అధికారంలో ఉన్నప్పుడు పుతిన్‌కు కోవిట్–19 కిట్లు
బాబ్ వుడ్‌వర్డ్ ‘వార్’ పుస్తకంలో సంచలన విషయాలు
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యా అధినేత పుతిన్ కోసం కోవిడ్–19 టెస్టింగ్ కిట్లు రహస్యంగా అందజేశారా? పుతిన్ వీటిని వ్యక్తిగతంగా వాడుకున్నారా? పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా పుతిన్‌తో ట్రంప్ రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగించారా? అవుననే చెబుతోంది ఓ పుస్తకం. వాటర్‌గేట్ కుంభకోణంపై వార్తలు రాసిన విలేకరి బాబ్ వుడ్‌వర్డ్ రచించిన ‘వార్’అనే పుస్తకంలో ఈ సంచలన విషయాలు ప్రస్తావించారు.
ఈ పుస్తకం ఈ నెల 15న విడుదల కానుంది. ఇందులోని కొన్ని ముఖ్య అంశాలను అమెరికా పత్రికలు బయటపెట్టాయి. ట్రంప్ 2021లో అధికారం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ట్రంప్, పుతిన్ కనీసం ఆరుసార్లు ఫోన్‌లో సీక్రెట్‌గా మాట్లాడుకున్నారని ట్రంప్ సహాయకుడు చెప్పినట్లు పుస్తకాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం అమెరికాలో సంచలనాత్మకంగా మారింది. ఇదిలా ఉండగా, వార్ పుస్తకంలోని అంశాలను ట్రంప్ ప్రచార బృందం ఖండించింది.
అదొక చెత్త పుస్తకం, అందులోని కాగితాలు టాయిలెట్ టిష్యూగా వాడుకోవడానికి పనికొస్తాయని ఎద్దేవా చేసింది. ట్రంప్ సైతం స్పందించారు. కథలు చెప్పడంతో దిట్ట అయిన బాబ్ వుడ్‌వర్డ్ చెప్పే పనికిమాలిన విషయాలు నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. అతడొక చెడ్డవ్యక్తి అని విమర్శించారు. తాజా వివాదంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ కూడా స్పందించింది. ‘వార్’పుస్తకంలో ప్రస్తావించిన వాటిలో ఏమాత్రం వాస్తవం లేవని, అవన్నీ అభూత కల్పనలు అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తేలి్చచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment