![Monkey Played With Pig In Warangal - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/1/pig-monkey.jpg.webp?itok=SWi4QBwQ)
వరాహం తలపై కూర్చున్న వానరం
కురవి : వరాహం వీపుపై వానరం కూర్చుని సుమారు అరగంటపాటు ఆడుకున్న సంఘటన కురవి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వెనుక భాగంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వరాహం రోడ్డు పక్కన వెళ్తుండగా కోతి(వానరం) ఒక్క ఉదుటున వచ్చి దాని వీపుపై ఎక్కి కూర్చుంది. కొద్దిసేపు అలానే పడుకుని నిద్రపోయింది. వరాహం మేత మేసుకుంటూ వెళ్తూ ఉండగ వానరం వీపుపై అలాగే ఉన్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. వరాహం కోతిని ఏమి అనకపోవడంతో సుమారు అరగంట పాటు వినోదాన్ని పంచింది.
Comments
Please login to add a commentAdd a comment