
సాక్షి, అమరావతి : అక్రమ కట్టడం ప్రజా వేదిక కూల్చివేత పనులు రెండవరోజు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచే కూల్చివేత పనులను అధికారులు చేపట్టారు. ఆక్రమణల తొలగింపు ప్రజావేదిక నుంచే మొదలవ్వాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు.. కృష్ణానది కరకట్టపై గత టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేసే చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే అందుకు తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు భవనంలోని ఫర్నిచర్‌ను, ఏసీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. అనంతరం జేసీబీల సహాయంతో ప్రజావేదిక కూల్చివేత ప్రారంభమైంది.
చదవండి : అక్రమాల వేదిక!
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)