అనుష్క సీనియర్‌ అయితే.. | Actress Anushka is senior than me - Tamanna | Sakshi
Sakshi News home page

అనుష్క సీనియర్‌ అయితే..

Published Wed, Mar 1 2017 4:26 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

అనుష్క సీనియర్‌ అయితే.. - Sakshi

అనుష్క సీనియర్‌ అయితే..

నటి అనుష్క తనకంటే సీనియర్‌ అయినా అంటున్నారు నటి తమన్నా. ఇంతకీ ఈ మిల్కీబ్యూటీ చెప్పేదేమిటీ? సినీ తారల్లో ముఖ్యంగా నటీమణుల్లో పోటీ తీవ్రంగా ఉంటుంది. ఒకరి అవకాశాలను మరొకరు ఎగేసుకుపోవడానికి ఎత్తులు వేసుకోవడం చిత్ర పరిశ్రమలో సర్వసాధారణం. అదే విధంగా ఈర్ష్య ద్వేషా  లకు కొదవ ఉండదంటారు. కానీ నటి తమన్నా మాత్రం వీటికి భిన్నంగా చెబుతున్నారు. అదేమిటో ఆమె మాటలో్లనే... కథానాయికల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని, ఒకరిని చూసి మరొకరు ముఖం చిట్లించుకుంటారని, ఈర్షాధే్వషాలు ఎకు్కవేనని  రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి.

అభిమానులు తారల మధ్య పోటీ ఉంటుందని  భావిస్తుంటారు. నిజానికి తెరవెనుక వాస్తవ పరిస్థితులు వేరు. కథానాయికలు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ కుశల ప్రశ్నలతో సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. చిత్రాలు విజయం సాధిస్తే అభినందించుకుంటారు. కష్ట సమయాల్లో  పరామర్శించుకుంటారు. కథానాయికల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. పోటీ అన్నది మీడియా సృష్టే. నా వరకూ చెప్పాలంటే చాలా మంది కథానాయికలతో స్నేహం ఉంది. అందులో ప్రధాన స్నేహితురాలు అనుష్క. నేను ఆరంభ దశలో చిత్ర పరిశ్రమలో ఎవరూ తెలియక చాలా కష్టపడ్డాను.

అప్పటికే  నటిగా అనుష్క నాకంటే సీనియర్‌. అయినా ఎలాంటి గర్వం చూపకుండా నాతో స్నేహంగా మెలిగారు. చిత్ర పరిశ్రమ గురించి, ఇక్కడ ఎవరితో ఎలా మసలుకోవాలన్న పలు విషయాలను చెప్పారు. ఒక నటి నిరంతరంగా ఒక కాస్ట్యూమ్ డిజైనర్‌ను నియమించుకోవాలన్న విషయాన్ని తెలియని నాకు అనుష్కనే చెప్పారు. ఇలా చాలా విషయాల్లో తను నాకు సాయం చేశారు. నటి కాజల్‌ అగర్వాల్‌ నాకు మంచి స్నేహితురాలే. మేమిద్దరం సినిమాలో సమానంగా పయనిస్తూ దశాబ్ద కాలంగా నటిస్తున్నాం.

ఎలాంటి పాత్ర అయినా అందులో అద్బుతంగా నటించగల ప్రతిభాశాలి కాజల్‌. ఇక నా కళ్ల ముందు ప్రముఖ కథానాయకిగా ఎదిగిన నటి సమంత. తనతోనూ నాకు మంచి స్నేహబంధం ఉంది. సమంత ప్రతిభతో పాటు తెలివైన నటి. సినిమాల్లో  సంపాదించింది ఇతరులకు సాయం చేయాలన్న లక్ష్యంతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమంతను అభినందించాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది తమన్నా భాటియా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement