ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని మండల ప్రజలు,స్థానిక ప్రజాప్రతినిధులు బుధవారం బహిష్కరించారు. ఉపాధి హామీ పథకం పనులపై ప్రజల సమక్షంలో ఆడిటింగ్ కోసం ఎంపీపీ శోభారాణి అధ్యక్షతను సమావేశం జరిగింది.అయితే గతంలో ఉపాధిహామీ పనుల్లో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోకుండా... మళ్లీ ప్రజా వేదిక నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ప్రజా ప్రతినిధులు అధికారులను ప్రశ్నించారు.
దీంతో అధికారులు... ప్రజా ప్రతినిధుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.అధికారులు ... ప్రజా ప్రతినిధులు మాటలను పట్టించుకోక పోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వేదికను బహిష్కరిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.