'ఫ్రెండ్‌షిప్'..‌ లైఫ్‌లో మజా కోసం.. | Harbhajan Singh Friendship Movie: New Song Released | Sakshi
Sakshi News home page

'ఫ్రెండ్‌షిప్'..‌ లైఫ్‌లో మజా కోసం..

Published Mon, Mar 29 2021 3:58 PM | Last Updated on Mon, Mar 29 2021 3:58 PM

Harbhajan Singh Friendship Movie: New Song Released - Sakshi

క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "ఫ్రెండ్‌షిప్‌". 'సింగ్ అండ్ కింగ్' అనేది ట్యాగ్ లైన్.

క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "ఫ్రెండ్‌షిప్‌". 'సింగ్ అండ్ కింగ్' అనేది ట్యాగ్ లైన్. ఇటీవల ఈ సినిమా నుంచి 'లైఫ్ లో మజా కోసం' అనే పాట విడుదలైంది. శరత్ సంతోష్ ఆలపించిన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. సుమారు 25 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య' సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

ఆర్‌కే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్. బాలాజీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో తమిళ బిగ్ బాస్ విన్నర్, మాజీ 'మిస్ శ్రీలంక' 'లోస్లియా' హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. పలు సినిమాలతో గుర్తింపు దక్కించుకున్న కమెడియన్ సతీష్ నటిస్తున్నాడు. శాంతకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా డి.ఎం.ఉదయ్ కుమార్ సంగీతం అందించారు.

చదవండి: నటుడు ఆర్యకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు!

సుమ తొలి యాంకరింగ్‌ ప్రోగ్రాం ఏంటో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement