
హర్భజన్ సింగ్, లోస్లియా
క్రికెటర్ హర్భజన్ సింగ్, నటుడు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. ‘సింగ్ అండ్ కింగ్’ అన్నది ఉపశీర్షిక. మాజీ మిస్ శ్రీలంక, తమిళ బిగ్ బాస్ విన్నర్ లోస్లియా హీరోయిన్ గా నటిస్తున్నారు. జాన్ పాల్ రాజ్–శ్యామ్ సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. 25 కోట్ల బడ్జెట్‌తో తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు హక్కులను శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఎ.ఎన్.బాలాజీ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎ.ఎన్ . బాలాజీ మాట్లాడుతూ –‘‘ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ నేపథ్యంలో ప్రేమలు, గొడవల మధ్య ఆద్యంతం ఉత్కంఠగా నడిచే చిత్రమిది. చివరి షెడ్యూల్ ప్రస్తుతం కోయంబత్తూర్, ఊటీలలో జరుగుతోంది. హర్భజన్ సింగ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఈ చిత్రం హిందీలోనూ విడుదల కానుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment