వైరల్‌ వీడియో: విమానం ఎక్కుతూ కిందపడబోయిన అమెరికా అధ్యక్షుడు | Viral Video: USA President Joe Biden Falls Down Us Jet Stairs In Poland | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: విమానం ఎక్కుతూ కిందపడబోయిన అమెరికా అధ్యక్షుడు

Published Thu, Feb 23 2023 3:45 PM | Last Updated on Thu, Feb 23 2023 4:15 PM

Viral Video: USA President Joe Biden Falls Down Us Jet Stairs In Poland - Sakshi

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్‌లోకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ కింద పడబోయారు. ఉక్రెయిన్, పోలాండ్‌లను సందర్శించేందుకు వెళ్లిన బైడెన్‌ తన పర్యటనను ముగించుకుని అమెరికాకు తిరుగపయనమైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్ర‍స్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విమానం మెట్లు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ బైడెన్‌ జారిపడడం ఇది మూడోసారి. 

రష్యా మిలిటరీ ఆపరేషన్‌ కారణంగా గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌లో ఉద్రిక్త వాతావారణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమై తన మద్దతును తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బైడెన్‌ కీవ్‌లో ఆకస్మికంగా పర్యటించి యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. యుద్ధం మొదలైన తర్వాత ఆయన ఉక్రెయిన్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముందస్తు సమాచారం ప్రకారం బైడెన్‌ పోలాండ్‌లో పర్యటిస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ప్రత్యక్షమై అందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. బైడెన్‌ పర్యటన ముందు జనవరిలో యూఎస్‌ సెనేటర్ల బృందం ఒకటి కీవ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే.


 

చదవండి  India Buying Russian Oil: భారత్‌ని నిందించలేం! అది మా పని కాదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement