స్నేహం పేరుతో వ్యభిచార కూపంలోకి | Man Arrest in Prostitution Scandal Case With Minor Girl Visakhapatnam | Sakshi
Sakshi News home page

స్నేహం పేరుతో వ్యభిచార కూపంలోకి

Published Thu, Oct 31 2019 12:27 PM | Last Updated on Thu, Oct 31 2019 12:27 PM

Man Arrest in Prostitution Scandal Case With Minor Girl Visakhapatnam - Sakshi

నాని

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): స్నేహం పేరుతో మైనర్‌ బాలికను వ్యభిచార కూపంలోకి దింపిన దారున ఘటన ఓ తల్లి ఫిర్యాదుతో బయటపడింది.  ప్రధాన నిందితుడిని కంచరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచరపాలెం సీఐ కృష్ణారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కంచరపాలెం బర్మాక్యాంపు ప్రాంతానికి చెందిన మైనర్‌ బాలికతో స్థానికంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు పరిచయం పెంచుకున్నారు. ఆమె చేత అరుకు వంటి పలు పర్యాటక ప్రాంతాల్లో వ్యభిచారం చేయించారు. నిందితులు ఆ బాలికను వారి సొంత అవసరాలకు వాడుకున్నారు. దీని ద్వారా వచ్చిన సొమ్ము కూడా వారే తీసుకున్నారు. కుమార్తె ప్రవర్తనను గుర్తించిన తల్లి కంచరపాలెం పోలీసులను ఆశ్రయించింది. దీంతో నాని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై అట్రాసిటీ కేసు, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.  ఏసీపీకి ఈ కేసును బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకునేందుకు గాలింపు చేపడుతున్నామని సీఐ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement