అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురించి వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తున్నాం. అయితే.. ఇటలీ పీఎం మెలోనీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విసుగు తెప్పించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి సంబంధించిన మూమెంట్స్ కొన్ని సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుండడం చూస్తున్నాం. ముఖ్యంగా భారత ప్రధాని మోదీకి, ఆమెకు మధ్య ప్రత్యేకంగా ‘మెలోడీ’(మోదీ+మెలోనీ) మూమెంట్స్ పేరిట ప్రత్యేకంగా వైరల్ అవుతుంటాయి కూడా. అయితే..
వాషింగ్టన్‌లో జరిగే నాటో సదస్సు కోసం వెళ్లిన ఇటలీ ప్రధాని మెలోనీకి, అమెరికా అధ్యక్షుడు బైడెన్ విసుగు తెప్పించారు. మూడో రోజు సదస్సు ప్రారంభం కోసం సభ్యదేశాల ప్రపంచ దేశాల అధినేతలంతా ఎదురు చూస్తున్నారు. ఆ నిరీక్షణ మెలోనీకి చిరాకు తెప్పించినట్లుంది. ఎదురుగా ఉన్న ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో సంభాషిస్తూనే.. అంత ఇంకా ఎంత టైం? అంటూ అన్నారామె. దానికి అధ్యక్షుడు స్టబ్ తన ఫోన్ బయటకు తీసి టైం చూసి ఏదో చెప్పారు. దీంతో ఆమె మరోసారి కళ్లతో సైగ చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Giorgia #Meloni in top eye-rolling form as leaders at the #NATO summit wait for Stoltenberg and Biden to arrive for the first session today. pic.twitter.com/KVSobO8QNU
— Life On Earth (@e_jagat_) July 12, 2024
సుమారు 40 నిమిషాలు ఆలస్యంగా బైడెన్, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్‌తో కలిసి వచ్చారు. మొత్తంగా ఉదయం 10గం.లకు ప్రారంభం కావాల్సిన ఆ సదస్సు.. లేట్‌గా ప్రారంభమైంది. అన్నట్లు మెలోనీ-బైడెన్ మధ్య ఈ తరహా వైరల్ ఇన్సిడెంట్‌లు ఇంతకు ముందు కూడా వచ్చాయి.
WHAT IS BIDEN DOING? pic.twitter.com/iY33K2srII
— RNC Research (@RNCResearch) June 13, 2024
Comments
Please login to add a commentAdd a comment