ల.. ల.. లా..! ల.. ల.. ల.. ల... | all heroins about the new year | Sakshi
Sakshi News home page

ల.. ల.. లా..! ల.. ల.. ల.. ల...

Published Sat, Dec 31 2016 11:18 PM | Last Updated on Tue, Oct 30 2018 7:36 PM

all  heroins about the new year

ఒక ల.. లేడీస్‌
రెండో ల.. లైఫ్‌
మూడో ల.. లాజిక్‌
నాలుగో ల.. లైక్‌
ఐదో ల.. లవ్‌
ఆరో ల.. లక్‌
ఏడో ల.. లెక్క
2017లో
సెవన్‌ గర్ల్స్‌కి... సెవన్‌ క్వొశ్చన్స్‌.
ఏడుగురు అమ్మాయిలు... అందమైన ఏడు ఆన్సర్లు.
ల..ల..లా.. ల..ల..ల..ల... ఎంజాయ్‌...


ఏడుగురు కథానాయికలు... ఏడు ప్రశ్నలు
1.  2016కి వీడ్కోలు చెప్పేశారు! అంతా హ్యాపీయేనా?
2.  కొత్త ఏడాదిలో అడుగు పెట్టేశారు! ఈ ఏడాది ఎలా ఉంటుందనుకుంటున్నారు?
3.  అదృష్టం.. అదేనండీ లక్, టైమ్‌ వంటి వాటిని మీరు నమ్ముతారా?
4.  2016లో మీకు ఎదురైన చేదు అనుభవాలు?మీ అలవాట్లు ఏవైనా మార్చుకోవాలనుకుంటున్నారా?
5.  మెరుపుతీగలా రోజు రోజుకీ సన్నబడుతున్నారు. ఆ సీక్రెట్‌ ఏంటో? మాకూ చెప్పొచ్చు కదా!
6. న్యూ ఇయర్‌కి రిజల్యూషన్స్‌ తీసుకునే అలవాటు ఉందా?
7.  మీ దృష్టిలో ప్రేమంటే?


ఇప్పట్లో పడను  - కాజల్‌ అగర్వాల్‌
1. ఫెయిల్యూర్‌ లేకపోతే సక్సెస్‌ విలువ తెలియదు. ఫెయిల్యూర్‌ వచ్చినప్పుడు రాబోయే సక్సెస్‌ని దృష్టిలో పెట్టుకోవాలి. గతేడాది రెండూ ఎదురయ్యాయి. హిందీలో అంథురాలిగా చేసి న ‘దో లఫ్జోంకీ కహానీ’ మంచి పేరు తెచ్చింది. 2016 బాగానే అనిపించింది.
2. చిరంజీవిగారి సరసన చేసిన ‘ఖైదీ నం. 150’ రిలీజ్‌ ఈ ఏడాది మంచి మెమరీ. తేజగారి ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రంతో కథానాయికనయ్యా. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఆయన దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఈ ఏడాది విడుదలవుతుంది. 2017 కూడా బాగుంటుందనుకుంటున్నా.
3. ఒక్కోసారి ఎఫర్ట్‌ పెట్టినా టైమో, లక్కో కలసి రాక సక్సెస్‌ రాదు. ఈ రెండింటితో పాటు హార్డ్‌వర్క్‌ని నమ్ముతాను. క్రమశిక్షణ ఇంపార్టెంట్‌.
4. చేదు అనుభవాలు లేవు. చెడు అలవాట్లా? ఏవీ లేవు.
5. రోజూ 45 నిమిషాలు కార్డియో ఎక్సర్‌సైజులు, వారంలో ఓ గంట సేపు పైలెట్స్‌ క్లాసెస్, వారంలో మూడుసార్లు అప్పర్‌ బాడీ ట్రైనింగ్‌ తీసుకుంటాను. వీటితో పాటు ఫుడ్‌ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటా.
6. కొత్త నిర్ణయాలేవీ తీసుకోలేదు. ప్రొఫెషనల్‌గా నేను స్వార్థపరురాల్ని. మంచి పాత్రలన్నీ నాకే రావాలని కోరుకుంటా. మిగతా కథానాయికల మీద అసూయలాంటిదేమీ లేదు.
7. ప్రేమ అద్భుతమైనది. అమ్మానాన్నల ప్రేమ, చెల్లెలు నిషాతో ప్రేమ.. అన్నీ బాగుంటాయ్‌. ఇంకా ఏ అబ్బాయితోనూ ప్రేమలో పడలేదు. ఇప్పట్లో పడను. సినిమాలపైనే దృష్టంతా.

