ఎల్మౌ (జర్మనీ): ప్రధాని నరేంద్ర మోదీ జీ7 సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ఆహ్వానం మేరకు మోదీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ మేరకు ఆల్ఫ్స్ పర్వత శ్రేణిలో జీ7 వేదికైన ఎల్మౌలో ఈ సదస్సు అట్టహసంగా జరిగింది. ఈ శిఖరాగ్ర సదస్సులో మోదీ దాదాపు 12 మంది దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సదస్సులో భారత ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. సదస్సు అనంతరం ఫోటో సెషన్ సందర్భంగా..ధేశాధినేతలంతా రెడీ అవుతున్న సమయంలో.. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నేరుగా మోదీ వద్దకు నడుచుకుంటూ వెళ్లి భుజం తట్టి మరీ పలకరించారు.
వెంటనే మోదీ కూడా వెనుదిరిగి కరచలనం చేసి చిరునవ్వులతో పరస్పరం పలకరించుకున్నారు. ఆ సమయంలో మోదీ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో సంతోషంగా సంభాషిస్తున్నారు. ఇంతలో బైడెనే స్వయంగా మోదీ వద్దకు వచ్చి ఆత్మీయంగా పలకరించడం ఆ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సదస్సులో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సహా మరికొద్దిమంది నాయకులతో మోదీ సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఐతే రెండోవ రోజు జరిగిన సమావేశంలో జీ 7 దేశాధినేతలు ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగించడం పై దృష్టి సారించారు.
Biden walks upto PM Modi at G7 Summit, shows bonhomie between leaders of democratic world
— ANI Digital (@ani_digital) June 27, 2022
Read @ANI Story | https://t.co/aKIgknrbsW#JoeBiden #PMModi #G7Summit #PMModiInGermany pic.twitter.com/E9DHcgyorT
(చదవండి: ఆ పోరులో మాతో కలిసి రండి.. జీ-7కు ప్రధాని మోదీ పిలుపు)
Comments
Please login to add a commentAdd a comment