Indian man shares photo with Pakistani former classmate - Sakshi
Sakshi News home page

భారత్‌, పాక్‌లను కలిపిన కేంబ్రిడ్జ్‌ స్నేహం.. గత 31 ఏళ్లుగా..

Published Thu, Jul 20 2023 10:36 AM | Last Updated on Thu, Jul 20 2023 11:06 AM

indian man shares photo of reunion with pakistani former classmate - Sakshi

చాలామందికి కాలేజీ రోజులు ఎంతో ఆనందంగా గడుస్తాయి. కొత్త పరిచయాలు, కొత్త అనుభవాల అన్వేషణలో  వారు తలమునకలై ఉంటారు. ఆటువంటి సమయంలో ఏర్పడిన స్నేహబంధం కొందరి విషయంలో జీవితాంతం నిలిచిపోతుంది. అటువంటి స్నేహితులు తమ స్నేహితుల కష్టనష్టాల్లో పాలు పంచుకుంటారు. ఇలాంటి కాలేజీ స్నేహితులు రీ యూనియన్‌ పేరుతో కలుసుకుంటారు. 

ఇటువంటి దీర్ఘకాల స్నేహబంధానికి సంబంధించిన ఒక ఉదంతం రథిన్‌ రాయ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. డాక్టర్‌ రాయ్‌ తనకు 31 ఏళ్లుగా స్నేహితునిగా ఉన్న తన క్లాస్‌మేట్‌ డాక్టర్‌ అలీ చీమాతో పాటు తాను ఉన్న ఒక ఫొటోను షేర్‌ చేశారు. డాక్టర్‌ రాయ్‌ భారత్‌కు చెందిన వ్యక్తి. డాక్టర్‌ చీమా పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి.  క్యాప్షన్‌లో డాక్టర్‌ రాయ్‌ ఇలా రాశారు..‘రథిన్‌ రాయ్‌ పీహెచ్‌డీ(కేంబ్రిడ్జ్‌) భారత పౌరుడు, అలీ చీమా పీహెచ్‌డీ(కేంబ్రిడ్జ్‌) పాక్‌ పౌరుడు. స్కాలర్‌ షిప్‌ పొందుతూ చదువుకున్న వీరు సామాన్య కుటుంబాల నేపధ్యం నుంచే వచ్చారు’

ఈ పోస్టుకు 75 వేల వ్యూస్‌ వచ్చాయి. దీనిని చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు తమ హృదయాలను హత్తుకున్నదని కొందరు అంటుండగా, ఈ ఫొటో వైరల్‌ అయ్యేందుకు అర్హత కలిగినదని పలువురు పేర్కొంటున్నారు. 
ఇది కూడా చదవండి: ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement