం, పోలీసుల వారంతపు సెలవు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం... ఇలా చెప్పుకుంటూ వెళితే జాబితా పెద్దదే! ఇదొక ఆత్మీయ ప్రభుత్వంలా ఉంది. ఓదార్పు, ప్రజాసంకల్ప పాదయాత్ర, దీక్షలు... ఏదయితేనేం, పార్టీ స్థాపించక ముందు నుంచి నేటికీ, నిరంతరం ఆయన ప్రజల్లో ఉండటం వల్లనేమో ‘కొత్త సీఎం’ అన్న భావనే ప్రజలకు కలగటం లేదు. సీఎంని, ఆయన ప్రభుత్వాన్ని తమ నిజమైన ప్రతినిధిగా పౌరులు భావిస్తున్నారు. కొత్త శాసనసభ తొలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు చెబుతూ, ‘ఎన్నికల వరకే రాజకీయాలు... గెలిచాక తరతమ భేదాల్లేవు, మనం ప్రజలందరికీ ప్రతినిధులం, జవాబు దారులం’ అన్న సీఎం మాటలు విశ్లేషకులకు తరచూ గుర్తొస్తున్నాయి. కుటుంబపెద్దను చూస్తున్న యంత్రాంగం స్వల్ప కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు తమ రాజకీయ పెద్ద దాదాపు అర్థమైపోయాడు. నస లేదు, సోది ప్రసంగాలకు తావే లేదు. ఏదైనా... లోతైన పరిశీలన, అధ్యయనంతోనే మాట్లాడటం. అదీ, ఆత్మీ యంగా! మర్యాదకు ఎక్కడా లోటు లేదు. ముక్కుసూటిగా, ముక్తసరిగా తన మనోభావాల్ని వ్యక్తం చేయడం. ఏది వద్దో చెప్పడం, ఏది కావాలో విస్పష్టంగా అడగటం, ఇది వారికీ బాగుంది. సాంకేతికాంశాలపైన కూడా సాధికారతతో సీఎం జరిపిన పోలవరం రివ్యూని పలువురు ఇంజనీరింగ్ సీనియర్లు మననం చేసుకుంటున్నారు. ఇదివరకటి చేదు అనుభవాల దృష్ట్యా, ఇప్పుడు ముఖ్యమంత్రి సమీక్షల్లో పాల్గొంటున్న ఉన్నతాధికారులు భిన్నమైన వాతావరణం చూస్తున్నారు. గంటల తర బడి వేధింపుల పర్వం లేదు. లోపలొకటి బయటొకటిగా కాకుండా ఉన్న దున్నట్టుగా మాట్లాడుతూ, తమకు ఇరకాట పరిస్థితి కల్పించని నాయ కత్వం అనే భావన వారిలో వ్యక్తమౌతోంది. ‘పాలకులం కాదు, ప్రజా సేవకులం...’ అన్న ముఖ్యమంత్రి సందేశం అధికారులకు బోధపడింది. ‘మాకు ఓటు వేయని వారికి కూడా మన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందాలి. వారు అర్హులైతే చాలు! అదే ప్రాతిపధిక .... కాల క్రమంలో వారే ఆత్మవిమర్శ చేసుకొని, తమ వైఖరి మార్చుకోవాలి’ అంటూ కలెక్టర్ల సమావేశంలో వెలిబుచ్చిన అభిప్రాయంలోనే సీఎం కార్యాచరణ ఎంతటి విశాల దృక్పథంతో చేపట్టిందో అధికార గణానికి అర్థమైంది. ‘చిన్న వయసులో ఇంతటి పరిపక్వత ఊహించలేద’న్న సీని యర్ అధికారి అభిప్రాయం వాస్తవిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఒక భేటీతోనే రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు రాబోయే రోజు లెలా ఉంటాయో అర్థమైపోయింది. పనిపై శ్రద్ద పెట్టి ఫలితాల ద్వారా తమ సత్తా చూపించుకోవడానికి ఈ పరిస్థితినొక అవకాశంగా వారు పరిగణిస్తున్నారు. తండ్రి పంథా తనయునికో వరం జన హృదయాలు గెలిచిన నాయకుడిగా దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డికున్న మంచి పేరే కాక, ఆలోచనలూ ఆయన తనయుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ప్రభావితం చేస్తున్నాయి. విశాల జనహితం కోరే వైఎస్ పంథా నేటికీ పరిపాలనకు దారులు పరు స్తోంది. వైఎస్సార్ తన పాతికేళ్లకు పైబడ్డ రాజకీయ ప్రస్తానంలో చూసిన, చేసిన పలు ఆర్థిక, రాజకీయ, సామాజికాంశాల్లోని ప్రయోగాలు ఇప్పు డీయన మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. ఆయా ప్రయోగాల తర్వాత, సందేహాలకతీతంగా దృవపడ్డ విధానాలను ప్రస్తుత సీఎం నేరుగానే చేప డుతున్నారు. అవసరాన్ని బట్టి, అదనపు అంశాల్నీ చేర్చి మరింత మెరు గుపరుస్తున్నారు. అమ్మ ఒడి, తొమ్మిది గంటలు పగటిపూటే ఉచిత విద్యుత్తు యత్నం వంటివి ఆ కోవలోవే! అనేక విషయాల్లో పెద్దాయన ఆలోచనలూ తనయుడ్ని ప్రభావితం చేస్తున్నాయి. విధానాల్లో, నిర్ణ యాల్లో, సాధనలో... అవి ప్రతిబింబిస్తున్నాయి. మచ్చుకు, నిన్నటి ఎన్ని కల్లో వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లు సాధించడమే ఓ నిదర్శనం! 1999 ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పదిరోజుల్లోనే, ఒక రాత్రి భోజన భేటీలో మేం ముగ్గురు జర్నలిస్టులం డా‘‘ వైఎస్సార్‌తో ఉన్నాం. సీనియర్ నాయకుడు మణి శంకర్ అయ్యర్ తనతో అన్న మాటల్ని వైఎస్సార్ గుర్తు చేసుకున్నారు. ‘ప్రచార సమయంలోనే మీరు గెలిచినంత పని చేశారు. ఆ ఊపు చూసి బెంబేలెత్తిపోయిన సీఎం చంద్ర బాబు అతిజాగ్రత్తకు వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, వాజ్‌పేయ్‌పై ఉన్న సానుభూతి, కార్గిల్ యుద్ద ప్రభావం వల్ల వారి ఉమ్మడి ఓటింగ్ శాతం పెరిగింది. మీ ఓటింగ్ శాతం తగ్గి ఓటమి తప్పలేదు’ అని అయ్యర్ విశ్లేషించినట్టు చెప్పారు. ‘..ఎదుటి వారి పొత్తులు, జిత్తులెలా ఉన్నా... 50 శాతానికి పైబడి ఓట్లు సాధించడం లక్ష్యంగా పనిచేస్తేనే విజయం ఖాయమవుతుంది’ అని వైఎస్ తన సంకల్పం చెప్పారు. అది తనయుడు జగన్మోహన్రెడ్డి ఈ ఎన్నికల్లో నిరూపించారు. కూల్చివేత ఓ సంకేతం అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తామని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు. ఆచరణను ప్రజలు గమనిస్తున్నారు. ఇదే సమ యంలో, కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణం ‘ప్రజావేధిక’ కూల్చివే తకు ప్రభుత్వం తలపెట్టడాన్ని కొందరు మేధావులు చర్చకు తెస్తున్నారు. ‘ఇవేం వందల ఏళ్లనాటివి కావు, కోట్ల రూపాయల వ్యయంతో ఇటీవలే కట్టిన భవనాలు, అయినా కూలుస్తారా?’ అంటున్న మేధావులకొక ప్రశ్న. కృష్ణా నది కరకట్టపై నిర్మాణాలన్నీ త్వరలోనే కూల్చేస్తాం....’ అని స్థానిక అధికార టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి నాటి మంత్రి పలికినా మాట్లా డని మీ మౌనం దేనికి సంకేతం? కొద్ది ఖర్చుతో కట్టుకునే పేదల ఇళ్ల యితే కూల్చొచ్చు! పెద్ద ఖర్చుతో ప్రభుత్వం కట్టే అక్రమనిర్మాణాలు కూల్చొద్దా? ‘ఇకపై బాక్సైట్ తవ్వకాలుండవని ప్రకటిస్తూనే, గంజాయి సాగువద్దు అడవి బిడ్డలారా, మీకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలు చూపుతామం’టున్న ప్రస్తుత ముఖ్యమంత్రి విచక్షణ ఓ కొత్త గాలి. అక్రమ నిర్మాణాల్లో తలదాచుకునే ‘దశాబ్దాల అనుభవం’ కన్నా, నేలతో, అడవితో, అట్టడుగు మట్టి మనుషులతో మమేకమైన ‘నెల యోధుడే’ సరైన పాలకుడన్నది జనన్నినాదం! -దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
‘బాబు దుబారాకు ప్రజావేదిక ఓ నమూనా’
సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజావేదిక పేరుతో ప్రజాధనాన్ని దుబారా చేసిన తీరును వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి ఎండగట్టారు. కోటి రూపాయలు ఖర్చేయ్యే ప్రజావేదిక తాత్కాలిక నిర్మాణానికి రూ. 9 కోట్లు వెచ్చించినట్టు చూపడంపై విస్మయం వ్యక్తం చేశారు. ప్రజా వేదిక అనే రేకుల షెడ్డు నిర్మాణంలో సిమెంటు కంటే సినిమా సెట్టింగ్‌ల్లో వాడే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌నే ఎక్కువగా వాడినట్టు కనిపిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన నిర్మాణాలన్నీ ఇలానే ఉంటాయని, ఇది అందుకు ఓ చిన్న నమూనానే అన్నారు. ఇక ప్రజావేదిక షెడ్డు కూల్చివేతను చూసేందుకు వచ్చిన ప్రజలకు ఉన్న అవగాహన కూడా టీడీపీ నేతలకు లేకపోవడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. రైతుల నుంచి సేకరించిన 33 వేల ఎకరాల్లోనే ప్రజావేదికను నిర్మించి ఉంటే ఇవాళ పెద్దమొత్తంలో ప్రజాధనం వృధా అయ్యేది కాదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. (చదవండి: భారీ భద్రత నడుమ కొనసాగుతున్న ప్రజావేదిక తొలగింపు) -
అక్రమ నిర్మాణాల్ని కూల్చకూడదట
-
భారీ భద్రత నడుమ ప్రజావేదిక తొలగింపు పనులు
సాక్షి, అమరావతి : రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలోని కృష్ణా కరకట్ట వద్ద అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక తొలగింపు పనులు మూడవ రోజు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి సమయానికి దాదాపు 80 శాతానికి పైగా తొలగింపు పనులు పూర్తయ్యాయి. ఉపయోగించుకోవటానికి వీలుగా ఉండే వాటిని జాగ్రత్తగా పక్కకు తీస్తున్న నేపథ్యంలో ఈ గురువారం కూడా తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. మాజీ సీఎం ఇంటికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రజావేదిక భవనాన్ని తొలగిస్తున్న నేపథ్యంలో ఘర్షణలు, ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది కరకట్టను ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజావేదికను కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ప్రజావేదిక నిర్మాణం కూల్చివేతలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. స్టే ఇచ్చేందుకు ఎటువంటి కారణం కనిపించడం లేదని స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణమని మీరే చెబుతున్నప్పుడు ఎలా జోక్యం చేసుకోగలమని పిటిషనర్‌ను ప్రశ్నించింది. -
80 శాతానికి పైగా తొలగించిన ప్రజావేదిక
-
ప్రశాంతంగా తొలగింపు
సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలోని కృష్ణా కరకట్ట వద్ద అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక తొలగింపు పనులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం నుంచి కొనసాగుతున్నాయి. సీఆర్డీఏ అధికారులు అక్కడికి చేరుకుని తొలగింపు పనులపై సిబ్బందికి సూచనలు చేశారు. బుధవారం రాత్రి సమయానికి దాదాపు 80 శాతానికి పైగా అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. పైకప్పును మాత్రం అలాగే ఉంచారు. రేకులను తొలగించాల్సి ఉన్నందున గురువారం నాటికి పైకప్పు కూడా తొలగించి పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రజావేదిక తొలగింపు పనులు సాగుతున్న సమయంలో మంగళవారం అర్ధరాత్రి కొందరు టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అక్రమ కట్టడమైనా తొలగించరాదంటూ పట్టుబట్టారు. బాబు నివాసంలో తర్జనభర్జన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. రాత్రి 11 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. వీరంతా చంద్రబాబు కాన్వాయ్ వెంట ఆయన నివాసం వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్రమ నిర్మాణం తొలగింపు పనులు కొనసాగుతుండడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం బ్యారేజి నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వరకు ఆయన కాన్వాయ్‌ను మాత్రమే అనుమతించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో పాటు మరో 10 మంది జిల్లా నాయకులు ఈ వాహన శ్రేణిలోనే చంద్రబాబు నివాసానికి చేరుకుని దాదాపు ఒంటి గంట వరకు ఆయనతో చర్చించారు. అక్రమ నిర్మాణం తొలగింపుపై ఎలా స్పందించాలనే విషయంపై తర్జనభర్జన పడ్డారు. అయితే దీనిపై స్పందించకపోవడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం కావడం, అప్పటికే హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేసినందున ఆందోళన చేయడానికి టీడీపీ నేతలు వెనుకాడారు. భారీ బందోబస్తు ఏర్పాటు మాజీ సీఎం ఇంటికి అత్యంత సమీపంలోనే ఉన్న ప్రజావేదికను తొలగిస్తున్న నేపథ్యంలో ఘర్షణలు, ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 150 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. అక్రమ నిర్మాణ తొలగింపు పనులను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంత్రి పేర్ని నాని తదితరులు బుధవారం ఉదయం పరిశీలించారు. కాగా ఉదయం నుంచి రాత్రి వరకు చంద్రబాబు రోజంతా తన ఇంటిలోనే గడిపారు. -
‘ప్రజావేదిక’పై జోక్యానికి హైకోర్టు నో
సాక్షి, అమరావతి: ప్రజావేదిక నిర్మాణం కూల్చివేతలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. స్టే ఇచ్చేందుకు ఎటువంటి కారణం కనిపించడం లేదని స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణమని మీరే చెబుతున్నప్పుడు ఎలా జోక్యం చేసుకోగలమని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అలాగే నిర్మాణంలో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణలను ఆదేశించి వారికి నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా ప్రజావేదిక నిర్మాణం, కూల్చివేతకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటివనరుల శాఖ, పురపాలక శాఖ, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శులు, తదితరులను ఆదేశించింది. కాగా, నిర్మాణంలో అక్రమాలపై విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం నివేదించింది. ప్రజావేదిక నిర్మాణ అంచనా వ్యయాన్ని రూ.5 కోట్ల నుంచి రూ.8.9 కోట్లకు పెంచడం వల్ల ఖజానాకు వాటిల్లిన నష్టాన్ని బాధ్యుల నుంచి రాబట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణను జూలై 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.సీతారామమూర్తి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను కూల్చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రకాశం జిల్లా స్వర్ణకు చెందిన పోలూరి శ్రీనివాసరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. హౌస్‌మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలన్న పిటిషనర్ అభ్యర్థనపై కోర్టు సానుకూలంగా స్పందించింది. ముందుగా పిటిషనర్ తరఫున పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. కూల్చివేత వల్ల ప్రజాధనం వృథా అవుతోందన్నారు. మంత్రిమండలితో, అధికారులతో చర్చించకుండానే ముఖ్యమంత్రి కూల్చివేత నిర్ణయాన్ని తీసుకున్నారని, ఇది సమంజసం కాదన్నారు. ప్రజావేదిక చంద్రబాబుది కాదని, అది ప్రభుత్వ ఆస్తి అని, దాన్ని కాపాడుకునేందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశానని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రజావేదిక అక్రమ నిర్మాణమా? కాదా? అని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణమేనని కృష్ణయ్య చెప్పడంతో మీరే అక్రమమని చెబుతున్నప్పుడు కూల్చివేత విషయంలో ఎలా జోక్యం చేసుకోమంటారని ఆయనను నిలదీసింది. ప్రభుత్వం ధర్మకర్త మాత్రమే.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనరే ప్రజావేదికను అక్రమ నిర్మాణమని ఒప్పుకుంటున్నారని, అటువంటప్పుడు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకుండా చూడాలని ఎలా కోరతారని ప్రశ్నించారు. ప్రజావేదికను తనకు కేటాయించాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కోరారని, దాన్ని ఆయనకు దక్కేలా చేసేందుకే పిటిషనర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని చెప్పారు. సీఆర్డీఏ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎంసీ మెహతా వర్సెస్ కమల్‌నాథ్ కేసులో సుప్రీంకోర్టు నదీ పరీవాహక ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాలపై స్పష్టమైన తీర్పునిచ్చిందని, దీనిప్రకారం నదీ పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలకు, భూములకు పట్టాలివ్వడానికి, ఆ భవనాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి అధికారం లేదన్నారు. ప్రభుత్వం కేవలం ధర్మకర్త మాత్రమేనన్నారు. కూల్చివేత చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కాదన్నారు. ఏజీ, అదనపు ఏజీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం పైన పేర్కొన్న విధంగా ఆదేశాలు జారీ చేసింది. అక్రమ కట్టడాలన్నింటికీ నోటీసులు సీఆర్డీఏ అధికారులకు సీఎం ఆదేశం అక్రమ కట్టడాలను తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రాజధాని వ్యవహారాలపై సీఆర్డీఏ అధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించిన ఆయన పలు సూచనలు చేశారు. ఎక్కడా ఒక్క అక్రమ కట్టడం కూడా ఉండకూడదని స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలన్నింటినీ గుర్తించి.. సంబంధిత వ్యక్తులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. -
చంద్రబాబు నివాసంలో పార్టీ ముఖ్య నేతల భేటీ
-
‘నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి’
సాక్షి, తూర్పు గోదావరి: కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్థించిందని వైఎస్సార్సీపీ తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. హైకోర్టు తీర్పును కూడా అగౌరవ పరిచే విధంగా కొందరు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని.. ఇది ఖచ్చితంగా కోర్టు తీర్పు ఉల్లంఘనే అని విమర్శించారు. మాజీ మంత్రి యనమల ఒక రకమైన నిస్పృహలో ఉన్నారని, సీఎం జగన్‌పై ఆయన చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు తమ నోటిని అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలని రాజా హెచ్చరించారు. చంద్రబాబు నాయుడి తుగ్లక్ పాలన చేయబట్టే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారని ఎద్దేవా చేశారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీకి 23 ఎమ్మెల్యే లు, ముగ్గురు ఎంపీలతో ప్రజలు సరిపెట్టారని.. వైఎస్ జగన్ పరిపాలనను రాష్ట్ర ప్రజలంతా కొనియాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేత దిశగా ప్రభుత్వం ముందడుగు వేయడం శుభపరిణామం అన్నారు. -
చంద్రబాబు నివాసంపై మంత్రి బొత్స కామెంట్..
సాక్షి, అమరావతి: ప్రజావేదిక అక్రమ నిర్మాణం కనుకనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దానిని కూల్చివేయాలని నిర్ణయించారని మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రెండు రోజుల పాటు సాగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం తన నిర్ణయాన్ని చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. టీడీపీ నేతలపై ఎలాంటి కక్షలతో ఈ ప్రజా వేదికను కూల్చడం లేదని స్పష్టం చేశారు. ప్రజావేదిక కూల్చే ప్రక్రియ కొనసాగుతుందని.. చట్టం తన పనితాను చేసుకుపోతుందని మంత్రి అభిప్రాపడ్డారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివసిస్తున్న ఇంటి వ్యవహారాన్ని తన విజ్ఞతకే విడిచిపెడుతున్నామని అన్నారు. చంద్రబాబు కుటుంబ భద్రతా అంశంలో నిబంధనలను అనుసరించాలని.. దానిలో తమ సొంత నిర్ణయం ఏమీలేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం కృష్ణానది కరకట్టపై నిర్మించిన ప్రజావేదిక కూల్చివేసేందుకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. -
‘రూ. 8 కోట్లు అన్నారు.. ఇక్కడేమో రేకుల షెడ్డు’
సాక్షి, విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అక్రమాలకు ప్రజావేదికను అడ్డం పెట్టుకున్నారని రాష్ట్ర సమాచార శాఖా మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అక్కడ నిర్మాణం అక్రమమని తెలిసినా చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా...చంద్రబాబు తన అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకే ప్రజా వేదికను నిర్మించారని ఆరోపించారు. చట్టాలంటే ఆయనకు ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. అందుకే జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) నిబంధనల పట్ల ముఖ్యమంత్రిగా ఏనాడు చిత్తశుద్దితో వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. ప్రజావేదికలో ఉన్న విలువైన పరికరాలను మళ్లీ వాడుకునేందుకు అధికారులు వాటిని బయటకు తరలించారని పేర్కొన్నారు. సాధ్యమైనంతవరకు నష్టాన్ని తగ్గించేలా చూస్తున్నామని వెల్లడించారు. ప్రజావేదిక కోసం ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నారు.. కానీ ఇక్కడ చూస్తే మాత్రం రేకుల షెడ్డు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కాగా కృష్ణా నది కరకట్టపై గత టీడీపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ప్రజావేదికను కూల్చివేయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. దీంతో సంబంధిత అధికారులు ప్రజావేదికను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. -
ఉండవల్లిలోని ప్రజావేదిక భవనం కూల్చివేత ఫోటోలు
-
‘చంద్రబాబు ఖాళీ చేయాల్సిందే’
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం పక్కన అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం భూమిని లాక్కుని ప్రజావేదిక నిర్మించిందని, చంద్రబాబు అండతో కరకట్టపై అక్రమ కట్టడాలు చేపట్టారని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి చట్టానికి తూట్లు పొడిచారని విమర్శించారు. అక్రమ కట్టడాలతో నదీ గర్భం కలుషితమవుతోందని, కరకట్టపై అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయాలని స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలపై ముందునుంచి న్యాయపోరాటం చేస్తున్నామని, కరకట్టపై 60పైగా అక్రమ కట్టడాలకు నోటీసులు కూడా అందాయన్నారు. కేసు కోర్టు ముందుకు రాకుండా చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేశారని ఆరోపించారు. కరకట్టపై చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమేని, ప్రజావేదిక కూల్చివేత తర్వాతైనా చంద్రబాబు ఖాళీ చేయడం మంచిదన్నారు. మిగిలిన వాళ్లు కూడా తమకు తాముగా ఖాళీ చేయాలని సూచించారు. ప్రజా ధనంతో హైదరాబాద్‌లోనూ ఇళ్లు కట్టుకున్నారని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. (చదవండి: ప్రజావేదిక కూల్చివేత) -
ప్రజావేదిక కూల్చివేత
-
ప్రజావేదిక కూల్చివేతపై స్టేకు హైకోర్టు నో
సాక్షి, అమరావతి : కృష్ణా నది కరకట్టపై గత టీడీపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ప్రజావేదికను కూల్చివేయకుండా అడ్డుకోవలంటూ దాఖలైన పిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. ప్రజావేదిక అక్రమ నిర్మాణమేనంటూ పిటిషనర్ తన వ్యాజ్యంలో పలుమార్లు పేర్కొన్న సంగతిని హైకోర్టు ప్రస్తావించింది. ప్రజావేదిక భవనం అక్రమమా? కాదా? అని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. అలాంటప్పుడు ఇందులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఏముందని సూటిగా ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలను వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్తిగా సమర్థించింది. ప్రజావేదిక ఖర్చును తిరిగి రాబట్టాలన్న అంశంపై విచారణ కొనసాగిస్తామని వెల్లడించింది. ఈ అంశంపై విచారణను నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. కాగా ప్రజా వేదికను కూల్చివేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లా స్వర్ణకు చెందిన పోలూరి శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మంగళవారం రాత్రి హౌస్ మోషన్ రూపంలో ఆయన అత్యవసరంగా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటి వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులతో పాటు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి పి.నారాయణలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ ఎం.సీతారామమూర్తి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం అత్యవసరంగా విచారణ జరిపింది. -
రెండవరోజుకు ప్రజావేదిక కూల్చివేత
సాక్షి, అమరావతి : అక్రమ కట్టడం ప్రజా వేదిక కూల్చివేత పనులు రెండవరోజు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచే కూల్చివేత పనులను అధికారులు చేపట్టారు. ఆక్రమణల తొలగింపు ప్రజావేదిక నుంచే మొదలవ్వాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు.. కృష్ణానది కరకట్టపై గత టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేసే చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే అందుకు తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు భవనంలోని ఫర్నిచర్‌ను, ఏసీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. అనంతరం జేసీబీల సహాయంతో ప్రజావేదిక కూల్చివేత ప్రారంభమైంది. చదవండి : అక్రమాల వేదిక! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అడుగడుగునా ఉల్లంఘనలే..
-
ప్రజావేదిక కూల్చివేత పనులు ప్రారంభం
-
అక్రమాల వేదిక!
సాక్షి, అమరావతి: కృష్ణా కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం పక్కన అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల సమావేశ వేదిక నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆదేశాలపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు స్వయంగా అక్రమ కట్టడంలో నివాసం ఉండడమే కాకుండా అధికారంలో ఉండగా దానిపక్కనే నిబంధనలకు విరుద్ధంగా మరో భవనాన్ని నిర్మించడంపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినా లెక్క చేయలేదు. పర్యావరణవాదుల అభ్యంతరాలను బుట్టదాఖలు చేశారు. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తూ ముందుకెళ్లిన చంద్రబాబు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ అక్రమ కట్టడాన్ని తనకు కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లేఖ రాసి చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నించారు. ప్రజావేదిక నిర్మాణంలో జరిగిన ఉల్లంఘనలు, అవకతవకలను కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వమే వ్యవస్థలను దిగజార్చేలా అక్రమ కట్టడాలు నిర్మించడం సరికాదంటూ దాన్ని కూల్చివేయాలని ఆదేశించడం సంచలనం సృష్టించింది. పేదవాడికో నిబంధన, ప్రభుత్వానికో నిబంధన ఉండదని స్పష్టం చేసి తన చిత్తశుద్ధి, ప్రభుత్వ పారదర్శకతను తేటతెల్లం చేయడంపై అందరిలోనూ సంతృప్తి వ్యక్తమవుతోంది. అడుగడుగునా ఉల్లంఘనలే ప్రజావేదిక నిర్మాణం నుంచి నిర్వహణ వరకూ లెక్కలేనన్ని ఉల్లంఘనలు, అవకతవకలు చోటుచేసుకున్నాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం, నీటిపారుదలశాఖ నిబంధనలు, లోకాయుక్త ఆదేశాలకు భిన్నంగా సీఆర్డీఏ అధికారులపై ఒత్తిడి చేసి చంద్రబాబు దీన్ని నిర్మించారు. భవన నిర్మాణ సమయంలో కనీస నిబంధనలను సైతం పాటించలేదు. ఒక పంచాయతీలో భవనం కట్టుకోవడానికైనా ప్లాన్‌కు పంచాయతీ బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉండగా అలాంటిదేమీ లేకుండానే ప్రజావేదికను నిర్మించారు. భవన నిర్మాణాలకు అనుమతులివ్వాల్సిన సీఆర్డీఏతోనే నిబంధనలను తుంగలో తొక్కి మరీ దీన్ని నిర్మించారు. బిల్డింగ్ ప్లాన్‌లో చిన్న లోపాలుంటేనే కూలగొడుతున్న సీఆర్డీఏ అసలు ప్లాన్ లేకుండా తానే స్వయంగా ప్రజావేదికను కట్టి రాజభవనంగా తీర్చిదిద్దింది. కృష్ణా కరకట్టపై నిర్మాణాలు ఉండకూడదని గరిష్ట వరద స్థాయి సూచికలు, నీటిపారుదల శాఖ స్పష్టం చేసినా చంద్రబాబు పట్టించుకోకుండా తన నివాసం పక్కన దీన్ని కట్టించారు. కార్యకలాపాలన్నీ టీడీపీవే.. ముఖ్యమంత్రి ప్రజలను కలుసుకునేందుకే దీన్ని నిర్మించినట్లు టీడీపీ చెప్పినా ఏనాడూ ప్రజలను అందులోకి రానివ్వలేదు. టీడీపీ కార్యాలయం అందుబాటులో లేకపోవడంతో పార్టీ కార్యకలాపాల కోసమే దీన్ని నిర్మింపజేశారు. నిర్మించిన నాటి నుంచి టీడీపీ కార్యాలయం మాదిరిగానే ప్రజావేదిక పనిచేసింది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఉద్యోగులు, పార్టీ నేతలంతా ఇక్కడి నుంచే పనిచేశారు. రెండేళ్లుగా పార్టీ సమావేశాలన్నీ ఇక్కడే జరిగాయి. చంద్రబాబు పలుసార్లు ఇందులోనే పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో యనమల రామకృష్ణుడి నేతృత్వంలో టీడీపీ మేనిఫెస్టో కమిటీ సమావేశాలు, పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు, చేరికలు కూడా ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఇక్కడే జరిగాయి. అధికారం కోల్పోయిన తర్వాత కూడా చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్, ముఖ్య నాయకులు ప్రజావేదికను పార్టీ కార్యాలయంగానే వినియోగిస్తూ వచ్చారు. నాలుగు రోజుల క్రితం టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రజావేదికలోనే మీడియా సమావేశం నిర్వహించడం గమనార్హం. ప్రజావేదికను అక్రమంగా నిర్మించడమే కాకుండా అన్ని రకాలుగా దుర్వినియోగం చేసిన చంద్రబాబు, టీడీపీ నేతలు దాన్ని కూల్చివేస్తామనగానే నీతి సూత్రాలు వల్లిస్తుండడంపై విస్మయం వ్యక్తమవుతోంది. మంత్రి నోటిమాటతో రెట్టింపైన అంచనాలు ప్రజావేదికను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించడమే కాకుండా టెండర్లు, అంచనాల రూపకల్పనలోనూ అవకతవకలకు పాల్పడ్డారు. కాగితాల్లో మూడుసార్లు టెండర్లు పిలిచినట్లు చూపించి చివరికి తమకు కావాల్సిన ఎన్సీసీ సంస్థకు ఆ పని అప్పగించారు. చివరికి చూపించిన టెండర్‌ను కూడా తుంగలో తొక్కారు. టెండర్ విలువ ప్రకారం రూ.4.34 కోట్ల పనిని అప్పటి మంత్రి నారాయణ తన నోటి మాటతో రూ.8.90 కోట్లకు పెంచేయడం గత ప్రభుత్వంలో టెండర్ల ప్రక్రియ ఎలా సాగిందో రుజువు చేస్తోంది. కాంట్రాక్టు విలువ కంటే రెట్టింపు మొత్తాన్ని మంత్రి నోటి మాటతో పెంచడాన్ని బట్టి గత ప్రభుత్వం టెండర్ల పద్ధతిని ఏ స్థాయికి దిగజార్చిందో స్పష్టమవుతోంది. వాస్తవానికి టెండర్లు పిలవకుండానే ఎన్‌సీసీతో ప్రజావేదికను కట్టించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత కాగితాలపై టెండర్లు పిలిచినట్లు చూపించి పాత తేదీలతో మాయ చేసినట్లు చెబుతున్నారు. ప్రజావేదిక నిర్మాణం – పూర్వాపరాలు - ఉండవల్లిలో నాటి సీఎం క్యాంపు కార్యాలయం సర్వే నెంబరు 272/2 ఏ వద్దగ్రీవెన్స్ హాల్ నిర్మాణానికి అంచనా కంటే 4.3 శాతం అదనంతో (రూ.4,34,61,919.52) ఎన్సీసీ దాఖలు చేసిన బిడ్‌కు అర్హత ఉందని ధృవీకరించి ఆమోదించిన సీఆర్డీఏ. 2017 అక్టోబర్ 4న ఆ సంస్థతో నిర్మాణానికి ఒప్పందం - గ్రీవెన్స్ హాల్ నిర్మాణానికి అనుమతి కోరుతూ 2017 సెప్టెంబర్ 6వ తేదీన అందిన విజ్ఞప్తిని తిరస్కరించిన కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. కృష్ణానదికి వచ్చే గరిష్ట వరద, సాంకేతిక కారణాల రీత్యా గ్రీవెన్స్ హాలు నిర్మాణానికి అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టీకరణ. - కృష్ణానది ఎడమ కరకట్టపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న ఆక్రమణలన్నింటినీ ఆరు నెలల్లోపు తొలగించాలని 2017 ఫిబ్రవరి 1న లోకాయుక్త ఆదేశించింది. ఈ నిర్మాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో అనుమతి నిరాకరించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. - గ్రీవెన్స్ హాలు నిర్మాణానికి (ప్లాన్) అనుమతి ఇవ్వాలని 2017 జూన్ 13వ తేదీన సీఆర్డీఏ సీఈ (హౌస్ అండ్ బిల్డింగ్స్) పంపిన లేఖపై సీఆర్‌డీఏగానీ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంగానీ అనుమతి ఇవ్వలేదు - అనంతరం నాటి మంత్రి నారాయణ నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించి రూ.4.43 కోట్లకు ఇచ్చిన పరిపాలనాపరమైన మంజూరును రూ.8.90 కోట్లకు పెంచాలని మౌఖికంగా ఆదేశించారు. అందుకనుగుణంగా 2017 డిసెంబర్ 15వతేదీన సవరించిన అంచనాలను ఆమోదించిన సీఆర్డీఏ సీఈ. 2018 ఫిబ్రవరిలో గ్రీవెన్స్ హాల్ నిర్మాణం పూర్తి. -
ప్రజావేదిక కూల్చివేత
సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్ (మంగళగిరి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లే అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచే మొదలైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం విదితమే. సీఆర్డీఏ అదనపు కమిషనర్ విజయకృష్ణన్ నేతృత్వంలో అధికారుల బృందం మంగళవారం సాయంత్రం ప్రజావేదిక వద్దకు చేరుకుని కూల్చివేతకు అవసరమైన సూచనలు జారీ చేశారు. అందులో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు, మైక్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ సామగ్రి, పూల మొక్కలు కుండీలు సహా అన్నింటి వివరాలు నమోదు చేసుకుని ఆ తర్వాత కూల్చివేత పనులు మొదలు పెట్టారు. పూల కుండీలన్నింటినీ రాయపూడి సమీపంలోని సీఆర్డీఏ నర్సరీకి, మిగిలిన వస్తువులన్నింటినీ సచివాలయానికి తరలించారు. ఆ తర్వాత జేసీబీలతో క్యాంటీన్, వంట షెడ్, ప్రహరీని కూలగొట్టారు. తెల్లారే సరికి మొత్తం ప్రజావేదిక భవనాన్ని కూల్చేందుకు సీఆర్డీఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉండవల్లి చేరుకున్న చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన ముగించుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి 11.30 గంటలకు విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఉండవల్లిలోని ప్రజావేదికను సీఆర్డీఏ అధికారులు కూలగొడుతుండతుండడంతో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో చంద్రబాబు విజయవాడకు చేరుకోవడంతో విమానాశ్రయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హడావుడి చేశారు. చంద్రబాబుతో పాటు కార్యకర్తలు, నేతలు కూడా ఉండవల్లికి వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు కృష్ణా కరకట్ట వద్ద వారిని అడ్డుకున్నారు. కరకట్టపైన చంద్రబాబు కాన్వాయ్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
హోదా కేసులన్నీ ఎత్తేయండి
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని గత సీఎం ముందు ప్లకార్డులు ప్రదర్శించారని దేశద్రోహం కేసులు పెట్టారు.. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా కోసం ఉద్యమిస్తే అన్యాయంగా కేసులు పెట్టి హింసించారు.. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? అందుకే ప్రత్యేక హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేయండ’ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సు రెండవ రోజైన మంగళవారం ఉండవల్లి ప్రజావేదిక హాలులో ఎస్పీలు, కలెక్టర్లతో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పరిశీలించిన సీఎం.. శాంతిభద్రతలకు సంబంధించిన కీలక అంశాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు, డిప్యూటీ సీఎం అంజాద్ బాషాలు హోదా ఉద్యమ కేసుల విషయాన్ని ప్రస్తావించారు. గుంటూరులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట ఓ కార్యక్రమంలో ప్లకార్డులు ప్రదర్శించినందుకు దేశద్రోహం కేసు పెట్టారని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఇలా వ్యవహరిస్తే వ్యవస్థల మీద నమ్మకం పోతుందని, తక్షణమే ఆ కేసులన్నీ ఎత్తివేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మానవీయ కోణంలో పని చేయాలి రాష్ట్రంలో అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ అంశాన్ని ప్రతి ఉద్యోగి దృష్టిలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. చట్టాలను అమలు చేయడంలో ఎమ్మెల్యేలను కలుపుకొనిపోవాలని చెప్పారు. మానవీయ కోణంలో పోలీసులు పనిచేయాలని, ప్రజా ప్రతినిధులను గౌరవించాలన్నారు. పాలనా వ్యవస్థలో ప్రజా ప్రతినిధులు ముఖ్యమేనన్న విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలన్నారు. తప్పు చేస్తే ఎవరైనా, ఎంతటి వారినైనా సహించవద్దని, చెడ్డపేరు వచ్చే పని ఎవరూ చేయవద్దని చెప్పారు. వ్యక్తిగత ఇగోలు పక్కనపెట్టి అందరూ కలిసి పని చేయడం ద్వారా దేశంలోనే ఏపీ పోలీస్ వ్యవస్థను ప్రథమ స్థానంలో నిలపాలని దిశానిర్దేశం చేశారు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన ‘ఎవరికైనా ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకోవాలి. మంచి పాలన కోసం మీరు తీసుకునే నిర్ణయాల పట్ల నా పూర్తి సహకారం ఉంటుంది. అప్పుడే సుపరిపాలన అందించగలం. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని మా నాన్న నేర్పించారు. నేను కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. దేశంలోనే తొలిసారిగా ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అందించాలని నిర్ణయించాం. కుటుంబంతో గడపాల్సిన అవసరం పోలీసులకు ఉంది. దీనివల్ల మరింత ఉత్తేజంతో వారు విధుల్లోకి వస్తారు. పోలీసు శాఖలో దిగువ స్థాయి వరకు వీక్లీ ఆఫ్ వర్తింపజేయాలి. పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుదారులను గౌరవించేలా రిసెష్షన్ విభాగం ఉండాలి’ అని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్రంలో ఇష్టానుసారం సాగుతున్న అక్రమ మైనింగ్‌పై ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ప్రశ్నించారు. నిర్వాసితుల సమస్యలపై స్పందించండి పోలవరం నిర్వాసితుల సమస్యలపై అధికారులు మానవత్వంతో స్పందించి పనిచేయాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా శాశ్వతంగా గ్రీవెన్స్ సెల్ పెట్టాలని నిర్ణయించినట్టు సీఎం ప్రకటించారు. ఇందుకోసం ఒక ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా కేటాయించామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అత్యంత ప్రాధాన్యత కలిగినందున దాన్ని పూర్తి చేసేందుకు ఎలాంటి సహాయమైనా అందిస్తామని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టండి.. సమాజానికి మంచి చేసే నిర్ణయాల అమల్లో త్వరగా అడుగులు ముందుకు పడాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు ఉండకుండా చూడాలన్నారు. రహదారుల పక్కన ఉండే దాబాల్లో మద్యం అమ్మకాలను నివారించాలన్నారు. రోడ్డు భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, భద్రతా నిబంధనలు, నియమాలపై రోడ్డు పక్కన హోర్డింగ్‌లు పెట్టించాలన్నారు. జరిమానాలు విధించే ముందు ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. విజయవాడ ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని, ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి సరైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. దీనిపై సంబంధిత అధికారులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఐడీ అధికారులను ఆదేశించారు. బాధితులను త్వరితగతిన ఆదుకునేలా అగ్రిగోల్డ్ బాధితులు, యాజమాన్యం, సీఐడీతో సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.1,150 కోట్ల పంపిణీతో పాటు అగ్రిగోల్డ్ ఆస్తుల స్వాధీనం వేగంగా జరగాలన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి సంబంధించిన ఇతర ఆస్తులపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. -
పోలీస్ నంబర్1
