వైరల్‌: 30 ఏళ్లు వచ్చే దాకా తొందరపడొద్దు.. టీనేజర్‌కు జో బైడెన్‌ సలహా | Joe Biden Dating Advice For This Young Girl Is Going Viral On Internet | Sakshi
Sakshi News home page

Video: 30 ఏళ్లు వచ్చే దాకా డేటింగ్‌ కోసం తొందరపడొద్దు.. టీనేజర్‌కు జో బైడెన్‌ సలహా

Published Sun, Oct 16 2022 7:11 PM | Last Updated on Sun, Oct 16 2022 7:43 PM

Joe Biden Dating Advice For This Young Girl Is Going Viral On Internet - Sakshi

అమెరికా అధ్యక్షుడు.. 80 ఏళ్ల జో బైడెన్‌ ఓ టీనేజ్‌ అమ్మాయికి ఇచ్చిన సలహా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జీవితంలో 30 ఏళ్లు వచ్చే దాకా తొందరపడవద్దని ఓ టీనేజర్‌కు సహజీవనం విషయంపై బైడెన్‌ సలహా ఇచ్చారు. కాలిఫోర్నియాలోని ఇర్విన్‌ వ్యాలీ కాలేజ్‌ ఈవెంట్‌లో బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత మీట్‌ అండ్‌ గ్రీట్‌ సెక్షన్‌లో భాగంగా బైడెన్‌ క్యాంపస్‌ విద్యార్థులతో కలిసి ఫోటో దిగారు. 

ఆ సమయంలో తన ముందు నిల్చున్న టీనేజర్‌ భుజంపై చేయి వేసి ‘నేను నా కూతురు, మనవరాలితో చెప్పిన ఓ ముఖ్యమైన విషయం ఇప్పుడు చెబుతున్నాను. 30 ఏళ్లు వచ్చే దాకా డేటింగ్‌ వంటి వాటి కోసం తొందరపడవద్దు’ అని చెప్పాడు. ఆమెకు సరిగా అర్థం కాకపోవడంతో మరోసారి బైడెన్‌ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అధ్యక్షుడి వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన సదరు అమ్మాయి తేరుకొని.. సరే ఇది నేను మనుసులో పెట్టుకుంటానని చెబుతూ నవ్వుతుంది

దీన్నంతటిని మరో యువకుడు వీడియో తీస్తుండగా.. అధ్యక్షుడి భద్రతా సిబ్బంది వద్దని అతన్ని వారించారు. ఈ వీడియో ట్విటర్‌లో షేర్‌ చేయగా.. వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 5 మిలియన్లకుపైగా వ్యూస్‌ వచ్చాయి. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. బైడెన్‌ ప్రవర్తనతో యువతి కాస్త ఇబ్బందిగా ఫీల్‌ అయిందని కొంతమంది అంటుంటే.. ‘అధ్యక్షుడు యువతిని పట్టుకోవడం వల్ల ఆమె ఆనందంతో ఆశ్చర్యపోయింది. తాత వయసున్న వ్యక్తి  యువతితో సరదాగా మాట్లాడుతుంటే.. ఎగతాళి చేయడానికి  సిగ్గుగా లేదా అంటూ మరికొంతమంది ఘాటుగా కామెంట్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement