మహిళలపై నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, చిన్న పిల్లలపై జరగుతున్న నేరాల సంఖ్య ఆందోళనకరంగా ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. వైట్ కాలర్‌నేరాలను నియంత్రించాల్సి ఉందన్నారు. కృష్ణా, గుంటూరు, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలో మహిళలపై నేరాల సంఖ్య పెరిగిందని తెలిపారు.