freezed
-
బొమ్మలా నిల్చున్న బైడెన్.. ఒబామా ఏం చేశారంటే..
న్యూయార్క్: గత కొంత కాలంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన, ఫిట్‌నెస్‌పై తీవ్ర విమర్శల పాలువుతున్నారు. ఆయన అధిక వయసు, మతిమరుపు కారణంగా పలు వేదికలపై వింతగా ప్రవర్తిస్తూ కొన్ని క్షణాల పాటు ఫ్రీజ్ అయిపోతున్నారు. పక్కనున్న వాళ్లు ఆయన్ను కదిలిస్తేగాని బైడెన్ తేరుకోవటం లేదు. ఇటువంటి ఘటన మరోకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రెసిడెంట్ జో బైడెన్ శనివారం ఓ ఫండ్‌రైజింగ్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. పికాక్ థియేటర్లో జిమ్మి కిమ్మెల్‌తో ఇంటర్వ్యూ ముగిసిన అనంతరం స్టేజీపై ప్రెసిడెంట్ బైడెన్, మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కలిసి నిల్చున్నారు. ఈ క్రమంలో భారీ వచ్చిన జనాలను చూసి.. ఒక్కసారిగా బైడెన్ కళ్లు దగ్గరుకు చేసుకొని విగ్రహంగా కదలకుండా 10 సెకండ్లపాటు ఫ్రీజ్ అయిపోయారు. దీంతో పక్కనే ఉన్న ఒబామా చేయిపట్టుకొని కదిలించటంతో బైడెన్ తేరుకొని ముందుకు నడిచినట్లు వీడియో దృష్యాల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.🔥🚨DEVELOPING: President Obama had to guide Joe Biden off the stage with Jimmy Kimmel at Biden’s fundraising event in The Hamptons with George Clooney. pic.twitter.com/5OoWVhajOl— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) June 16, 2024 ఇటీవల జరిగిన జీ-7దేశాల సమ్మిట్‌కు హాజరైన బైడెన్ వింతగా ప్రవర్తించారు. ఇటలీలోని అపూలియాలో తీర ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్‌ను దేశాధినేతలు వీక్షిస్తుంటే.. దానికి దూరంగా వెళ్లుతూ.. అక్కడ ఎవరూ లేకపోయినా షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరించినట్లు వీడియోల్లో కనిపించి విషయం తెలిసిందే. వెంటనే ఇటలీ ప్రెసిడెంట్ జార్జీయా మెలోని ఆయన దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకొని మరీ వెనక్కి తీసుకువచ్చారు.LMFAOOO is Joe Biden okay??? pic.twitter.com/kvAJHBcwAd— kira 👾 (@kirawontmiss) June 13, 2024గతంలో పలు సందర్భాల్లో జో బైడెన్ ఫ్రీజ్ కావటం, తడబడటానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు బైడెన్ ఫ్రీజ్ మరోసారి ఫ్రీజ్ అయిపోయారనే వార్తలను వైట్‌హౌజ్ ఖండించింది. ప్రెసిడెంట్ బైడెన్ ఇక్కడ ప్రేక్షకులు చప్పట్లతో చూపించిన ప్రేమలో మునిగిపోయి అలా కొన్ని క్షణాలు ఉండిపోయారని తెలిపింది. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో సైతం బైడెన్ ప్రవర్తన, ఫిట్నెస్ను ప్రతిపక్ష పార్టీ ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే.It took Joe Biden exactly 3 seconds to forget he had already shaken Schumer's hand. pic.twitter.com/V3eEOuaFuz— Gain of Fauci (@DschlopesIsBack) June 12, 2024 -
మరోసారి అమెరికా జోక్యం.. ఈసారి కాంగ్రెస్ ఖాతాలపై
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ వ్యవహరంపై అమెరికా స్పందన మరవకముందే.. అగ్రరాజ్యం భారత్‌కు సంబంధించిన మరో అంశంపై స్పందించింది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహరంపై అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భారత్‌లోని అమెరికా దౌత్యవేత్తకు బుధవారం సమన్లు కూడా జారీ చేయటం తెలిసిందే. అయితే ఘటన మరవకముందే అమెరికా భారత్‌కు సంబంధించిన మరో అంశంపై స్పందించటం గమనార్హం. తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించిన అంశంపై మరోసారి అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ప్రచారం చేయకుండా ఆ పార్టీకి సంబంధించిన పలు బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలు మాకు తెలుసు. ఈ విషయంలో కూడా మేము పారదర్శకత, సమయానుకూల న్యాయ ప్రక్రియను ప్రోత్సహిస్తాం’ అని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాత్యు మిల్లర్ అన్నారు. అయితే సీఎం కేజ్రీవాల్ విషయంలో స్పందించిన అమెరికా రాయబారికి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ.. ఆదేశ దౌత్యవేతకు భారత్ ఇచ్చిన సమన్లపై స్పందింస్తూ.. ‘నేను ప్రైవేట్ దౌత్యపరమైన వ్యాఖ్యలు చేయదలుచుకోలేను. కానీ, సీఎం కేజ్రీవాల్ విషయంలో నేను ఇక్కడి నుంచే బహిరంగంగా మేము పారదర్శకత, సమయానుకూల న్యాయప్రక్రియను ప్రోత్సహిస్తాం అని. మా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తే మేం పట్టించుకోం. ఇదే విషయాన్ని మేము ప్రైవేట్‌గా కూడా ఇలాగే స్పష్టం చేస్తాం’అని మాత్యు మిల్లర్ స్పష్టం చేశారు. గత లోక్‌సభ ఎన్నికలు జరిగిన 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 210 కోట్ల ఆదాయపన్ను కట్టాలంటూ తమ పార్టీకి చెందిన నాలుగు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసిందని, వాటిలో యూత్ కాంగ్రెస్ ఖాతా కూడా ఉందని ఇటీవల కాంగ్రెస్ పార్టీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా అమెరికా స్పందించటం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. దీనికి భారత్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో చూడాలి. -
గడ్డకట్టిన నయాగరా జలపాతం.. అద్భుత దృశ్యాలు
న్యూయార్క్: అమెరికాలో మంచు తుపాను(Bomb cyclone) విలయం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ ఎరుగనటువంటి చలి గాలులు, విపరీతంగా కురుస్తోన్న మంచు ధాటికి దేశమంతా అతలాకుతలమైంది. 4వేలకుపైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా 60 మందికిపైగా మరణించారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవటంతో పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. ముఖ్యంగా న్యూయార్క్, బఫెలో కౌంటీలో నెలకొన్న దుర్భర పరిస్థితులను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న చిత్రాలు, వీడియోలు చూపుతున్నాయి. బఫెలో కౌంటీలో వాహనాల్లోనే గడ్డకట్టుకుపోయి మరణించిన సంఘటనలూ ఉన్నాయి. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. దీంతో నయాగరా జలపాతం గడ్డకట్టుకుపోయింది. దీంతో పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ముగ్ధులైపోతున్నారు. నయాగరాకు 25 మైళ్ల దూరంలో బఫెలో ఉంటుంది. అయితే, నయాగరాలో కొన్ని ప్రదేశాల్లో నీరు గడ్డకట్టినా.. ప్రవాహం కారణంగా కొన్ని చోట్ల మాత్రం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గట్టకట్టుకుపోయిన నయాగరా జలపాతం ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నయాగరా ఫాల్స్ న్యూయార్క్ స్టేట్ పార్క్ ప్రకారం ప్రతి సెకనుకు 3,160 టన్నుల నీరు జలపాతం నుంచి పడుతుంది. ఈ నీరు ప్రతి సెకనుకు 32 అడుగుల వేగంతో ప్రయాణిస్తుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయిన సందర్భాల్లో నయాగరా నదిపై మంచు గడ్డకడుతుందని అధికారులు తెలిపారు. ఇలా మంచుతో ఏర్పడిన బ్రిడ్జ్‌పై నడవటాన్ని నిషేధించారు. 1912, ఫిబ్రవరి 4 నయాగరా నదిపై ఏర్పడిన మంచు వంతెనపైకి వెళ్లి ముగ్గురు చనిపోయిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. The day after the great freeze, my family and I went to #NiagraFalls. The #NiagraRiver below it had ice thick enough for you *to technically* get to #Buffalo, #NewYork by foot! Was it an intriguing and surreal Arctic experience for a kid from California, yes! pic.twitter.com/MAC8IIfjZc — Escondido Weather Observer (CoCoRaHs: CA-SD-197) (@KCAESCON230) December 23, 2022 ఇదీ చదవండి: Bomb Cyclone: అమెరికాలో కొనసాగుతున్న మంచు విలయం -
‘చిన్నమ్మ’ బయటకు రాకుండా కుట్ర!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ జైలు నుంచి బయటకు రాకుండా జాప్యం చేయడంలో కుట్ర జరుగుతున్నట్టుగా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ఆరోపించే పనిలో పడ్డాయి. జప్తు నోటీసులు ఒకదాని తర్వాత మరొకటి జారీ చేస్తుండడంపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ పరప్పన అగ్రహార చెరలో ఉన్న విషయం తెలిసిందే. 2021 జనవరిలో ఆమె శిక్షాకాలం ముగియనుంది. జరిమానా రూ. 10 కోట్లు చెల్లింపు తర్వాత జైలు నుంచి చిన్నమ్మ బయటకు రావడం ఖాయమని అమ్మ శిబిరం వర్గాలు దీమా వ్యక్తం చేశాయి. ఇందుకు తగ్గ కసరత్తుల్లో దినకరన్ నిమగ్నమయ్యారు. (చిన్నమ్మకు చెక్ పెట్టినట్టేనా..) ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ అక్రమంగా ఆర్జించారంటూ ఆస్తుల అటాచ్, షోకాజ్ నోటీసులు ఒక దాని తర్వాత మరొకటి వెలువడుతుండడం అమ్మ శిబిరంలో కలవరాన్ని రేపింది. ఇప్పటికే ఐటీ రెండు విడతలుగా ఆస్తుల్ని జప్తు చేసింది, మూడో విడతగా రూ. రెండువేల కోట్ల ఆస్తులను బుధవారం అటాచ్ చేసింది. నోటీసులను సిరుదావూర్ బంగ్లా, కొడనాడు ఎస్టేట్లలో ఐటీ వర్గాలు గురువారం అంటించి వెళ్లాయి. అమ్మ వారసులుగా దీప, దీపక్‌లను కోర్టు ప్రకటించిన దృష్ట్యా, వారికి కూడా షోకాజ్ నోటీసులు పంపడం గమనార్హం. ఇప్పటివరకు రూ. 3,900 కోట్ల విలువగల ఆస్తులను ఐటీ జప్తు చేసింది. చిన్నమ్మ విడుదలను అడ్డుకోవడం లక్ష్యంగా కుట్ర జరుగుతోందని అమ్మ శిబిరం ఆరోపిస్తోంది. ఎన్నికల అనంతరం వచ్చేలా కుట్ర సాగుతోందని, అందుకే ఆస్తుల అటాచ్లు, జప్తులు, షోకాజ్ నోటీసులు సాగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుట్రల్ని చిన్నమ్మ భగ్నం చేస్తారని పేర్కొన్నా, తాజా పరిణామాలు అమ్మ శిబిరాన్ని కలవరంలో పడేసి ఉండడం గమనార్హం. (చిన్నమ్మకు షాక్ : రూ 2000 కోట్ల ఆస్తుల ఫ్రీజ్) -
చిన్నమ్మకు షాక్ : రూ 2000 కోట్ల ఆస్తుల ఫ్రీజ్
చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళకు బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయ పన్ను అధికారులు ఆమెకు చెందిన రూ 2000 కోట్ల విలువైన ఆస్తులను బినామీ నిరోధక చట్టం కింద స్తంభింపచేశారు. వీటిలో రూ 300 కోట్ల విలువైన రెండు ఆస్తులున్నాయి. సిరుతవుర్, కొడనాడు ప్రాంతాల్లోని ఈ ఆస్తులు జయలలిత సన్నిహితురాలు శశికళ, ఇలవరసి, సుధాకరన్‌ల పేరు మీద ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. స్తంభింపచేసిన ఆస్తులకు ఆదాయపన్ను శాఖకు చెందిన బినామీ నిరోధక విభాగం అధికారులు నోటీసులు అతికించారు. కాగా, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్రమాస్తుల కేసులో బెంగళూరు పర్పప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగిసి వచ్చే ఏడాది జనవరిలో ఆమె విడుదల కానున్నట్టు సమాచారం హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. చదవండి : చిన్నమ్మకు కొత్త చిక్కులు -
మసూద్ అజర్‌కు మరో షాక్
పారిస్ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న భారత్‌కు ఆ దిశగా భారీ ఊరట లభించింది. మసూద్ అజర్ ఆస్తులను స్తంభింపచేస్తామని శుక్రవారం ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ దిశగా ఫ్రాన్స్ దేశీయాంగ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదంతో ప్రమేయమున్న వ్యక్తిగా మసూద్ అజర్ పేరును ఐరోపా యూనియన్ జాబితాలో చేర్చేందుకు ఫ్రాన్స్ చొరవ చూపుతుందని అధికారిక ప్రకటన వెల్లడించింది. కాగా మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా ఇప్పటికే కోరుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు పాకిస్తాన్‌ను తమ భూభాగంలో జైషే మహ్మద్ సహా ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని పలు ప్రపంచ దేశాలు ఇస్లామాబాద్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై జైషే మహ్మద్ పాల్పడిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించిన నేపథ్యంలో పాకిస్తాన్లో ఉగ్రశిబిరాలపై భారత్ మెరుపు దాడులు చేపట్టడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. -
చెల్లింపులకు బ్రేక్
నిలిచిపోయిన రూ.100 కోట్ల బిల్లులు ఆరో తేదీ నుంచి ఇదే పరిస్థితి ఖాతాలను ఫ్రీజ్ చేసిన ప్రభుత్వం సాంకేతిక సమస్యే కారణమంటున్న అధికారులు ఆందోళన చెందుతున్న ఉద్యోగులు పుష్కరాలు, మహిళా పార్లమెంటేరియన్ సదస్సు వంటి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి మాత్రం మొండిచేయి చూపుతోంది. ఆర్థిక లోటు ఉందంటూ వారికి సంబంధించిన వివిధ బిల్లులు చెల్లించేందుకు నిరాకరిస్తోంది. పలు ఖాతాలను సర్కారు ఫ్రీజ్ చేయడంతో జిల్లాలో దాదాపు రూ.100 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి. దీనిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. రామచంద్రపురం రూరల్ : జిల్లా ఖజానా కార్యాలయంలో చెల్లింపులకు బ్రేక్ పడింది. ఆర్థిక లోటు పేరుతో వివిధ ఖాతాలను ప్రభుత్వం ఫ్రీజ్ చేయడంతో ఈ నెల 6వ తేదీ నుంచి పలు హెడ్ అకౌంట్ల ద్వారా చెల్లింపులు నిలిచిపోయాయి. ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా సుమారు రూ.100 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. ఉద్యోగులకు సంబంధిం చిన వివిధ బిల్లులతోపాటు, ఆర్థిక అవసరాల కోసం పెట్టుకున్న బిల్లులను కూడా నిలిపివేశారు. సరెండర్ లీవ్, టీఏ, కార్యాలయ నిర్వహణ, సప్లిమెంటరీ జీతాలు, జీపీఎఫ్, విద్యార్థుల స్కాలర్షిప్, అంగన్వాడీ వేతనా లు తదితర వాటికి సంబంధించిన బిల్లులు నిలిచిపోయిన వాటి లో ఉన్నాయి. దీంతో ఆయా వర్గాలవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ కార్యక్రమాలకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం తమవరకూ వచ్చేసరికి ఈవిధంగా వ్యవహరించడం సరికాదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినపుడు ఉద్యోగులు తమ ఆర్జిత సెలవులను ప్రభుత్వానికి సరెండర్ చేసి సొమ్ము తీసుకుంటారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం వీటి చెల్లింపులు కూడా నిలిపివేసింది. టీఏ బిల్లుల పరిస్థితి కూడా ఇంతే. ప్రభుత్వ కార్యక్రమాలకు ఉద్యోగులు సొంత ఖర్చుతో హాజరై, ధించిన బిల్లులు పెట్టుకుంటారు. వీటి చెల్లింపులను కూడా నిలిపివేశారు. కార్యాలయ నిర్వహణ బిల్లులను కూడా నిలిపివేయడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారనుందని ఉద్యోగులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. అంగన్వాడీ వేతనాలను కూడా కార్యాలయ నిర్వహణ పద్దు నుంచి ఇస్తారు. వీటిని కూడా నిలిపివేశారు.