ఏది అనిపిస్తే అది చేస్తా - శ్రుతీహాసన్‌
1. గడచిన ఏడాదిలో వ్యక్తిగతంగా నేను చాలా పరిణతి సాధించాను. వ్యక్తిగతంగా 2016 అద్భుతం. నేనెప్పుడూ ఏడాదికి రెండు మూడు చిత్రాల్లో నటిస్తుంటా. కానీ, 2016లో ఒక్క సినిమా ‘ప్రేమమ్‌’లోనే నటించా. ఈ సినిమా అంతా కాటన్‌ చీరల్లో కనిపించడం మంచి అనుభూతి. హిందీ ‘రాకీ హ్యాండ్సమ్‌’లో అతిథి పాత్ర చేశా.
2. కొత్త ఏడాదిలోకి పాజిటివ్‌ థింకింగ్‌తో అడుగు పెడుతున్నా. సూర్యతో నటించిన ‘సింగం–3’ 2016లోనే విడుదల కావల్సింది. వాయిదా పడడంతో కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ‘కాటమరాయుడు’లో మంచి పాత్ర చేస్తున్నా. ‘శభాష్‌ నాయుడు’లో నాన్న, నేను తండ్రీకూతుళ్లుగా నటిస్తుండడం హ్యాపీగా ఉంది.
3. టైమ్, లక్‌కన్నా హార్డ్‌వర్క్‌ మనకి మంచి గుర్తింపు తీసుకొస్తుంది. కెరీర్‌ స్టార్టింగ్‌లో ఎక్కువ ఫ్లాపులే పలకరించాయి. కానీ, ఇప్పుడు నేనీ స్థాయికి వచ్చానంటే నా హార్డ్‌వర్కే కారణం.
4. నాకు ఏది అనిపిస్తే అది చేసేస్తాను. నా పద్ధతులు, అలవాట్లు మార్చుకోవాలని అనుకోలేదు.
5. శరీరానికి మాత్రమే కాదు, మనసుకి కూడా ఫిట్‌నెస్‌ అవసరం. అందుకే ఫిట్‌నెస్‌కి ఇంపార్టెన్స్‌ ఇస్తా.
6. రిజల్యూషన్స్‌ని నమ్మను. మంచి పని చేయడానికి ముహూర్తం ఎందుకని నా అభిప్రాయం.
7. ప్రేమ లైఫ్‌లో ముఖ్యమైన అంశం. మన వర్క్‌ మీద ప్రేమ కావొచ్చు. ఫ్యామిలీ, లైఫ్‌ పార్టనర్‌.... ప్రేమ ఫలానా వ్యక్తిపై ఉంటుందని చెప్పలేం. లవ్‌ వల్ల పాజిటివ్‌ ఫీల్‌ కలుగుతుంది.

