సమంతకు కలిసొచ్చిన కాలం | samantha having good time in film industry | Sakshi
Sakshi News home page

సమంతకు కలిసొచ్చిన కాలం

Published Wed, Nov 20 2013 4:31 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

సమంతకు కలిసొచ్చిన కాలం - Sakshi

సమంతకు కలిసొచ్చిన కాలం

చిత్ర పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు కాలం కలిసి వస్తుందో తెలియదు. ఇక్కడ ఐరన్ లెగ్‌గా ముద్ర పడిన వారు తర్వాత గోల్డెన్ లెగ్‌గా అందలమెక్కిన సందర్భాలు ఉన్నాయి. తలరాతలు మారిన వారిలో నేటి క్రేజీ హీరోయిన్లు అనుష్క, కాజల్ అగర్వాల్, ఇలియానా, తమన్నా కూడా ఉన్నారు. వీరు తొలి రోజుల్లో కోలీవుడ్‌లో ఐరన్ లెగ్ ముద్ర పడిన వారే. ఆ తర్వాత గోల్డెన్ లెగ్‌గా పొగడ్తలు అందుకుంటున్నారు.
 
 ఇప్పుడు నటి సమంతకు ఇదే తంతుగా మారనుందా? అంటే అలాంటి అవకాశాలు లేకపోలేదంటున్నారు కోలీవుడ్ వర్గాలు. సమంతకు కోలీవుడ్‌లో రాణించాలని ఆశ. ఇప్పటికి నాలుగైదు చిత్రాల్లో నటించినా కోలీవుడ్‌లో ఈ చెన్నై సుందరిని సక్సెస్ వరించలేదు. తాను గురువుగా భావించే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన నీదానే ఎన్ పొన్ వసంతం చిత్రంపై ఈ అమ్మడు అధిక ఆశలే పెట్టుకుంది. ఆ చిత్రం ఆమె ఆశల్ని పూర్తిగా నీరుగార్చింది. దీంతో ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో ఐరన్ లెగ్ ముద్రపడిపోయింది. టాలీవుడ్‌లో స్టార్‌గా వెలిగిపోతోంది.
 
  దీంతో తమిళంలో మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. ఈ సారి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రావడంతో సమంత దశ తిరగనుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సూర్య సరసన లింగుసామి దర్శకత్వంలో నటిస్తోంది. విజయ్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతోందన్నది తాజా సమాచారం. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించే ఈ చిత్రం 2014లో సెట్‌పైకి రానుందని సమాచారం. ఈ రెండు భారీ చిత్రాలతో సమంత గోల్డెన్ లెగ్ హీరోయిన్ సమంతగా మారుతుందేమో వేచి చూద్దాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement