
సాక్షి, అమరావతి: ప్రజావేదిక అక్రమ నిర్మాణం కనుకనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దానిని కూల్చివేయాలని నిర్ణయించారని మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రెండు రోజుల పాటు సాగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం తన నిర్ణయాన్ని చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. టీడీపీ నేతలపై ఎలాంటి కక్షలతో ఈ ప్రజా వేదికను కూల్చడం లేదని స్పష్టం చేశారు. ప్రజావేదిక కూల్చే ప్రక్రియ కొనసాగుతుందని.. చట్టం తన పనితాను చేసుకుపోతుందని మంత్రి అభిప్రాపడ్డారు.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివసిస్తున్న ఇంటి వ్యవహారాన్ని తన విజ్ఞతకే విడిచిపెడుతున్నామని అన్నారు. చంద్రబాబు కుటుంబ భద్రతా అంశంలో నిబంధనలను అనుసరించాలని.. దానిలో తమ సొంత నిర్ణయం ఏమీలేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం కృష్ణానది కరకట్టపై నిర్మించిన ప్రజావేదిక కూల్చివేసేందుకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment