
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో విత్తనాల కొరతపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. విత్తనాలకు సంబంధించిన రూ.360 కోట్లను గత ప్రభుత్వం దారిమళ్లించిందని, దాని వల్లే ప్రస్తుతం సమస్యలు తలేత్తాయని సీఎం ఆరోపించారు. విత్తనాల నిధుల విడుదలలో ఉదారంగా ఉండాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రత్యామ్నాయ విత్తనాలైనా రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. వచ్చే ఐదేళ్లకు సరిపడ విత్తనాలపై సరైన ప్రణాళిక తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.