
స్నేహానికి మీరిచ్చే స్థానం...?
సెల్ఫ్‌చెక్
స్నేహబంధం ఎంత మధురం... దేవుడే దిగివచ్చి ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు ఒకే నేస్తం చాలంటా!... ఆపదల్లో ఉన్నప్పుడు అయినవాళ్ల దగ్గరకు వెళ్లేకంటే స్నేహితుడి ఇంటికెళ్లటం మంచిదంటారు. ఇలా స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరికీ అన్ని బంధాలూ లేకపోయినా స్నేహబంధం మాత్రం కచ్చితంగా ఉంటుంది. స్నేహం కోసం దేన్నైనా త్యాగం చేసేవారు కొందరైతే, స్నేహం పేరిట వంచించేది కొందరు. నిజమైన స్నేహితుల మధ్య ఎలాంటి ఘర్షణలు వచ్చినా చివరికి ఒకటౌతారు. అదే స్నేహం గొప్పదనం. స్నేహానికి మీరెలాంటి స్థానం ఇస్తున్నారు? స్నేహాన్ని స్నేహంగా చూస్తున్నారా? మిత్రులతో మనస్ఫూర్తిగా మెలుగుతున్నారా? మీతో స్నేహం చేయటానికి అందరూ ఇష్టడుతున్నారా?
1. మీ స్నేహితుల పార్టీ (బర్త్‌డే, అభినందన సభ మొదలైనవి) జరుగుతుంటే ఆ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు.
ఎ. అవును బి. కాదు
2. మీ స్నేహితుల మధ్య ఏదైనా సమస్య వస్తే పెద్ద సీన్ చేస్తారు.
ఎ. కాదు బి. అవును
3. మీ స్నేహితులు మిమ్మల్ని తరచుగా అభినందిస్తుంటారు. సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు మీకందుతుంటాయి.
ఎ. అవును బి. కాదు
4. మీ వస్తువులను మీ ఫ్రెండ్స్ తీసుకుని వాటిని పోగొట్టినప్పుడు మీరు పెద్దగా ఫీలవ్వరు. వేరేవాటిని కొనటానికి సిద్ధపడతారు.
ఎ.అవును బి. కాదు
5. మీరనుకున్న పని మీ స్నేహితులు చేయనప్పుడు, మీరనుకున్న ప్రణాళికను మార్చినప్పుడు వారిపై కోపగించుకుంటారు. మీరు చెప్పిందే జరగాలని పట్టుపడతారు.
ఎ. కాదు బి. అవును
6. మీ స్నేహితులందరూ ఒకేమాట మీద ఉన్నప్పుడు, ఏదైనా కార్యక్రమాన్ని ప్లాన్ చేసినప్పుడు వారితో మీరూ ఏకీభవిస్తారు.
ఎ. అవును బి. కాదు
7. మీ స్నేహితులందరికంటే మీరే గొప్పని వారితో వాదిస్తుంటారు. వారికేమీ తెలియదని అవహేళన చేస్తారు.
ఎ. కాదు బి. అవును
8. మీ స్నేహితులు ప్రమాదాలు లేదా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి వెంట తప్పకుండా ఉంటారు.
ఎ. అవును బి. కాదు
9. మీ అవసరాలప్పుడు స్నేహితులతో బాగా మాట్లాడుతూ అవసరం తీరాక ఇంకోలా ప్రవర్తిస్తారు. మీ అవసరాలు తీర్చడానికే మీ స్నేహితులున్నారనుకుంటారు.
ఎ. కాదు బి. అవును
10. స్నేహితులంతా ఒకచోట చేరినప్పుడు మిమ్మల్ని సరదాగా కామెంట్ చేస్తే నొచ్చుకుంటారు. వారితో చాలారోజుల వరకు మాట్లాడరు.
ఎ. కాదు బి. అవును
‘ఎ’ లు నాలుగు వస్తే మీరు స్నేహం చేయగలరు గాని మీ స్నేహానికి హద్దు ఉంటుంది. దాన్నుంచి బయటకు రాలేరు. ‘ఎ’ లు ఏడు దాటితే మీరు స్నేహాం కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు. నిజమైన స్నేహం ఎలా ఉంటుందో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలన్నంత విలువను స్నేహానికి ఇస్తారు. మీ ఫ్రెండ్స్ వల్ల కొంచెం ఇబ్బంది కలిగినా దాన్ని సీరియస్‌గా తీసుకోరు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే స్నేహానికి మీరిచ్చే స్థానం చాలా చిన్నదిగా ఉంటుంది. అవసరాలప్పుడే మీకు స్నేహితులు గుర్తొస్తారు.