హర్భజన్ సింగ్
క్రికెటర్ నుంచి యాక్టర్‌గా మారి ‘ఫ్రెండ్‌షిప్ యువర్స్ ఫ్రెండ్లీ’ అనే చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు హర్భజన్ సింగ్. ఇందులో లోస్లియా మరియాసేన్ కథానాయికగా నటిస్తున్నారు. జాన్‌పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటుడు అర్జున్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ సినిమాలో మెకానికల్ స్టూడెంట్‌గా హర్భజన్ సింగ్ నటిస్తున్నట్లు తెలిసింది.
‘‘స్కూలింగ్ తర్వాత కొంత గ్యాప్ వచ్చి, మళ్లీ చదువును కొనసాగించే వ్యక్తి పాత్రలో కనిపిస్తారు హర్భజన్ సింగ్. మెకానికల్ ఇంజినీరింగ్ చదవడం కోసం పంజాబ్ నుంచి కోయంబత్తూర్ వచ్చి ఓ కాలేజ్‌లో జాయిన్ అవుతారు హర్భజన్. కోయంబత్తూర్‌కే హర్భజన్ ఎందుకు వచ్చాడు? అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే కథాంశం. ఈ చిత్రంలో అర్జున్ క్యారెక్టర్ ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. లాక్‌డౌన్‌కి ముందే తొలి షెడ్యూల్ పూర్తయింది. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment