న్యూయార్క్: గత కొంత కాలంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన, ఫిట్‌నెస్‌పై తీవ్ర విమర్శల పాలువుతున్నారు. ఆయన అధిక వయసు, మతిమరుపు కారణంగా పలు వేదికలపై వింతగా ప్రవర్తిస్తూ కొన్ని క్షణాల పాటు ఫ్రీజ్ అయిపోతున్నారు. పక్కనున్న వాళ్లు ఆయన్ను కదిలిస్తేగాని బైడెన్ తేరుకోవటం లేదు. ఇటువంటి ఘటన మరోకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రెసిడెంట్ జో బైడెన్ శనివారం ఓ ఫండ్‌రైజింగ్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. పికాక్ థియేటర్‌లో జిమ్మి కిమ్మెల్‌తో ఇంటర్వ్యూ ముగిసిన అనంతరం స్టేజీపై ప్రెసిడెంట్ బైడెన్, మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కలిసి నిల్చున్నారు. ఈ క్రమంలో భారీ వచ్చిన జనాలను చూసి.. ఒక్కసారిగా బైడెన్ కళ్లు దగ్గరుకు చేసుకొని విగ్రహంగా కదలకుండా 10 సెకండ్లపాటు ఫ్రీజ్ అయిపోయారు. దీంతో పక్కనే ఉన్న ఒబామా చేయిపట్టుకొని కదిలించటంతో బైడెన్ తేరుకొని ముందుకు నడిచినట్లు వీడియో దృష్యాల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🔥🚨DEVELOPING: President Obama had to guide Joe Biden off the stage with Jimmy Kimmel at Biden’s fundraising event in The Hamptons with George Clooney. pic.twitter.com/5OoWVhajOl
— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) June 16, 2024
ఇటీవల జరిగిన జీ-7దేశాల సమ్మిట్‌కు హాజరైన బైడెన్ వింతగా ప్రవర్తించారు. ఇటలీలోని అపూలియాలో తీర ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్‌ను దేశాధినేతలు వీక్షిస్తుంటే.. దానికి దూరంగా వెళ్లుతూ.. అక్కడ ఎవరూ లేకపోయినా షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరించినట్లు వీడియోల్లో కనిపించి విషయం తెలిసిందే. వెంటనే ఇటలీ ప్రెసిడెంట్ జార్జీయా మెలోని ఆయన దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకొని మరీ వెనక్కి తీసుకువచ్చారు.
LMFAOOO is Joe Biden okay??? pic.twitter.com/kvAJHBcwAd
— kira 👾 (@kirawontmiss) June 13, 2024
గతంలో పలు సందర్భాల్లో జో బైడెన్ ఫ్రీజ్ కావటం, తడబడటానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు బైడెన్ ఫ్రీజ్ మరోసారి ఫ్రీజ్ అయిపోయారనే వార్తలను వైట్‌హౌజ్ ఖండించింది. ప్రెసిడెంట్ బైడెన్ ఇక్కడ ప్రేక్షకులు చప్పట్లతో చూపించిన ప్రేమలో మునిగిపోయి అలా కొన్ని క్షణాలు ఉండిపోయారని తెలిపింది. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో సైతం బైడెన్ ప్రవర్తన, ఫిట్‌నెస్‌ను ప్రతిపక్ష పార్టీ ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే.
It took Joe Biden exactly 3 seconds to forget he had already shaken Schumer's hand. pic.twitter.com/V3eEOuaFuz
— Gain of Fauci (@DschlopesIsBack) June 12, 2024
Comments
Please login to add a commentAdd a comment