ప్రేమ బాగుంటుంది - తమన్నా
1. గతేడాది ‘ఊపిరి’ వంటి కొత్త సినిమా, యాక్టింగ్, డ్యాన్స్, గ్లామర్‌కి ప్రాముఖ్యత గల ‘అభినేత్రి’ చేశా. మేక ప్‌ లేకుండా చేసిన తమిళ సినిమా ‘ధర్మదురై’ విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంస లు తెచ్చింది. ఓవరాల్‌గా హ్యాపీ.
2. ఈ ఏడాది కూడా నా నుంచి డిఫరెంట్‌ సినిమాలు వస్తాయి. ‘బాహుబలి–2’ వస్తుంది. హిందీ హిట్‌ ‘క్వీన్‌’ తమిళ రీమేక్‌లో నటించనున్నా. మరో ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ స్క్రిప్ట్‌ అంగీకరించా. ఓ తమిళ సినిమా చేస్తున్నా.
3. లక్‌ని కొంచెం, హార్డ్‌వర్క్‌ని ఎక్కువ నమ్ముతాను. ప్రతి సినిమాకీ ది బెస్ట్‌ ఇవ్వాలని ప్రయత్నిస్తా. ఫలితం ఎవరి చేతుల్లోనూ ఉండదు. అందువల్ల, రిజల్ట్‌ గురించి ఆలోచించను.
4. ఇటీవల ‘ఒక్కడొచ్చాడు’ దర్శకుడు సురాజ్‌ హీరోయిన్ల కాస్ట్యూమ్స్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ఓ చేదు అనుభవం. అందుకే ‘సారీ’ చెప్పాలని డిమాండ్‌ చేశా. క్షమాపణలు చెప్పినప్పటికీ మనసు ఇంకా బాధగానే ఉంది.
5. ప్రస్తుతం వెయిట్‌ లిఫ్టింగ్, క్రాస్‌ఫిట్‌ ఫాలో వర్కౌట్స్‌ చేస్తున్నా.  దుబాయ్‌ బేస్డ్‌ డైటీషియన్‌ రాశీ చౌదరి చెప్పిన డైట్‌ పాటిస్తా.
6. ఓ రిజల్యూషన్‌ తీసుకున్నా. బాడీని ఫిట్‌గా ఉంచుకోవాలనేది నా టార్గెట్‌. నెలన్నర నుంచి డైటింగ్, వర్కౌట్స్‌ చేస్తున్నా. ఈ వేసవి కల్లా నా కల నిజమవుతుందని ఆశిస్తున్నా.
7. ప్రేమలో పడేంత తీరిక లేదు. సినిమాలతోనే సరిపోతోంది. అయితే ప్రేమ చాలా బాగుంటుందని తెలుసు. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్‌ని నేను చాలా ప్రేమిస్తాను కదా.

అది ఎవరికీ చెప్పను - సమంత
1. నేను ఆరడుగుల ఎత్తు ఉన్నానంటే నమ్ముతారా! నేను చెప్పేది నిజమే. ‘అ... ఆ’, తమిళ ‘తెరి’ సినిమాలు విడుదలైన తర్వాత కొన్ని రోజులు ఆరడగుల ఎల్తైనట్టు ఫీలయ్యా. మిగతా సినిమాలూ సంతోషానిచ్చాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా హ్యాపీ. నా ప్రేమ కు అమ్మానాన్నలు అడ్డు చెప్పలేదు.
2. ఈ ఏడాది సినీ ప్రపంచం బయట కొన్ని పనులు చేయాలనుకుంటున్నా. అవి పూర్తి చేయడమే నా కర్తవ్యం. 2017లో ఐదారు సినిమాలు చేయాలనుకుంటున్నా.
3. లక్‌తో పాటు నా హార్డ్‌వర్క్‌ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. అందుకే లక్‌కి కొంచెం.. హార్డ్‌వర్క్‌ కొంచెం ఇచ్చేస్తా.
4. నేనేంటో తెలుసుకోకుండా కొంతమంది నా గురించి ఏవేవో తీర్పులు ఇచ్చేస్తారు. ప్రతి ఏడాదీ ఎదురయ్యే చేదు అనుభవం ఇదే. 2016లోనూ కొన్ని కష్టాలు వచ్చి వెళ్లాయంతే. కష్టాలు పక్కన పెడితే... నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకున్నా. ప్రతిదీ నాకే కావాలనే స్వార్థం, నాలో సహనం తగ్గడం... వీటిని మానుకోవాలనుకుంటున్నా.
5. ఫిట్‌నెస్‌ అంటే పిచ్చి. వర్కవుట్స్‌ మానను. హెల్తీ డైట్, ప్రాపర్‌ వర్కవుట్స్‌.. ఇవే నా ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌.
6. ప్రతి ఏడాదీ న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌ తీసుకుంటా. కానీ, అదేంటనేది ఎవరికీ చెప్పను.
7. ప్రేమ చాలా తీయనిది. ప్రేమ అంటే ఏదైనా కావచ్చు. అమ్మానాన్న, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, భార్యాభర్త.. ఇలా ఏదైనా కావచ్చు.

తలరాతను మార్చుకోవచ్చు- రకుల్‌ప్రీత్‌ సింగ్‌
1. ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధృవ’... గత ఏడాది మూడు గొప్ప చిత్రాల్లో నటించా. మూడింటిలో వేటికవే భిన్నమైన పాత్రలు చేశా. నటిగా నాకు మంచి పేరొచ్చింది. ఫుల్‌ హ్యాపీ.
2. వృత్తిపరంగా ఈ ఏడాది ఇంకా  గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నా. మహేశ్‌బాబు– ఏ.ఆర్‌. మురుగదాస్, సాయిధరమ్‌ తేజ్‌ ‘విన్నర్‌’, బెల్లంకొండ శ్రీనివాస్‌–బోయపాటి శ్రీను, అక్కినేని నాగచైతన్య–కల్యాణ్‌కృష్ణ... ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తున్నా. ఇవన్నీ ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకొస్తాయి.
3. మంచి ఛాన్సులు రావడానికి కొంచెం లక్‌ ఉండాలని నమ్ముతాను. ఆ తర్వాత మాత్రం మన తలరాతను నిర్ణయించేది మన కష్టమే. వృత్తి పట్ల అంకితభావంతో మెలుగుతూ నిజాయితీగా వంద శాతం కష్టపడితే తలరాతను మార్చుకోవడం సులభమే.
4. ఐయామ్‌ వెరీ డిసిప్లేన్డ్‌  గాళ్‌! నా అలవాట్లు ఏవైనా మార్చుకోవాలో? లేదో? తెలీదు. టైమ్‌ పంక్చువాలిటీ ఎక్కువ. ఒక్కోసారి అదే నన్ను ఇరిటేట్‌ చేస్తుంది. ఎందుకంటే.. ఎంత  ప్రయత్నించినా అనుకున్నట్లుగా పనులు కావు. అందువల్ల, నేనే కాస్త లేట్‌ చేయడం మంచిదనుకుంటున్నా!
5. ఫిట్‌నెస్‌ అంటే ప్రేమ. అందుకే విపరీతంగా వర్కవుట్స్‌ చేస్తా.
6. ఎప్పుడైతే మార్పు అవసరమని భావిస్తానో? అప్పుడే ఆచరించేస్తా! న్యూ ఇయర్‌ కోసం వెయిట్‌ చేయను.
7. ప్రేమ అంటే... ఇవ్వడం, నమ్మకం, నిస్వార్థమైన అనుభూతి.