ఇలాంటివి ఇక చాలు విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ మహిళల్ని వేధించింది. అప్పుడు ఏం జరిగింది? ఎన్ని కేసులు పెట్టారు? ఎందరు అరెస్టు అయ్యారు? బిగ్ జీరో. అప్పటి సీఎం ఇంటి పక్కనుంచే ఇసుక దోపిడీ సాగింది. ఇసుక మాఫియాను అడ్డుకున్న ఓ మహిళా ఎమ్మార్వోను టీడీపీ ఎమ్మెల్యే జుత్తు పట్టుకుని ఈడ్చేశారు. గుంటూరు జిల్లాలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ చేశారు. ఎమ్మెల్యేలే క్లబ్బులు నడిపారు. జూదం నిర్వహించారు. రాజధానిలో భూమి ఇవ్వని వారిని వేధించారు. మనం ఏం చేయగలిగాం? స్మైల్ ప్లీజ్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదుదారులు వచ్చారంటే వారెంతో బాధతో వచ్చారని గుర్తించాలి. రిసెప్షన్ ఏర్పాటు చేయండి. వారిని కూర్చోనివ్వండి. ఓ పోలీసు వారితో నవ్వుతూ మాట్లాడి వారి సమస్యను అర్థం చేసుకుని కేసు ఫైల్ చేయాలి. అప్పుడే సకాలంలో పారదర్శక సేవలు అందించడం సాధ్యం. మీ పని మీరు చేయండి అవినీతి, అక్రమాలు, దోపిడీలను అరికట్టడానికి కఠినంగా ఉండండి. ఎవరు వద్దని చెప్పినా పట్టించుకోవద్దు. నేను మీకు అడ్డురాను. మిగిలిన అంశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను విశ్వాసంలోకి తీసుకోండి. మనం సత్వరం, సమర్థంగా మంచి పాలన అందించాలి. మీపై నాకు నమ్మకం ఉంది. నేను గర్వపడేలా బాగా పని చేయండి. ఎదిగే కొద్దీ ఒదగాలి నాతో సహా మనమంతా ప్రజా సేవకులం. మానవత్వం, సద్గుణమన్నది మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎదిగే కొద్దీ ఒదగాలి. అణగారిన వర్గాల పట్ల ఆదరణతో ఉండండి. సాక్షి, అమరావతి: ‘ఫ్రెండ్లీ పోలీసింగ్, పారదర్శకతతో మంచి పరిపాలన అందించాలి. ప్రజల భద్రత మన బాధ్యత. అవినీతి, అక్రమాలు, దోపిడీని అరికట్టాలి. అందుకోసం వ్యవస్థను మారుద్దాం. ఈ విషయంలో నేను మీకు పూర్తి అండగా ఉంటాను’అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు, రెవిన్యూ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీసులు వివక్షతో వ్యవహరిస్తారని అణగారిన వర్గాల్లో ఉన్న అభిప్రాయాన్ని తొలగించాలన్నారు. కలెక్టర్ల సదస్సు రెండవ రోజైన మంగళవారం ఉండవల్లి ప్రజావేదిక హాలులో ఎస్పీలు, కలెక్టర్లతో శాంతిభద్రతలపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వారికి విస్పష్టంగా వివరించారు. ప్రధానంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించి ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అవినీతి, అరాచకం, అక్రమాలు యథేచ్ఛగా సాగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితిని సమూలంగా మార్చివేసి ప్రజలకు పూర్తి భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. సైబర్ నేరాలను అడ్డుకోవాలని, మహిళలకు భద్రత కల్పించాలని, బెల్ట్ దుకాణాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ సదస్సులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. గత ఐదేళ్లు యథేచ్ఛగా వేధింపులు గత ఐదేళ్లలో మన కళ్ల ముందే యథేచ్ఛగా అవినీతి, అక్రమాలు జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి నివాసం ఇక్కడ మన పక్కనే ఉంది. మనం కూర్చున్న ఈ భవనం అక్రమ నిర్మాణం. అన్ని చట్టాలను ఉల్లంఘించి మరీ నిర్మించారు. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ నీటిపారుదల శాఖ లేఖ రాసింది కూడా. నదీ పరిరక్షణ చట్టం, లోకాయుక్త తీర్పు, గ్రీన్ ట్రిబ్యునల్, మాస్టర్ ప్లాన్, భవన నిర్మాణ నిబంధనలు.. అలా అన్నింటినీ ఉల్లంఘించారు. ఇక్కడే మన కళ్ల ఎదుటనే మాజీ సీఎంగారే అక్రమ భవనంలో ఉన్నారు. అది సమర్థనీయమా? అప్పటి సీఎం అక్రమ నిర్మాణంలో ఉన్నారు. ఆ పక్కనే ప్రభుత్వం మరో అక్రమ భవనాన్ని నిర్మించింది. దాంతో ఏం జరిగింది? ఈ కరకట్ట రోడ్డు అంతటా అక్రమ భవనాలు నిర్మించారు. ఎవరూ ఆపలేదు. ఇది మంచి పరిపాలనా? మీరే ఆలోచించండి. ఆ పక్కనే ఇసుక దోపిడీ సాగింది. అది అక్రమం అని అందరికీ తెలుసు. కానీ సాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియాను అడ్డుకున్న ఓ మహిళా ఎమ్మార్వోను టీడీపీ ఎమ్మెల్యే జుత్తు పట్టుకుని ఈడ్చేశారు. మనం ఏమీ చేయలేకపోయాం. గుంటూరు జిల్లాలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ చేశారు. న్యాయస్థానం వరకు వెళ్లింది. మనం ఏం చేశాం? ఎమ్మెల్యేలు థియేటర్, కంపెనీల యజమానుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. ఎమ్మెల్యేలే క్లబ్బులు నడిపారు. జూదం నిర్వహించారు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో భూమి ఇవ్వని వారిని వేధించారు. అక్రమ కేసులు పెట్టారు. దాంతో 11మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో ఆరుగురు దళితులే. ఏం చేయగలిగాం? ఉండవల్లిలో ప్రజావేదికలో పోలీస్ శాఖ ఉన్నత అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. కార్యక్రమంలో మంత్రులు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, డీజీపీ గౌతమ్ సవాంగ్, తదితరులు నవ్వుతూ మాట్లాడండి.. దేశంలో మనమే తొలిసారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇచ్చాం. గతంలో బీహార్‌లో ప్రయత్నించారు కానీ కుదరలేదు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు కచ్చితంగా అమలయ్యేలా చూడండి. అందుకోసం మరో 25 శాతం సిబ్బంది అవసరమైతే నియమిస్తాం. వీక్లీ ఆఫ్ తీసుకుని వారానికి ఒక రోజు కుటుంబంతో గడిపితే వారు మిగిలిన ఆరు రోజులు మరింత ఉత్సాహంగా పని చేస్తారు. ప్రజలకు మేలు చేయాలంటే ఫ్రెండ్లీ పోలీసింగ్, పారదర్శక పాలన అందించాలి. మీ దగ్గరకు ఎవరు వచ్చినా నవ్వుతూ పలకరించండి. ఇక్కడకు ఎందుకు వచ్చామా అని అవతలి వాళ్లు అనుకోకూడదు. వారి స్నేహితులుగా ఉన్న మనం పారదర్శకంగా ఉండాలి. ప్రజల సంతృప్తే కొలబద్ద పోలీసు సేవల పట్ల ప్రజల సంతృప్త స్థాయి ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు ఎలా పని చేస్తున్నారో థర్డ్ పార్టీ ద్వారా విచారించి తెలుసుకోండి. ఉన్నత స్థాయిలో మనం అవినీతికి దూరంగా ఉండాలి. దాంతో 50 శాతం అవినీతి తగ్గిపోతుంది. మిగిలిన 50 శాతం అవినీతిని ఎలా తగ్గించాలన్నది మనం నిర్ణయించాలి. ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి. అధికారుల నిబద్ధత, వ్యవహార శైలి, పని తీరు గురించి విచారించండి. తదనుగుణంగా శాస్త్రీయంగా తగిన చర్యలు తీసుకోండి. సైబర్ నేరాలను నిరోధించాల్సిందే సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరాలను తగిన రీతిలో విచారించి పూర్తిగా అడ్డుకట్ట వేయడానికి మన పోలీసు వ్యవస్థకు తగిన మౌలిక వసతులు లేవు. దీనిపై మనం దృష్టి సారించాలి. మన పోలీసులకు తగిన శిక్షణ లేదు. కింది స్థాయి అధికారులు, సిబ్బందికి కూడా తగిన శిక్షణ ఇవ్వాలి. సైబర్ నేరాలు, మహిళల వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో అయినా కట్టడి చేయాల్సిందే. మహిళలకు రక్షణ కల్పించలేకపోతే అది మన వైఫల్యమే. ఇతర రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఎలా చేస్తున్నాయో చూడండి. సైబర్ నేరాలు, మహిళల వేధింపులు, ఈవ్ టీజింగ్‌లను పూర్తిగా నిరోధించాల్సిందే. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాలి మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం.ఆ వ్యవస్థను గౌరవించాలి. అమెరికాలో పోలీసు ఉన్నతాధికారులను కూడా ప్రజలు ఎన్నుకుంటారు. ఎందుకో తెలుసా? ప్రజల పట్ల మానవీయ కోణం, బాధితుల పట్ల సానుభూతితో ఉండాలని. మన వద్ద కూడా పోలీసు అధికారులు అదే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాలి. చాలాసార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎందుకు పట్టించుకోవాలి అనే ఘర్షణ వైఖరి తలెత్తుతుండటం మనం చూస్తునే ఉన్నాం. ప్రత్యేకించి పోలీసు శాఖలో. మనం గౌరవించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోతుంది. రెండు లక్షల మంది ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేను ఎన్నుకుంటారు. వారిని మనం గౌరవించకపోతే ప్రజాస్వామ్యం విఫలమవుతుంది. మనం కలసి మెలసి ప్రభుత్వాన్ని నడపాలి. అలా అని అవినీతి, అక్రమాలు, దోపిడీలను సమర్థించమని నేను చెప్పడం లేదు. ఎవరు చెప్పినా సరే అవినీతి, అక్రమం, దోపిడీలకు నో చెప్పండి. మిగిలిన అన్ని విషయాల్లో మనం కలసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలను విశ్వాసంలోకి తీసుకోండి. ఏ ఎమ్మెల్యే కూడా తనకు చెడ్డపేరు రావాలని కోరుకోరు. మీరు చేయాల్సిందల్లా వారిని చిరునవ్వుతో పలకరించి విషయం చెప్పి ఒప్పించండి. ఇది చేస్తే చెడ్డపేరు వస్తుంది.. ఇది చేస్తే మంచిపేరు వస్తుందని వివరించండి. చెడ్డపేరు వస్తుందంటే ఎందుకు చేయమంటారు? కానీ వారి ఫోన్లు రిసీవ్ చేసుకోకపోతే సమస్య వస్తుంది. ఇగో పక్కన పెట్టండి. ఇది అందరికీ వర్తిస్తుంది. అధికారులు, రాజకీయ నేతలకు కూడా వర్తిస్తుంది. సమావేశానికి హాజరైన కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు జిల్లాల్లో ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేయాలి. గ్రామాల్లో రాత్రి బస చేయాలి. అదీ అణగారిన వర్గాలు ఉన్న కాలనీల్లో బస చేయండి. పోలీసుల పనితీరు గురించి వాకబు చేయండి. దాంతో వ్యవస్థలో మార్పు వస్తుంది. విశ్వసనీయత, పారదర్శకత, సత్వరం ప్రజల సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఈ భవనం నుంచే మొదలు పెడతాం. ఇక్కడ మనం మొదలు పెట్టి ఈ రోడ్డంతా ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగిద్దాం. జిల్లాల్లో కూడా ఇదే విధానాన్ని పాటించాలి. అప్పుడే మనం మంచి పరిపాలన అందించగలం. నంబర్ వన్ పోలీసింగ్ గురించి మాట్లాడగలం. ఇక్కడ నుంచే వ్యవస్థను మారుద్దాం మనం అధికారంలో ఉన్నామంటే మనకు బాధ్యతలు ఉన్నాయని అర్థం. మనం ప్రమాణాలను పాటించి అందరికీ ఆదర్శంగా నిలవాలి. అందుకే మీకు చెబుతున్నా.. అవినీతికి, దోపిడీకీ, అక్రమాలకు నో చెప్పండి. వ్యవస్థను ప్రక్షాళన చేయండి. మంచి ప్రమాణాలు నెలకొల్పండి. మీకు ఇది చూపించడానికే ఇక్కడ సమావేశం పెట్టాను. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఇక్కడి నుంచే మొదలు పెడదాం. వ్యవస్థను మారుద్దాం. గ్రామాల్లో మద్యం బెల్ట్ దుకాణాలు ఉండటానికి వీల్లేదు. అసలు బెల్ట్ దుకాణం అనే పదమే అక్రమం. పాదయాత్రలో ఎన్నో గ్రామాల్లో ఎన్నో బెల్ట్ దుకాణాలు, క్లబ్బులు, జూదంతో ప్రజలు పడుతున్న బాధలు చూశాను. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటన్నింటినీ తొలగించాల్సిందే. 3 అంశాల ప్రాతిపదికగా అధికారుల ఎంపిక నా మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముందే నేను కలెక్టర్లు, ఎస్పీల నియామకాలు పూర్తి చేశాను. నిజాయతీ, సమర్థత, టీడీపీకి అనుకూలంగా లేకపోవడం అనే మూడు ప్రమాణాల ప్రాతిపదికన మిమ్మల్ని ఎంపిక చేశాను. లేకపోతే వ్యవస్థ మరింతగా దిగజారుతుంది. అధికారులు తటస్థంగా ఉండాలన్నదే నా విధానం. మీపై పూర్తి గౌరవంతో అడుగుతున్నాను. మంచి పాలన అందించండి. నేను జోక్యం చేసుకోను. కాల్‌మనీలో ఎవరినీ వదలొద్దు విజయవాడలో టీడీపీ హయాంలో వెలుగు చూసిన కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై గట్టి చర్యలు తీసుకోకపోవడం గురించి సీఎం పోలీసు అధికారుల సదస్సులో ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం కోసం అప్పు తీసుకున్న వారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కాల్‌మనీ సెక్స్‌రాకెట్ విషయంలో పోలీసులు సీరియస్‌గానే ఉండాలని ఆదేశించారు. ఈ ఘటనలపై ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంత మందిని అరెస్ట్ చేశారు? అంటూ ఆరా తీశారు. ‘కాల్‌మనీ సెక్స్ రాకెట్లో ఏ పార్టీవారున్నా విడిచి పెట్టొద్దు. ఈ రాకెట్లో వైఎస్సార్సీపీ వాళ్లు ఉన్నా సరే ఉపేక్షించొద్దు. ఈ సెక్స్ రాకెట్‌ను సమూలంగా నిర్మూలించండి’ అంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక ఘటనలను ప్రస్తావించారు. ఇలాగైతే మీరు నంబర్ వన్ పోలీస్ ఎలా అవుతారని ప్రశ్నించారు. గత సీఎం చంద్రబాబు నివాసానికి పక్కనే అక్రమంగా ఇసుక మాఫియా సాగిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోపై ఓ ప్రజాప్రతినిధి జుట్టు పట్టుకుని దాడి చేసి కొట్టినా పట్టించుకోలేదన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా మన కళ్ల ఎదుటే జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సరైన విధానమేనా? అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, భూ సమీకరణకు పొలాలు ఇవ్వని రైతులపై అక్రమ కేసులు పెట్టారని సీఎం గుర్తు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలే బహిరంగంగా దందాలకు పాల్పడ్డారని, గ్యాంబ్లింగ్, పేకాట క్లబ్బులకు ఎమ్మెల్యేలు సహకరించారన్నారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోకుంటే నంబర్‌వన్ పోలీస్ కాలేరన్నారు. -
బ్రేకింగ్.. ప్రజావేదిక కూల్చివేత ప్రారంభం
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఆక్రమణల తొలగింపు ప్రజావేదిక నుంచే మొదలవ్వాలన్న సీఎం సూచనల మేరకు..కృష్ణానది కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆ భవనాన్ని కూల్చివేసే చర్యలను ప్రారంభించారు. ఈ సాయంత్రం కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే అందుకు తగిన ఏర్పాట్లను చేపట్టారు. భవనంలోని ఫర్నించర్‌ను, ఏసీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. భవనాన్ని కూల్చివేసేందుకు ఇప్పటికే జేసీబీలు, కూలీలను ప్రజావేదిక వద్దకు తరలించారు. (చదవండి : ‘ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం) కాగా, ప్రజావేదికపై ఇప్పటికే ప్రభుత్వానికి సీర్‌ఆర్‌డీఏ నివేదిక సమర్పించింది. ప్రజావేదికను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నివేదికలో పేర్కొంది. అధికారంలో ఉండగా తన అక్రమ నివాసం పక్కన చంద్రబాబు అనధికారికంగా కట్టించిన ప్రజావేదిక అక్రమాలు, దుర్వినియోగాలకు వేదికగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ చంద్రబాబు సహా ఆయన కుమారుడు, టీడీపీ నేతలు దాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేశారు. పేరుకు ప్రభుత్వ భవనమే అయినా ఇన్నాళ్లు దానిని టీడీపీ కార్యాలయంగా వాడుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనూ ఇష్టానుసారం వినియోగించుకున్న చంద్రబాబు.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వదలకుండా వేలాడుతుండడం విమర్శలకు దారితీసింది. ప్రజావేదికను అక్రమంగా నిర్మించడమే కాకుండా దాన్ని తనకే ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
ప్రజా వేదిక అక్రమ కట్టడం
-
టీడీపీ నేతలకు ఎందుకు ఉలిక్కిపాటు?
సాక్షి, హైదరాబాద్ : నదీ గర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. అవి ఇళ్లు లేని పేదలు కట్టుకున్నవి కాదని, వ్యవస్థల్ని మేనేజ్ చేసి పెద్దోళ్లు నిర్మించుకున్నవని తెలిపారు. ఇన్నాళ్లు చట్టాల కళ్లుగప్పారని, ఇకపై సాధ్యం కాదని చురకలంటించారు. మంగళవారం ఆయన ట్విటర్ వేదికగా గత ప్రభుత్వపాలన, ఎల్లోమీడియాపై ధ్వజమెత్తారు. విజయవాడ-అమరావతి రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్నయూ-టర్న్ వల్ల పనులు మొదలు కాకుండా పోయాయన్నారు. మొదట భూసేకరణ తామే చేస్తామని కేంద్రానికి హామీ ఇచ్చి తర్వాత చెరిసగం భరించాలని మెలిక పెట్టారని రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారని తెలిపారు. ‘అమ్మ ఒడి పథకం’ అన్ని పాఠశాలకు వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటనతో ఎల్లో మీడియా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయిందని విమర్శించారు. ఈ పథకంపై రకరకాల వార్తలను వండి వార్చిందని, ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేస్తారనే విధంగా అనుమానాలు రేకిత్తించే ప్రయత్నం చేసిందని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఒకే మాట మీదున్నాం.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి 303 మంది సభ్యులున్నారని, ఎవరి మీద ఆధారపడే పరిస్థితి లేదన్నారు. అయినా హోదా కోసం పోరాడుతూనే ఉంటామని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని, అధికారంలో లేనప్పుడు, ఉన్నప్పుడూ ఒకే మాట మీదున్నామని విజయసాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబులా హోదా సంజీవని కాదని ఎన్నడూ అనలేదు కదా? అని ప్రశ్నించారు. చదవండి: ‘ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్ -
ట్విటర్లో విజయసాయి రెడ్డి ఫైర్
-
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్ప్రత్రుల బకాయిలు చెల్లించాలి
-
ఆ పథకాన్ని పండుగలా నిర్వహిద్దాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పండుగలా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. పథకం ద్వారా లబ్ధిపొందే మొత్తాన్ని రైతులకు ఒకే రోజు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. వాస్తవంగా రైతు భరోసాను మే మాసంలో ఇవ్వాల్సిఉందని, కానీ రైతుల దుస్థితిని చూసి అక్టోబరులోనే రబీ సీజన్ కోసం ఇస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 1.25 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు 50శాతం, 2.5 ఎకరాల కన్నా తక్కువ ఉన్న భూమి ఉన్న రైతులు 70శాతానికి పైగా రైతులు ఉన్నారని వెల్లడించారు. సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘50శాతం మంది రైతులకు కావాల్సిన పూర్తి పెట్టుబడి రైతు భరోసా ద్వారా అందుతున్నట్టే. అక్టోబరు 15న రైతు భరోసా అందుతుంది. స్టాంపు పేపర్ ఫార్ములా మాదిరిగానే ఒక పత్రాన్ని కౌలు రైతుల కోసం గ్రామ సచివాలయంలో ఉంచుతాం. 11 నెలల కాలానికి భూమిపై హక్కులు కాకుండా, పంట సాగు చేసుకునేలా అనుమతులు రైతుల నుంచి కౌలు రైతులకు అందేలా చూడాలన్నది ప్రభుత్వం ఆలోచన. దీనివల్ల కౌలు రైతులకు కొంత మంచి జరిగే అవకాశం ఉంది. రైతు భరోసా కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కౌలు రైతులకు కూడా రూ.12500 ఇచ్చే ఏర్పాటుచేస్తాం. ఆత్మహత్య చేసుకున్న రైతులకు గత ప్రభుత్వం సరిగ్గా పరిహారం ఇవ్వలేదు. ఈ పరిస్థితులు పూర్తిగా మార్చబోతున్నాం. రైతు కుటుంబాలకు ఏం జరిగినా.. ఆత్మహత్య జరిగినా, ప్రమాదంలో మరణించినా స్థానిక కలెక్టర్ వెంటనే స్పందించాలి. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో పనిలేకుండా వెంటనే స్పందించి ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలి. స్థానిక ఎమ్మెల్యేను కూడా కలుపుకొని ఆ కుటుంబానికి రూ.7 లక్షలు ఆర్థిక సహాయం అందించాలి. సీఎం మీకు తోడుగా ఉంటారని రైతు కుటుంబానికి భరోసా ఇచ్చి.. మీరు ఆ కుటుంబానికి సహాయం చేయండి’ అని పేర్కొన్నారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన సేవలందాలి : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఇక మీదట ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు వచ్చి పిల్లల్ని కొరకడం.. టార్చిలైట్ల వెలుగులో ఆపరేషన్లు చేయడం వంటి సంఘటనలు పునరావృతం కాకుడదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్ప్రత్రులకు రూ. 450 కోట్ల బకాయిలున్నాయి అన్నారు. గత ప్రభుత్వం 9 నెలల నుంచి బకాయిలు చెల్లించలేదని.. వీలైనంత త్వరగా వాటిని చెల్లించాలని జగన్ ఆదేశించారు. కుష్టువ్యాధి వాళ్లకు ఎంత పెన్షన్ ఇస్తున్నారని జగన్ ప్రశ్నించారు. కుష్టువ్యాధి మళ్లీ విజృంభిస్తున్నట్లు పాదయాత్ర సమయంలో తన దృష్టికి వచ్చిందన్నారు. కుష్టువ్యాధి నివారణ, మందులు, చికిత్స తదితర అంశాలపై సీరియస్‌గా దృష్టిపెట్టాలని జగన్ కలెక్టర్లను ఆదేశించారు. -
అందుకే ‘అమ్మ ఒడి’ : సీఎం జగన్
సాక్షి, అమరావతి : పిల్లలను బడికి పంపించేలా తల్లులను ప్రోత్సహించేందుకే అమ్మఒడి పథకం పెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నిరక్షరాస్యత సగటు (33శాతం) జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ పథకంతో రాష్ట్రంలో అక్షరాస్యత పెరుగుతుందని, పిల్లలను స్కూల్‌కు పంపే ప్రతి తల్లికి అమ్మఒడి పథకం వర్తింపచేస్తామన్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘జనవరి 26న అమ్మ ఒడి చెక్కుల పంపిణీని గ్రామ వాలంటీర్ల ద్వారా నిర్వహించాలి. నాకు అత్యంత ప్రాధాన్యమైన దాంట్లో విద్యా రంగం ఒకటి. స్కూల్స్ ఫొటోలు తీసి పంపించండి. వాటిని అభివృద్ధి చేస్తాం. ఫ్యాన్లు, ఫర్నిచర్, ప్రహరీ గోడ, బాత్రూమ్స్ అన్ని బాగుచేస్తాం. ప్రతి స్కూలును ఇంగ్లీషు మీడియం స్కూలుగా మారుస్తాం. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తాం. యూనిఫారంలు, పుస్తకాలు సకాలనికే ఇస్తాం. పిల్లలకు షూలు కూడా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. గత ప్రభుత్వం మాదిరిగా స్కూలు యూనిఫారాల్లో స్కాంలు జరగకూడదు. మధ్యాహ్న భోజనంలో కూడా నాణ్యత పెంచుతాం. ఇవన్నీ చేశాక ఏ పిల్లాడు కూడా ప్రైవేట్ స్కూల్‌కు పోవాలనే ఆలోచన రాకూడదు. ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం చేసిన విద్యాహక్కు చట్టాన్ని 100 శాతం అమలు చేస్తాం. ప్రైవేట్ స్కూళ్లలో 25 సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. దేశంలో విద్య అనేది సేవేకాని, డబ్బు ఆర్జించే రంగం కాదు. ఎవరు విద్యాసంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదు.(చదవండి : ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం) సన్న బియ్యం ఇస్తాం.. పౌరసరఫరాల శాఖలో ప్రజలు వాడే వస్తువులనే ఇవ్వాలి. ఇప్పుడిస్తున్న బియ్యం నాణ్యత బాగోలేదు. ఆ బియ్యాన్ని తిరిగి డీలర్‌కే అమ్మేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. తిరిగి అవే బియ్యం పాలిష్ చేసి, మళ్లీ ప్రజల దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంది. ప్రజలు వినియోగించే వాటినే మనం ఇవ్వాలి. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ, మరోవైపు క్వాలిటీ బియ్యం ప్రజలకు చేరాలి. దీనికి కలెక్టర్లు కీలకమైన పాత్ర పోషించాలి. గత ప్రభుత్వం రైతులకు రూ.1000 కోట్లు బకాయి పడింది. ఈ డబ్బులను ఎన్నికల స్కీంలకు మళ్లించారు. ఈ వెయ్యి కోట్లను రైతులకే చెల్లించాలి’ అని వైఎస్ జగన్ కలెక్టర్లకు తెలిపారు. (చదవండి : మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్) -
ప్రతీ సోమవారం ఆఫీసుల్లో గ్రీవెన్స్ డే
-
ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి సోమవారం ‘స్పందన’ పేరుతో ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఇది కేవలం కలెక్టరేట్‌కు మాత్రమే పరిమితం కాకుండా జిల్లాల్లో ఎక్కడైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి సోమవారం ఎటువంటి అధికారిక సమావేశం పెట్టుకోవద్దు. మీకు వచ్చే ప్రతి ఫిర్యాదును ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో రశీదు ఇవ్వాలి. పై అధికారులు కూడా ఆ రోజు మీకు ఫోన్లు చేయరు. త్వరలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభిస్తాం. ప్రతి నెలా మూడో శుక్రవారం చిన్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను వినండి. మీ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించండి. లేదంటే నా దృష్టికి తీసుకురండి. మనం కలిసి ఆ సమస్యలను పరిష్కరిద్దాం. మన దగ్గర పనిచేసే వాళ్లనే సంతోషపెట్టకుంటే ప్రజలను ఎలా సంతోషపెడ్తాం? (చదవండి : ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం) వారంలో ఒక రోజు.. ఐఏఎస్ అధికారులు ప్రతి వారం ఒక రోజు రాత్రి ఆకస్మిక తనిఖీ చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, హాస్టళ్లల్లో నిద్ర చేయాలి. మీరు వస్తున్నట్లు ముందుగా ఎవరికి సమాచారం ఇవ్వద్దు. హాస్టళ్లు, స్కూళ్లు, పీహెచ్‌సీల పరిస్థితిని ఫొటో తీయండి. రెండేళ్ల తర్వాత తీసే ఫొటోలో మన అభివృద్ధి కనపడాలి. వాటి అభివృద్దికి కావాల్సిన నిధులు నేను మంజూరు చేస్తా. ఒక జిల్లా కలెక్టర్‌గా మీరు పనిచేసి వెళ్లిన తర్వాత ప్రజలు మంచిగా గుర్తు చేసుకోవాలి. పాలన పారదర్శకంగా, స్నేహపూర్వకంగా ఉండాలి. కలెక్టర్లు ఎప్పుడు నవ్వుతూ కనిపించాలి. అధికారులను అప్యాయంగా పలకరించాలి. సంక్షేమ పథకాల అమలులో పార్టీలు, రాజకీయాలను పట్టించుకోవద్దు’ అని వైఎస్ జగన్ సూచించారు.( చదవండి : మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్) -
అక్రమ నిర్మాణమైన ప్రజా వేదిక కూల్చేయాలి
-
‘ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం ఉండవల్లిలో నిర్మించిన ప్రజావేదిక అక్రమ నిర్మాణమని, దీన్ని కూల్చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మనం కూర్చున్న ఈ భవనం నిబంధనలకు విరుద్ధంగా కట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటువంటి అక్రమాలకు పాల్పడితే కిందిస్థాయి అధికారులు అక్రమాలు చేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలు చేపడితే బాధ అనిపించదా అని అడిగారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు సాగుతున్నాయని, దీనికి చెక్ పెట్టాల్సిన అవరసముందన్నారు. ప్రజావేదిక నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రారంభిద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో చెప్పడానికే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామని, ప్రజావేదికలో ఇదే చివరి సమావేశమని వెల్లడించారు. ఎల్లుండి (బుధవారం) నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రజావేదికను పూర్తిగా అవినీతి సొమ్ముతో నిర్మించారని సీఎం జగన్ ఆరోపించారు. (చదవండి: మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్) కాగా, ప్రజావేదికపై ఇప్పటికే ప్రభుత్వానికి సీర్‌ఆర్‌డీఏ నివేదిక సమర్పించింది. ప్రజావేదికను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నివేదికలో పేర్కొంది. అధికారంలో ఉండగా తన అక్రమ నివాసం పక్కన చంద్రబాబు అనధికారికంగా కట్టించిన ప్రజావేదిక అక్రమాలు, దుర్వినియోగాలకు వేదికగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ చంద్రబాబు సహా ఆయన కుమారుడు, టీడీపీ నేతలు దాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేశారు. పేరుకు ప్రభుత్వ భవనమే అయినా ఇన్నాళ్లు దానిని టీడీపీ కార్యాలయంగా వాడుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనూ ఇష్టానుసారం వినియోగించుకున్న చంద్రబాబు.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వదలకుండా వేలాడుతుండడం విమర్శలకు దారితీసింది. ప్రజావేదికను అక్రమంగా నిర్మించడమే కాకుండా దాన్ని తనకే ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
రేపు, ఎల్లుండి కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ సమావేశం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాడ్డక జరుగుతున్న తొలి కలెక్టర్ల సమావేశం కావడంతో.. దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నిలిపేందుకు స్పష్టమైన కార్యచరణతో ముందుకుసాగుతున్న ముఖ్యమంత్రి ఈ సమావేశంలో తన భవిష్యత్ ప్రణాళికలను కలెక్టర్లకు వివరించనున్నారు. అలాగే నవరత్నాల అమలు, అవినీతి రహిత పాలన, పారదర్శక పాలన ప్రధాన అజెండాగా ఈ కాన్ఫరెన్స్ సాగనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరుకానున్నారు. -
చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూడా అక్రమ కట్టడమే
-
అంతా అడ్డగోలు.. పైగా గగ్గోలు!
సాక్షి, అమరావతి: కృష్ణానది కరకట్టపై గత తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి అనుమతుల్లేకుండా ప్రజావేదికను అక్రమంగా నిర్మించిందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అయినా అది ప్రభుత్వానిది కావడం, అన్ని వసతులుండడంతో అక్కడ కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని టీడీపీ నాయకులు తప్పుపడుతూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శనివారం దానికి సంబంధించి పూర్తి నివేదికను సీఆర్డీఏ ద్వారా ఆయన తెప్పించుకుని అందులో జరిగిన అవకతవకలను గుర్తించారు. వాటిని ‘సాక్షి’కి వివరిస్తూ.. కరకట్టపై సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ప్రజావేదిక నిర్మాణానికి అనుమతివ్వడం సాధ్యంకాదని 2016 సెప్టెంబరు ఆరో తేదీన నీటిపారుదల శాఖ కృష్ణా సెంట్రల్ డివిజన్ చీఫ్ ఇంజినీర్ స్పష్టంచేసినట్లు తెలిపారు. ప్రతిపాదిత ప్రాంతం కృష్ణా నది కరకట్టపై ఉండడం, వరద ప్రభావిత ప్రాంతంగా ఉండడంతోపాటు కరకట్టపై నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని లోకాయుక్త ఆదేశించిందని చెప్పారు. ప్రజావేదిక ప్లాన్‌కు సీఆర్‌డీఏగానీ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం అనుమతిగానీ లేవని ధృవీకరించినట్లు మంత్రి తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకపోయినా అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ నోటి మాటతో ఈ కట్టడాన్ని నిర్మించారని.. అది కూడా అంచనాలు భారీగా పెంచేశారని తెలిపారు. ఎన్సీసీ కంపెనీకి తొలుత రూ.4.34 కోట్ల అంచనాతో ఈ నిర్మాణ పని అప్పగించగా ఆ తర్వాత దాన్ని రూ.8.90 కోట్లకు పెంచేశారని, చివరికి రూ.7.59 కోట్లు నిర్మాణ కంపెనీకి చెల్లించారని తెలి¯పారు. ఇది కూడా అప్పటి మంత్రి నారాయణ నోటి మాటగా జరిగిందని తెలిపారు. ప్రజావేదిక నిర్మాణం ఏ రకంగా చూసినా అక్రమ నిర్మాణమేనని, దాని పక్కనే ఉన్న చంద్రబాబు నివాసం కూడా అక్రమమేనని బొత్స స్పష్టంచేశారు. టీడీపీ రాద్ధాంతం సిగ్గుచేటు ఈ అక్రమ నిర్మాణం గురించి టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ప్రజావేదికను అక్రమంగా నిర్మించినా ప్రస్తుతానికి అన్ని వసతులతో అందుబాటులో ఉండడంవల్లే అక్కడ కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా వారి సామాజికవర్గానికి చెందిన వారి స్టార్ హోటళ్లలో కలెక్టర్ల సదస్సు నిర్వహించడంలేదని ప్రభుత్వానికి చెందిన భవనంలోనే నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతకుముందు ఉండవల్లి వెళ్లి ప్రజావేదికను పరిశీలించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రభుత్వ ధనంతో నిర్మించిన ప్రజావేదిక తమదంటూ టీడీపీ నేతలు గొడవ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు కొత్త ప్రభుత్వం అధీనంలోకి వస్తాయనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. ప్రజావేదికలో సమావేశాలు నిర్వహించొద్దని టీడీపీ నేతలు అనడం సరికాదన్నారు. అది చంద్రబాబు డబ్బులతోనో లేక ఆయన తాత ఆస్తులతోనో కట్టింది కాదన్నారు. ప్రజావేదికపై అధికారులతో టీడీపీ నేతలు గొడవ పెట్టుకోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. అధికారులపై దాడులు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బొత్స హెచ్చరించారు. -
అది అక్రమాల ‘వేదిక’!
సాక్షి, అమరావతి: అధికారంలో ఉండగా తన అక్రమ నివాసం పక్కన చంద్రబాబు అనధికారికంగా కట్టించిన ప్రజావేదిక అక్రమాలు, దుర్వినియోగాలకు వేదికగా మారింది. నిన్నమొన్నటి వరకూ చంద్రబాబు సహా ఆయన కుమారుడు, టీడీపీ నేతలు దాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేశారు. పేరుకు ప్రభుత్వ భవనమే అయినా ఇన్నాళ్లు దానిని టీడీపీ కార్యాలయంగా వాడుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనూ ఇష్టానుసారం వినియోగించుకున్న చంద్రబాబు.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వదలకుండా వేలాడుతుండడం విమర్శలకు దారితీస్తోంది. దాన్ని అక్రమంగా నిర్మించడమే కాకుండా ప్రభుత్వ నిబంధనలన్నింటినీ ఉల్లంఘించి వినియోగించుకున్న బాబు.. దాన్ని తనకే ఇవ్వాలనడం చర్చనీయాంశంగా మారింది. నిర్మాణమే అక్రమం.. కృష్ణానదిపై అక్రమంగా నిర్మించిన భవనాన్ని తన అధికారిక నివాసంగా మార్చుకున్న చంద్రబాబు.. 2017లో దాని పక్కనే ప్రజావేదికను నిబంధనలకు విరుద్ధంగా సీఆర్డీఏతో కట్టించారు. ఎటువంటి అనుమతుల్లేకుండా, భారీగా అంచనాలు పెంచి నిర్మించిన దీనిని ప్రజలను కలుసుకోవాలనే సాకుతో నిర్మించారు. కానీ, ఏనాడూ ప్రజలను అందులోకి రానీయలేదు. నిర్మించిన నాటి నుంచి టీడీపీ ఆఫీసుగానే వినియోగించారు. రాష్ట్ర విభజన తర్వాత గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యాలయంగా మార్చినా చంద్రబాబు అక్కడికి వెళ్లింది రెండు, మూడుసార్లే. ప్రభుత్వ సమావేశాలతోపాటు టీడీపీ శాసనసభాపక్ష సమావేశాలు, పార్లమెంటరీ పార్టీ సమావేశాలు, పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలు, ఇతర సమీక్షలు సైతం ఆయన అక్కడే నిర్వహించే వారు. ప్రభుత్వ ధనంతో నిర్మించిన భవనాన్ని పార్టీకి వాడుకోవడం ఏమిటనే విమర్శలొచ్చినా లెక్కచేయలేదు. ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రజావేదిక కిటకిటలాడేది. అభ్యర్థుల ఎంపిక, నాయకులతో మంతనాలు చేయడం దగ్గర నుంచి పార్టీ బాధ్యులందరూ అక్కడే ఉండి కార్యక్రమాలు నిర్వహించారు. లోకేశ్ సమావేశాలకు ఇదే వేదిక ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఇక్కడే సమావేశం నిర్వహించారు. ఆయన కుమారుడు లోకేశ్ సైతం మంగళగిరి కార్యకర్తలతో ప్రజావేదికలోనే సమావేశమయ్యారు. రెండురోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీమంత్రి దేవినేని ఉమా అక్కడే మీడియా సమావేశం నిర్వహించారు. ఇలా పార్టీ సమావేశాలకు చంద్రబాబు దాన్ని వాడుకుంటూనే తనకు కేటాయించాలని సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కలెక్టర్ల సమావేశాన్ని ప్రజావేదికలో నిర్వహించాలని నిర్ణయించి స్వాధీనం చేసుకోవడంతో టీడీపీ నేతలు దానిపై రాద్ధాంతం మొదలుపెట్టారు. ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వివాదాస్పదం చేయడంతోపాటు తమ వస్తువులను బయటపడేశారంటూ టీడీపీ నేతలు రచ్చ చేస్తున్నారు. అసలు అందులోకి పార్టీకి సంబంధించిన వస్తువులు, ఫైళ్లు ఎందుకు వచ్చాయనే దానికి నోరు మెదపని వారు.. తమ నుంచి అన్యాయంగా ప్రజావేదికను లాక్కున్నారని ఎదురుదాడి చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అక్కడున్న అధికారులను దూషిస్తూ ప్రజావేదికను ఎలా స్వాధీనం చేసుకుంటారని నానాయాగీ చేశారు. కోడ్ ఉల్లంఘించి మరీ దుర్వినియోగం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు సైతం చంద్రబాబు ప్రజావేదికను ఇష్టానుసారం దుర్వినియోగం చేశారు. కోడ్‌కు విరుద్ధంగా అక్కడ పార్టీ కార్యకలాపాలు నిర్వహించకూడదని తెలిసినా, ప్రతిపక్షాలు విమర్శించినా పట్టించుకోకుండా అక్కడి నుంచే పనిచేశారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఆయన లెక్కేచేయలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఓటమి పాలైన తర్వాత మౌనంగా ఉండి మళ్లీ ప్రజావేదికను పార్టీ కార్యకలాపాలకు వాడుకోవడం మొదలుపెట్టారు. తనను ఓదార్చడం కోసం నాయకులు, జనాలను అక్కడే కలుస్తున్నారు. -
కావాలనే టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారు
-
‘అది చంద్రబాబు, ఆయన తాత ఆస్తి కాదు’
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ధనంతో నిర్మించిన ప్రజావేదిక తమదంటూ టీడీపీ నేతలు గొడవ చేయడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు కొత్త ప్రభుత్వానికి వెళ్తానన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. ఈ నెల 24న ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫిరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం ఆ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదికలో సమావేశాలు నిర్వహించొద్దని టీడీపీ నేతలు అనడం సరికాదన్నారు. అది చంద్రబాబు డబ్బులతోనో లేక ఆయన తాత ఆస్తులతోనో కట్టింది కాదన్నారు. ప్రజావేదికపై అధికారులతో టీడీపీ నేతలు గొడవ పెట్టుకోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. అధికారులపై దాడులు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాదర్బార్‌లో కీలక ఫైళ్లు ఏముంటాయి? ప్రజావేదికను ప్రభుత్వానికి అప్పజెప్పమని నోటీసులు ఇచ్చినా టీడీపీ నేతలు ఖాళీ చేయలేదని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదిక ప్రభుత్వ ఆస్తి అని, అక్కడ ప్రజా సమస్యల ఫైళ్లు మాత్రమే ఉండాలన్నారు. అంతేకాని సింగపూర్‌తో ఒప్పందాలు, హెరిటేజ్ ఆస్తుల వివరాలు దాచుకోవడానికి అది చంద్రబాబు ఆస్తి కాదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సొమ్మును ఆదా చేయాలని చూస్తే.. టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ల సమావేశం కచ్చితంగా ప్రజావేదికలోనే నిర్వహించి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. -
ఈ నెల 24న ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు
-
ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఓవర్ యాక్షన్..
-
ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఓవర్ యాక్షన్..
సాక్షి, అమరావతి : ప్రజా వేదిక వద్ద టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ కాసేపు ఓవర్ యాక్షన్ చేశారు. కలెక్టర్ల సమావేశం నిమిత్తం ప్రజా వేదికలో ఏర్పాట్లు చేస్తుండగా శనివారం అక్కడకు వచ్చిన రాజేంద్రప్రసాద్ చంద్రబాబు సామాన్లు, టీడీపీ కార్యాలయం నమూనాను ఎవరు బైటపెట్టారని అధికారులను ప్రశ్నించారు. తమ అనుమతి లేకుండా వస్తువులు ఎలా బయటపెడతారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అయితే తాము నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తున్నామని అధికారులు సమాధానం చెప్పారు. గతంలో కలెక్టర్ల సమావేశం ప్రజా వేదికలో జరిగేదని.. ఇప్పుడు కూడా అలానే ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం పెడితే ఇబ్బందవుతుందని తెలిపారు. ఇక్కడ రోడ్లు, స్థలం ఇరుకుగా ఉంటయన్నారు. చంద్రబాబు కట్టిన ప్రజా వేదికలోనే కలెక్టర్ల సమావేశం పెట్టలా.. వేరే చోట పెట్టుకోకూడదా అని ప్రశ్నించారు. ఒకప్పుడు ప్రజా వేదిక జర్నలిస్ట్‌లకు షెల్టర్‌గా ఉండేదన్నారు రాజేంద్రప్రసాద్. అయితే విలేకరులు ఆయన మాటలకు అడ్డుపడుతూ.. తమని ఎన్నడూ ప్రజా వేదికలోకి రానివ్వలేదన్నారు. మీడియా ప్రతినిధుల సమాధానంతో కంగుతిన్న రాజేంద్రప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
‘ఆ వార్తలకు నాకు ఎలాంటి సంబంధం లేదు’
సాక్షి, అమరావతి : ప్రజావేదికకు సంబంధించి సోషల్ మీడియాలో తన పేరుతో సర్క్యులేట్ అవుతోన్న వార్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ స్పందించారు. కృష్ణా నది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ నివాసం సమీపంలో నిర్మించిన ప్రజావేదికపై తానుగానీ, వైఎస్సార్సీపీ నుంచి గానీ ఎలాంటి లేఖలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని ఇదివరకే ప్రకటించానని పేర్కొన్నారు. కానీ, ఇంకా ఈ అంశంపై మీడియాలో వస్తున్న కథనాలను చూసి మరోసారి స్పష్టం చేయదలచుకున్నానని ఓ ప్రకటనలో పునరుద్ఘాటించారు. మీడియా మిత్రులు ఈ విషయాన్ని గమనించగలరని కోరారు. -
చంద్రబాబుకు ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?
సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందనుకున్నాం. 40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా?, పోతుందా అనే సంశయం తప్ప...ఇంకేమీ కనిపించడం లేనట్టుంది. ప్రపంచం మొత్తాన్ని అమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?’ అంటూ ట్వీట్ చేశారు. (రాజధానిలో కృష్ణా కరకట్ట వెంట నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని తమకు ఇవ్వాలంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు.) చదవండి: (అక్రమ కట్టడాల కోసం లేఖలా?) అలాగే టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు సాహసోపేత నిర్ణయమని విజయసాయి రెడ్డి అభివర్ణించారు. కొన్ని సందర్భాల్లో విశ్రాంత న్యాయమూర్తులతో విచారణ చేయించడం చూశామని, ఇప్పుడు నిరంతరం స్క్రూటినీ ఉంటుందన్నారు. వైఎస్ జగన్ పాలన ఎంత పారదర్శకంగా ఉండబోతుందో ఇది చిన్న ఉదాహరణ అని ఆయన అన్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శారదా పీఠాన్ని సందర్శించడంపై పచ్చ చానల్ ఒకటి చర్చపెట్టిందని, కుల మీడియా పెద్దాయన ఒకరు మాట్లాడుతూ స్వాములు ఎవరిని ముట్టుకోరు ఆలింగనం ఎలా చేసుకుంటారని తన అజ్ణానాన్ని, ఏడుపును ప్రదర్శించారు. పీఠాదిపతులు ఎలా వ్యవహరించాలో కూడా వీరే నిర్ణయిస్తా అంటూ సూటిగా ప్రశ్నించారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను గురువారం ఉదయం ఎంపీలు విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, లోక్‌సభలో వైఎస్సార్ సీపీ పక్ష నేతగా మిథున్ రెడ్డిని నియమించిన విషయం విదితమే. -
అక్రమ కట్టడాల కోసం లేఖలా?
సాక్షి, అమరావతి: రాజధానిలో కృష్ణా కరకట్ట వెంట నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని తమకు ఇవ్వాలంటూ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రజావేదిక సాధారణ నిర్మాణమైతే దాని గురించి పెద్దగా చర్చకు ఆస్కారం ఉండేది కాదు. అయితే కృష్ణా కరకట్ట వెంట నిర్మించిన అక్రమ కట్టడాన్ని తనకు కేటాయించాలని కోరుతూ చంద్రబాబు లేఖ రాయడం పట్ల అధికారవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాలుగేళ్ల పాటు నివసించిన భవనమే అక్రమ కట్టడం కాగా దాని పక్కనే అక్రమంగా ప్రజావేదికను నిర్మించి ఇప్పుడు ఆ రెండూ తనకే కావాలని డిమాండ్ చేస్తుండడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా కరకట్ట వెంట మాజీ సీఎం చంద్రబాబు అక్రమ కట్టడాలు నాడు ఆగమేఘాలపై నిర్మాణం చంద్రబాబు సీఎంగా ఉండగా ఉండవల్లిలోని తన నివాసం పక్కనే పార్టీ, అధికారిక కార్యకలాపాల కోసం ఒక పెద్ద హాలు, ఆఫీసు గదులు ఉండే భవనం ఉండాలని ఆదేశించడంతో సీఆర్డీఏ ఆగమేఘాల మీద ప్రజావేదికను నిర్మించింది. కనీసం టెండర్లు కూడా పిలవకుండా సీఆర్డీఏ కమిషనర్ నోటి మాటతో రూ.5 కోట్ల వ్యయంతో ఎన్సీసీ దీన్ని నిర్మించింది. ఇది పూర్తయిన చాలా రోజుల తర్వాత పేరుకు టెండర్లు పిలిచినట్లు చూపించి బిల్లులు చెల్లించారు. చట్టాలకు తూట్లు పొడిచి.. వాస్తవానికి నదీ పరిరక్షణ చట్టం, పర్యావరణ చట్టాల ప్రకారం కృష్ణానది కరకట్ట వెంట ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. చంద్రబాబు అధికారంలో ఉండగా తన అవసరాలే తప్ప చట్టాలను పట్టించుకోకపోవడంతో సీఆర్డీఏ అధికారులు నిబంధనలను గాలికి వదిలేసి ఆ నిర్మాణాన్ని పూర్తి చేశారు. నీటిపారుదల శాఖ సైతం అభ్యంతరం చెప్పలేదు. నిర్మాణం పూర్తయిన తర్వాత చంద్రబాబు ప్రజావేదికను టీడీపీ కార్యాలయం మాదిరిగా మార్చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ నిధులతో కట్టిన భవనాన్ని యధేచ్చగా వాడుకున్నారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజావేదికను నారా లోకేష్ పార్టీ కార్యకలాపాల కోసం వినియోగిస్తుండడం గమనార్హం. బుధవారం కూడా చంద్రబాబు ప్రజావేదికలోనే పార్టీ నాయకులను కలవడం, రంజాన్ వేడుకలు నిర్వహించడం చేశారు. కృష్ణా నది పక్కన చంద్రబాబు నివాసం ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని బొంకి... మాజీ సీఎం చంద్రబాబు నివాసంగా ఉపయోగిస్తున్న భవనం నిర్మాణమే అక్రమమని గతంలోనే తేలిపోయింది. నదీ పరిరక్షణ చట్టానికి వ్యతిరేకంగా నిర్మించిన ఈ భవనాన్ని కూల్చేయాలని నీటిపారుదల శాఖ, తాడేపల్లి పంచాయతీలు గతంలో భవనం యజమాని లింగమనేని రమేష్‌కు నోటీసులిచ్చాయి. అయితే చంద్రబాబుకు రమేష్ సన్నిహితుడు కావడంతో అక్రమంగా నిర్మించిన నిర్మాణం సక్రమంగా మారిపోవడమేగాక ఏకంగా ఆయన నివాసమైపోయింది. అక్రమ కట్టడంలో సీఎం నివాసం ఉండడం ఏమిటని పర్యావరణవాదులు, పార్టీలు ఎన్ని ఆందోళనలు చేసినా చంద్రబాబు లెక్క చేయలేదు. అక్రమంగా నిర్మించిన ఇంట్లో చంద్రబాబు ఎలా ఉంటారని నాడు అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీయటంతో ఈ భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, దాన్నే తాను నివాసంగా వినియోగిస్తున్నట్లు వివరణ ఇచ్చారు. అయితే చంద్రబాబు తాజాగా సీఎం వైఎస్ జగన్‌కు రాసిన లేఖలో మాత్రం తన నివాసం ప్రైవేట్ భవనమని, దాని పక్కనే ఉన్న ప్రజావేదికను తనకు ఇవ్వాలని కోరడం గమనార్హం. ఎక్కడైనా ఓ భవనాన్ని స్వాధీనం చేసుకుంటే అది ప్రభుత్వానికే చెందుతుంది. చంద్రబాబు అది ప్రైవేట్‌దని పేర్కొనడంతో గతంలో తాను అబద్ధమాడినట్లు స్పష్టమవుతోంది. ప్రతిపక్ష నేతగా ఉన్న తనకు ప్రజావేదిక అవసరమని సీఎం వైఎస్ జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే చంద్రబాబు టీడీపీ శాసన సభాపక్ష నేతగా ఎన్నికయ్యారు తప్ప ఇంకా ఆ పదవి అధికారికంగా ఆయనకు దఖలు పడలేదు. ప్రతిపక్ష నేత హోదా కూడా రాకుండానే అక్రమంగా నిర్మించిన భవనాలను తనకు కేటాయించాలని కోరడం చర్చనీయాంశమైంది. ప్రజావేదిక నాకివ్వండి సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు కేటాయించాలని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. తాను సీఎంగా ఉన్న సమయంలో తన నివాసం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో సమావేశాల నిర్వహణ, సందర్శకులను కలిసేందుకు ప్రజావేదికను ఉపయోగించామని తెలిపారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో తాను సీఎం కార్యాలయాన్ని వదిలేశాక, తానుంటున్న ప్రైవేటు ఇంటిలోనే ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్న దృష్ట్యా తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికలో ఎమ్మెల్యేలు, సందర్శకులు, ప్రజలను కలిసేందుకు ఉపయోగించుకుంటానని తెలిపారు. తన విన్నపంపై సానుకూలంగా స్పందించి సంబంధించి అధికారులకు అందుకనుగుణంగా తగు సూచనలు ఇవ్వాలని కోరారు. బాబు విదేశీ పర్యటన వాయిదా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో చంద్రబాబు తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాలని ఆయన భావించారు. తొలి అసెంబ్లీ సమావేశాలకు గైరుహాజరైతే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో చంద్రబాబు విదేశీ పర్యటన వాయిదా వేసుకున్నట్లు సమాచారం. -
సీఎం వైఎస్ జగన్‌కు చంద్రబాబు లేఖ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు అధికార నివాసంగా కేటాయించాలని ఆయన ఈ సందర్భంగా ఆ లేఖలో కోరారు. కాగా ప్రజావేదిక చంద్రబాబు ఉంటోన్న ఇంటికి అనుబంధంగా ఉందని, దాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నివాసం కోసం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగాలని పార్టీ నాయకులు సూచించగా, చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. నిన్న తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయిన చంద్రబాబు తన నివాసం, పార్టీ రాష్ట్ర కార్యాలయం గురించి చర్చించారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయం అందరికీ అందుబాటులో లేనందున విజయవాడలో రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు మరో భవనాన్ని చూడాలని చంద్రబాబు ఇప్పటికే కేశినేని నాని, దేవినేని ఉమాకు సూచించారు. -
ప్రజా వేదికను బాబు నివాసానికి ఇవ్వండి
సాక్షి, అమరావతి: ఉండవల్లిలోని ప్రజావేదికను ప్రతిపక్ష నేత అధికారిక నివాసానికి కేటాయించమని ప్రభుత్వాన్ని కోరాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసం, పార్టీ రాష్ట్ర కార్యాలయం గురించి చర్చించారు. ప్రజావేదిక చంద్రబాబు ఉంటోన్న ఇంటికి అనుబంధంగా ఉందని, దాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నివాసం కోసం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగాలని పార్టీ నాయకులు సూచించగా, చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయం అందరికీ అందుబాటులో లేనందున విజయవాడలో రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు మరో భవనాన్ని చూడాలని చంద్రబాబు పార్టీ నాయకులు కేశినేని నాని, దేవినేని ఉమాకు సూచించారు. ప్రస్తుతం ఉన్న జిల్లా కమిటీల స్థానంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలు వేద్దామని తెలిపారు. హైదరాబాద్‌లో ఏపీకి చెందిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం సరికాదని, కేబినెట్లో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కొందరు నేతలు వ్యాఖ్యానించగా, చంద్రబాబు మరికొందరు నేతలు అప్పుడే పరిపాలనా వ్యవహారాలపై విమర్శలు చేయకూడదని సూచించారు. లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్‌గా విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా సీఎం రమేష్‌ను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు చినరాజప్ప, రామానాయుడు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా, లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావేదికలో లోకేశ్ పార్టీ సమావేశం
సాక్షి, అమరావతి: దారుణ ఓటమి తర్వాత కూడా తెలుగుదేశం నేతల్లో మార్పు కనిపించడంలేదు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఉండవల్లిలోని ప్రజావేదికను టీడీపీ పార్టీ కార్యాలయంలా వినియోగించుకున్నారు. ఇప్పుడు కూడా ప్రజావేదికలో రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎన్నికల సయమంలో కోడ్‌ను ఉల్లంఘించి యధేచ్చగా అందులోనే పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ ఆదివారం రాత్రి కూడా మంగళగిరి నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని ప్రజావేదికలోనే నిర్వహించారు. ప్రజలను సందర్శించేందుకు తనకో భవనం కావాలని తన ఇంటి పక్కనే సీఆర్డీఏ నిధులతో చంద్రబాబు ప్రజావేదికను కట్టించారు. కానీ ఏ ఒక్కరోజూ అందులో ప్రజలు, సందర్శకులను కలవకపోగా పూర్తిగా టీడీపీ కార్యాలయంలా మార్చి వేశారు. అధికారాన్ని కోల్పోయాక కూడా ఆయన కుమారుడు అక్కడే పార్టీ సమావేశాలు నిర్వహిస్తుండడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేస్తా వచ్చే ఎన్నికల్లో తాను మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని లోకేశ్ చెప్పారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆదివారం రాత్రి మంగళగిరి కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో నియోజకర్గంలో పర్యటిస్తానని తెలిపారు. ఓటమిపై తాను బాధపడటంలేదన్నారు. ముఖ్య నాయకులతో చంద్రబాబు మంతనాలు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు, నారా లోకేశ్ తదితరులతో సమావేశమైన ఆయన ఫలితాలు ఇలా ఉంటాయని తాను ఊహించలేదని, ప్రజలు తనను ఎందుకు తిరస్కరించారో అర్థం కావడంలేదని అన్నట్లు తెలిసింది. జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం, ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన కలవడం తదితర అంశాలపై చర్చించారు. మంగళవారం గుంటూరులో నిర్వహించనున్న ఎన్టీఆర్ జయంతి ఏర్పాట్లపై మాట్లాడారు. -
ఎన్నికల కోడ్ పట్టింపే లేదు
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడంలేదు. ఉండవల్లిలో తన అధికారిక నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికను ఆయన పూర్తిస్థాయి పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన లెక్కచేయడంలేదు. పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, ముఖ్య నేతలతో అక్కడే సమావేశం నిర్వహించనున్నారు. పోలింగ్ తర్వాత పరిణామాలు, గెలుపు అవకాశాలపై చర్చించేందుకు సోమవారం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకునే ప్రజావేదికలో పార్టీ సమావేశం ఎలా నిర్వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రజావేదికను చంద్రబాబు పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలకు వినియోగించడం మొదలుపెట్టారు. ఎన్నికల నియమావళి ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రులు తమ అధికారిక నివాసాలను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించకూడదు. సీఎంను కలిసేందుకు వచ్చే ప్రజల కోసం మూడేళ్ల క్రితం సీఆర్డీఏ ఐదున్నర కోట్లతో ప్రజావేదికను నిర్మించింది. ప్రజల కోసమే దాన్ని వినియోగించాలి. అయితే.. ఇక్కడ ప్రజల నుంచి చంద్రబాబు విజ్ఞప్తులు స్వీకరించడం చాలా అరుదుగా జరుగుతుండేది. కృష్ణా నది కరకట్టపై తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లిలో ఉన్న లింగమనేని రమేశ్‌కు చెందిన అక్రమ కట్టడాన్ని చంద్రబాబు తన అధికారిక నివాసంగా మార్చుకున్న విషయం తెలిసిందే. దాని పక్కనే ఈ గ్రీవెన్స్ హాలును నిర్మించారు. మొదటి నుంచి దీన్ని టీడీపీ కార్యక్రమాలకు ఎక్కువగా వినియోగిస్తున్న చంద్రబాబు ఎన్నికల సమయంలో దాన్ని పూర్తిస్థాయి పార్టీ కార్యాలయంలా మార్చివేశారు. పార్టీ కార్యకర్తల సమావేశాలు, జిల్లా, నియోజకవర్గాల సమీక్షలు, చేరికలు వంటి అన్ని కార్యకలాపాలన్నింటినీ ఇందులోనే నిర్వహిస్తున్నారు. పోలింగ్ జరగడానికి ముందు వివిధ జిల్లాల పార్టీ కార్యకర్తల సమావేశాలను వరుసగా ప్రజావేదికలో నిర్వహించారు. ప్రభుత్వ నిధులతో నెలకొల్పిన కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఇక్కడి నుంచే పార్టీ యథేచ్ఛగా వినియోగిస్తోంది. ఈ వ్యవస్థ ద్వారానే టెలీకాన్ఫరెన్స్‌లో వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల కోడ్ రాకముందు ప్రజావేదికను పార్టీ అవసరాల కోసం వినియోగించిన చంద్రబాబు కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మరింత అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోకుండా దాన్ని పార్టీ కోసం వాడుకున్నారు. ఇప్పుడు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పార్టీ సమావేశాలు అందులోనే ఏర్పాటు చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
టీడీపీ కార్యాలయం @ప్రజావేదిక
సాక్షి, అమరావతి: నీతి నియమాలు, ప్రజాస్వామ్యం, క్రమశిక్షణ గురించి నిత్యం శ్రీరంగనీతులు చెప్పే చంద్రబాబు ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా తుంగలో తొక్కి తన మాటలు, చేతలకు పొంతన ఉండదని ప్రజావేదిక సాక్షిగా మరోసారి నిరూపించారు. ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే వినియోగించాల్సిన తన అధికారిక నివాసం, దాని పక్కనే ఉన్న ప్రజా వేదికను పూర్తిస్థాయి పార్టీ కార్యాలయంలా మార్చివేశారు. సాక్షాత్తూ సీఎం స్థానంలో కూర్చున్న వ్యక్తే అధికార దుర్వినియోగానికి పాల్పడడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల నియమావళి ప్రకారం సీఎం, మంత్రులు తమ అధికారిక నివాసాలను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించకూడదు. కృష్ణా నది కరకట్టపై తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లిలో ఉన్న లింగమనేని రమేష్‌కు చెందిన అక్రమ కట్టడాన్ని చంద్రబాబు తన నివాసంగా మార్చుకున్నారు. మూడున్నరేళ్ల క్రితం ప్రభుత్వం దాన్ని సీఎం అధికారిక నివాసంగా గుర్తించింది. సీఎంని కలిసేందుకు వచ్చే ప్రజల కోసమంటూ సీఆర్డీఏ 2017 ఏప్రిల్‌లో ప్రజావేదిక (గ్రీవెన్స్ సెల్)ను నిర్మించింది. రూ.4.34 కోట్లతో ఎన్సీసీ ఈ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసింది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ ప్రజావేదికను మొదటి నుంచి చంద్రబాబు పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా దాన్ని, తన ఇంటిని ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలా మార్చివేశారు. విశాఖ, విజయనగరం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలతో ప్రజావేదికలో సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఎన్నికలకు వారిని సమాయత్తం చేసే ప్రసంగం ఇచ్చారు. మూడు రోజుల క్రితం చింతలపూడికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి ఆయన వెంట వచ్చిన కార్యకర్తలు పార్టీలో చేరే కార్యక్రమాన్ని అక్కడే నిర్వహించి వారితో మాట్లాడించడమే కాకుండా తానూ మాట్లాడారు. ఎన్ఆర్ఐ టీడీపీ తయారు చేసిన పది ప్రచార రథాలను ప్రజావేదిక ప్రాంగణంలోనే ఉంచి అక్కడి నుంచే వాటిని ప్రారంభించారు. సుజనాచౌదరి, యనమల, పార్టీ కార్యక్రమాలు సమన్వయం చేసే టీడీ జనార్థన్, వీవీవీ చౌదరి వంటి వారంతా ప్రజా వేదికలోనే అసమ్మతి నేతలు, వర్గాలతో బుజ్జగింపులు, సంప్రదింపులు జరుపుతున్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన కొందరు నేతలు టీడీపీలో చేరే కార్యక్రమాన్ని ప్రజావేదికలో నిర్వహించారు. మరోవైపు చంద్రబాబు ప్రతిరోజూ లక్షన్నర మంది పార్టీ కార్యకర్తలు, నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలా పనిచేయాలో నిర్దేశిస్తున్నారు. అంతమందితో ఒకేసారి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడేందుకు ప్రభుత్వం ఆధీనంలోని కమ్యూనికేషన్ వ్యవస్థను వాడుకుంటున్నారు. ఈ వ్యవస్థ అంతా ఆర్టీజీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. దాన్ని కూడా దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన పలు వ్యవస్థలను చంద్రబాబు పార్టీ కార్యక్రమాలకు ఇష్టానుసారం వాడుకుంటున్నారు. కోడ్ అమల్లో ఉండగా అధికారులతో సమీక్ష చేయకూడదని తెలిసినా వారితో టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. -
అవినీతి గోరంత ఖర్చు కొండంత
– రూ.6,487 అవినీతి తేల్చడానికి రూ.1.73 లక్షల ఖర్చు – అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు గుత్తి రూరల్ : ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిని తేల్చేందుకు చేపట్టిన సామాజిక తనిఖీలు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా తయారయ్యాయి. రూ.6.487 అవినీతి జరిగిందని సామాజిక తనిఖీ బందం అధికారులు తేల్చారు. ఈ అవినీతిని తేల్చేందుకు అధికారులు చేసిన ఖర్చు చూస్తే దిమ్మ తిరుగుతుంది. ఈ అవినీతిని తేల్చడానికి ఎకంగా రూ.1.73 లక్షలు ఖర్చు చేశారు. గుత్తి మండలంలో 2015 నవంబర్ 31 నుంచి ఈ ఏడాది జూన్ 31 వరకు రూ.4.88 కోట్ల ఉపాధి నిధులతో పనులు చేపట్టారు. ఈ నిధులు సక్రమంగా వినియోగించారా లేదా?అనే విషయంపై నిజాలను నిగ్గుతేల్చేందుకు ఈ నెల 14 నుంచి 19 వరకు గ్రామాల్లో సామాజిక తనిఖీ బందాలు తనిఖీలు చేశారు. మంగళవారం నిర్వహించిన ప్రజావేదికలో మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో రూ.6.487 అవినీతి జరిగిందని సామాజిక తనిఖీ బందాలు వివరించాయి. ఈ అవినీతి అక్రమాలు గుర్తించేందుకు ఒక రాష్ట్ర రిసోర్సు పర్సన్, జిల్లా రిసోర్సు పర్సన్లు 14 మంది, ఎస్టీఎంలు 1, వీఎస్‌ఏలు 42 మంది పని చేశారు. వీరందరికి అయిన ఖర్చు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వీరికిచ్చే వేతనం, ప్రయాణ భత్యం, పనులకు సంబంధించిన రికార్డుల జిరాక్స్‌లు, తనిఖీలు నిర్వహించిన అనంతరం జిల్లా డ్వామా అధికారులకు ఇవ్వాల్సిన నివేదికల జిరాక్స్‌ల కోసం మొత్తం రూ.1.73 లక్షలు ఖర్చు చేశారు. భారీగా అవినీతి జరిగినా టీడీపీ నేతల ఒత్తిళ్లలో సామాజిక తనిఖీ బందం తూతూమంత్రంగా తనిఖీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి తిరిగి తనిఖీలు సక్రమంగా జరిపించాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు. కార్యక్రమంలో ప్రిసైడింగ్ అధికారి ఈశ్వరయ్య, జిల్లా విజిలెన్స్ అధికారి చంద్రశేఖర్‌రావు, డీఆర్డీఏ టీఎంయూ ఈశ్వరయ్య, ఏపీడీ శైలకుమారి, ఎంపీడీఓ విజయప్రసాద్, ఏపీఓ రమేష్ పాల్గొన్నారు. -
కొనసాగిన సామాజిక తనిఖీ ప్రజావేదిక
కందుకూరు : మండల పరిధిలోని 23 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద 2015 సెప్టెంబర్ నెల నుంచి మే 31, 2016 వరకు జరిగిన 1982 పనులకు గాను అయిన రూ.6.50 కోట్ల ఖర్చుకు సంబంధించిన వివరాలను శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో ప్రజావేదిక ద్వారా సామాజిక తనఖీ నిర్వహించారు. డ్వామా అదనపు పీడీ జాన్సన్, జిల్లా విజిలెన్స్ అధికారి పోచయ్య ఆధ్వర్యంలో గ్రామాల వారీగా చేపట్టిన ఉపాధి పనులను సమీక్షించారు. మేట్లు హాజరు పట్టికలో కూలీల వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడం పట్ల బాధ్యులుగా క్షేత్ర సహాయకుల్ని చేస్తూ వారికి జరిమానా విధించారు. రైతుల పొలాల్లో నిర్ణయించిన దాని కంటే అధికంగా పనులు చేపట్టడం, కొంత మంది పొలాల్లో తక్కువగా పనులు చేయించడం, కొలతల్లో వ్యత్యాసాలను గుర్తించారు. మార్చి నెలలోపు వంద రోజుల కంటే అదనంగా పని దినాలు చేసిన కుటుంబాలకు ఏప్రిల్‌లో మిగతా డబ్బు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఎందుకు తీసుకోలేదని ఈ సందర్భంగా అధికారుల్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏపీడీ తిరుపతయ్య, ఎంపీడీఓ అనూరాధ, డీఆర్డీఏ ఏపీడీ ఉమాదేవి, ఏపీఓ రవీందర్‌రెడ్డి, సోషల్ ఆడిట్ టీం హెడ్ రజిత, ఎస్ఆర్పీలు రాజు, వెంకటేష్, టీఏలు, ఉపాధి సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, కూలీలు పాల్గొన్నారు. -
ప్రజావేదికను బహిష్కరించిన గ్రామస్తులు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని మండల ప్రజలు,స్థానిక ప్రజాప్రతినిధులు బుధవారం బహిష్కరించారు. ఉపాధి హామీ పథకం పనులపై ప్రజల సమక్షంలో ఆడిటింగ్ కోసం ఎంపీపీ శోభారాణి అధ్యక్షతను సమావేశం జరిగింది.అయితే గతంలో ఉపాధిహామీ పనుల్లో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోకుండా... మళ్లీ ప్రజా వేదిక నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ప్రజా ప్రతినిధులు అధికారులను ప్రశ్నించారు. దీంతో అధికారులు... ప్రజా ప్రతినిధుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.అధికారులు ... ప్రజా ప్రతినిధులు మాటలను పట్టించుకోక పోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వేదికను బహిష్కరిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
‘ఉపాధి’లో అక్రమాల వెల్లువ
కోటపల్లి, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ఏడోవిడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఉపాధి సిబ్బంది అక్రమాలు బయటపడ్డాయి. ఆరు నెలల్లో చేపట్టిన రూ.1.22 కోట్ల విలువైన పనులపై సామాజిక తనిఖీ బృందాలు చేసిన తనిఖీ వివరాలు వెల్లడించాయి. ప్రజావేదికకు అడిషనల్ పీడీ గణేష్‌జాదవ్, విజిలెన్స్ మేనేజర్ రమేష్‌రెడ్డి, అడిషనల్ పీడీ అంజయ్య, ఏపీడీలు సురేష్, అనిల్‌చౌహాన్ హాజరయ్యారు. స్థానిక ఎస్సార్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీ బృందం వివరాలు వెల్లడించింది. షట్పల్లి క్షేత్రసహాయకుడు రాజబాపు మరుగుదొడ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడ్డాడ ని వెల్లడి కావడంతో ఆయన్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఏపీడీ చెప్పారు. లబ్ధిదారులకు తెలియకుండా బినామీ పేర్లతో డబ్బులు స్వాహా చేశాడని పేర్కొన్నారు. ఆయన నుంచి రూ.90 వేలు రికవరీ చేయనున్నట్లు వివరించారు. కొండంపేట గ్రామపంచాయతీలో రూ.20 వేల నిధులు దుర్వినియోగమయ్యాయని, రికవరీకి ఆదేశాలిచ్చామని తెలిపారు. రికార్డుల నిర్వహణ సరిగా లేనందుకు 12 మంది ఎఫ్‌ఏలకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించామన్నారు. వీటితోపాటు పింఛన్ల పంపిణీలో అక్రమాలు బయటపడగా నిధుల రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామపంచాయతీలకు సంబంధించిన తనిఖీ వివరాలను డీఆర్పీలు చదివి వినిపించారు. ప్రజావేదికలో ఎంపీడీవో శంకరమ్మ, ఏపీవోలు వెంకటేశ్వర్లు, రామ్మోహన్, ఏపీఎం ఉమారాణి, సర్పంచులు దుర్గం మహేష్, విద్యాసాగర్‌గౌడ్, వెంకటస్వామి, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.