పెళ్లికి ముందే డబ్బులు ఇవ్వండి: కేసీఆర్
హైదరాబాద్: కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు పెళ్లికి ముందే డబ్బులు అందివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. లబ్ధిదారులు నేరుగా తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శనివారం కేసీఆర్ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
దళితులకు భూమి ఇవ్వడంతో పాటు వ్యవసాయం చేసుకునేలా దారి చూపాలని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చేలా పోటీ పరీక్షలు సిద్ధం చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ బాధితులకు వివిధ సందర్భాల్లో ఆర్థిక సాయం చేయడానికి కలెక్టర్ వద్ద కోటి రూపాయల నిధి ఉండాలని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లలో అవినీతిని సహించరాదని కేసీఆర్ ఆదేశించారు. హాస్టళ్లలో మౌళిక సదుపాయాల మెరుగుదల కోసం నెలలో ఒక రోజును హాస్టల్ డేగా నిర్వహించాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కేసీఆర్ సూచించారు.