అలా చేస్తే ఆ రెండూ సెట్‌ - లావణ్యా త్రిపాఠి
1. గతేడాది నాకు మెమరబుల్‌. హీరోయిన్‌గా పరిచయమైన ‘అందాల రాక్షసి’ నుంచి 2015 వరకూ ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేశా. కానీ, 2016లో నావి మూడు సినిమాలు విడుదల కావడం హ్యాపీ. వాటిలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ బ్లాక్‌బస్టర్‌ హిట్టయితే... తర్వాత వచ్చిన ‘శ్రీరస్తు శుభమస్తు’ మంచి విజయం సాధించింది.
2. వరుణ్‌తేజ్‌తో ‘మిస్టర్‌’, శర్వానంద్‌తో చేస్తున్న సినిమాలు ఈ ఏడాదే రిలీజవుతాయి. తమిళంలో సందీప్‌కిషన్‌తో ‘మాయవన్‌’ అనే సినిమా చేస్తున్నా. గతేడాది హిట్స్‌ వచ్చినప్పటికీ.. సంతృప్తి లేదు. ఈ ఏడాది మరింత హార్డ్‌వర్క్‌ చేయాలనుకుంటున్నా.
3. లక్‌ని నమ్మను. హార్డ్‌వర్క్‌ను నమ్ముతా. కష్టపడి పనిచేస్తే.. టైమ్, లక్‌ అన్నీ సెట్టవుతాయని నా  ఫీలింగ్‌.
4. పరిస్థితులను బట్టి కొందర్ని  గుడ్డిగా నమ్మేస్తాం. వాళ్లు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోనప్పుడు బాధపడతాం. గతంలో అలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. అప్పట్నుంచీ గుడ్డిగా నమ్మడం మానేశా. ముందూ వెనుకా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నా.
5. స్వతహగా నాది థిన్‌ పర్సనాలిటీ. అలాగని, వర్కౌట్స్‌ని నిర్లక్ష్యం చేయను. వీలు కుదిరినప్పుడు రూమ్‌లోనే వర్కౌట్స్‌ చేస్తుంటా.
6. తెలుగు సినిమాలు చేస్తూ ఇక్కడి అమ్మాయిని అయ్యా. ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా.
7. ప్రతి ఒక్కరూ ప్రేమకు ఒక్కో  నిర్వచనం ఇస్తుంటారు. ప్రేమపై నాకెలాంటి అభిప్రాయం లేదు. ఐ లవ్‌ మై వర్క్‌ అండ్‌ పేరెంట్స్‌.

ఆ ప్రమాదం ఓ పాఠం - ప్రణీత
1. ఆల్‌ హ్యాపీస్‌. నో వర్రీస్‌. ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో బిజీ బిజీగా గడిచింది. ముఖ్యంగా మహేశ్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేయడం నాకు మంచి మెమరీ.
2. నేను పాజిటివ్‌ పర్సన్‌. అందుకని 2017లో అంతా బాగుంటుందని నమ్ముతున్నా. తమిళంలో నేను యాక్ట్‌ చేసిన ‘ఎనక్కు వైత్త అడిమైగళ్‌’ ఈ నెలలోనే విడుదలవుతుంది. ఇంకా రానున్న నెలల్లోనూ నా సినిమాలు వస్తాయి.
3. లక్, టైమ్‌ని నమ్ముతా. వీటితో పాటు హార్డ్‌ వర్క్‌ చాలా ముఖ్యం. వర్క్‌ విషయంలో నేను ఎంత కష్టపడటానికైనా రెడీగా ఉంటాను. ఈ ఏడాది ఇంకా డోస్‌ పెంచాలనుకుంటున్నా.
4. చేదు అనుభవాలు చిన్న చిన్నవి ఉన్నాయి. 2016లో జరిగిన యాక్సిడెంట్‌ని మరచిపోలేను. ఆ ప్రమాదం నాకు ఓ పాఠం నేర్పించింది. అప్పటి నుంచి ఏ వాహనంలో వెళ్లినా డ్రైవర్‌ని 80కి మించి వేగం వెళ్లనివ్వడం లేదు.
5. 2016 హెల్త్‌ వైజ్‌గా బాగా అనిపించింది. మా అమ్మగారు చెప్పిన మీదట ‘అవొకాడొ’ తింటున్నాను. ఆ పండులో చాలా పోషక పదార్థాలుంటాయి. స్కిన్‌కి చాలా మంచిది. ఇక వర్కవుట్స్‌ విషయానికొస్తే.. కొంచెం జిమ్, యోగా, సైక్లింగ్, రన్నింగ్‌ చేస్తా.
6. నో రిజల్యూషన్స్‌. ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా.
7. నాకు బాయ్‌ఫ్రెండ్స్‌ లేరు. అందుకని అబ్బాయితో ప్రేమ తాలూకు అనుభూతి గురించి తెలియదు. కానీ, ప్రేమ బాగుంటుందని తెలుసు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement