Viral Video: Joe Biden Struggles To Use Umbrella Amid Rain In Japan - Sakshi
Sakshi News home page

అయ్యో! గొడుగు ఎంత పని చేసింది.. అమెరికా అధ్యక్షుడిని తెగ ఇబ్బంది పెట్టిందిగా!

Published Sun, May 21 2023 12:19 PM | Last Updated on Sun, May 21 2023 12:42 PM

Usa President Joe Biden Struggles To Use Umbrella Amid Rain In Japan Video - Sakshi

టోక్యో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తరచూ వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే అది పరిపాలన పరంగా అనుకుంటే పొరపాటు. ఆయన చేసే పొరపాట్లు, తడబాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి సంబంధించిన పలు వీడియోలో గతంలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బైడెన్‌ మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ నెటిజన్లు ఆశ్చర్యపరుస్తోంది.

జీ 7 సమావేశాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ జపాన్‌లో పర్యటిస్తున్నారు. అయితే, ఆయన జపాన్‌లో లాండయ్యే సమయానికే  ఆ ‍ప్రాంతంలో వర్షం పడుతోంది. బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి మెట్లు దిగుతూ  చినుకులు పడుతున్న కారణంగా ఆయన చేతిలో ఉన్న గొడుగుని తెరిచేందుకు ప్రయత్నిస్తాడు గానీ అది ససేమిరా అన్నట్లు తెరుచుకోదు. చివరకు దాన్ని అలానే చేతిలో పట్టుకుని కిందకు దిగుతారు. ఈలోగా అక్కడ ఉన్న జపాన్ ప్రతినిధులకు అభివాదం చేయడం.. అనంతరం ప్రతినిధులు ఒక్కొక్కరిగా తమను తాము బైడెన్‌కు పరిచయం చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఆయన వానలో తడుస్తూనే వారితో మాట్లాడుతుంటారు. ఇది గమనించిన అమెరికా అధికారులు తమవద్ద ఉన్న గొడుగును పట్టే ప్రయత్నం చేస్తారు. అయితే బైడెన్ మరోసారి ప్రయత్నించడంతో చివరికి గొడుగు తెరుచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా రెండొంతుల మంది అమెరికన్లు తనకు రెండవసారి అవకాశం ఇచ్చేందుకు విముఖత చూపుతున్నట్లు నమ్ముతున్నట్లు పోల్స్‌ చెబుతున్నప్పటికీ బైడెన్‌ మాత్రం 2024లో తిరిగి ఎన్నిక కావాలనే ప్రణాళికలు రచిస్తున్నాడు.
 

చదవండి: సైడ్‌ హసల్‌.. వేణ్నీళ్లకు చన్నీళ్లు.. చదువు డబ్బు.. ఒక్క జాబ్‌ కాదు బ్రో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement