షడ్రుచుల సమ్మేళనం ఉగాది.
నవరసాల మేళవింపు సినిమా.
జీవితాన్ని అందరూఉగాది పచ్చడితో పోలుస్తూంటారు.
సినిమా కూడా సేమ్ టూ సేమ్.
తెలుగు తెరను తమ సోయగాలతో ఊయలలూగిస్తున్న ఆరుగురు సౌందర్య రాశుల గురించి ఈ మన్మథ నామ ఉగాది వేళ స్పెషల్ లుక్.
బొమ్మాళీ బొమ్మాళీ - అనుష్క
గ్లామర్ ప్రదర్శనలో అనుష్కను మించినవారు ఉండొచ్చు. కానీ పెర్‌ఫార్మెన్స్ విషయంలో తన తర్వాతే ఎవరైనా. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడంలోనూ, ఆ పాత్రతో వెండితెరపై ఇంద్రజాలం ప్రదర్శించడంలోనూ అనుష్కది తిరుగులేని స్థానం. బహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో సినిమాలతో ఈ కొత్త ఏడాదిలో ఆమె కలకలం సృష్టించడం ఖాయం.
పంచదార బొమ్మ... - కాజల్ అగర్వాల్
ఇక కాజల్ అగర్వాల్ పని అయిపోతుందనుకున్నప్పుడల్లా, ఓ సూపర్‌హిట్‌తో మళ్లీ రేసులో ముందుకు దూసుకుపోతుంటారు. ‘గోవిందుడు అందరివాడేలే’, ‘టెంపర్’ తర్వాత కాజల్ కొత్తగా తెలుగు సినిమాలేం కమిట్ కాలేదు. అలాగని ఆమె క్రేజ్ ఏమీ తగ్గలేదు. రేపో మాపో ఆమె కొత్త సినిమా కబురు వెల్లడి కావచ్చు.
ఏం మాయ చేశావె! - సమంత
అటు సినిమాల్లోనూ బిజీ. ఇటు సోషల్ సర్వీస్‌లోనూ బిజీ. అంతకు మించి సోషల్ మీడియాలోనూ సూపర్ బిజీ. ఈ సమ్మర్‌కి ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి జోడీగా వస్తున్న ఈ చెన్నై సుందరి తమిళంలోనూ తన మిలమిలలు చూపిస్తున్నారు.
ఎక్స్‌ట్రార్డినరీ - తమన్నా
హిందీ, తమిళంలో బిజీ అయిపోయి, తెలుగులో తమన్నా జోరు కాస్త తగ్గింది. లేకుంటే ఈపాటికి తనే నంబర్ వన్. రవితేజతో ‘బెంగాల్ టైగర్’ చేస్తోంది. లిప్‌లాక్‌లు, బికినీ సీన్స్‌కి దూరమని నిబంధనలు పెట్టినా, తమన్నా పరిమిత అందాల ప్రదర్శనకే ఫ్లాటయిపోతుంటారు ఫ్యాన్స్.
ఏం చక్కని మందారం - శ్రుతీహాసన్
కమల్‌హాసన్ కూతురనే ఇమేజ్‌ని కాకుండా తనకంటూ ఓ బ్రాండ్ సృష్టించుకుంది శ్రుతీహాసన్. తండ్రి తరహాలోనే ఆల్ రౌండర్ ఆమె. ఆట.. పాట.. నటన ఎందులోనైనా తను మేటి. తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో ఫుల్ బిజీ. గ్లామర్ కావలిస్తే గ్లామర్. పర్‌ఫార్మెన్స్‌కైతే పెర్‌ఫార్మెన్స్. దేనికైనా రెడీ.
తేరే బ్యూటీఫుల్ ఆంఖే... - రకుల్
తెలుగు తెరపై దూసుకుపోతున్న గ్లామర్ ఎక్స్‌ప్రెస్ రకుల్ ప్రీత్‌సింగ్. యూత్‌కి కావాల్సిన గ్లామర్ అంశాలన్నీ పుణికి పుచ్చుకుందీ భామ. అరనవ్వులు, చిలిపి చూపులు, సుందర సోయగంతో రకుల్ కుర్రకారుకి హాట్ ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ హీరోలందరూ కోరుకునే స్టార్ అంటే రకులే. నో డౌట్.
షట్ సౌందర్యరాశులు
Published Sat, Mar 21 2015 1:00 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM
Advertisement
Advertisement