
‘ఫేస్ టు ఫేస్’కే ప్రాధాన్యత
ఫేస్‌బుక్, వాట్సాప్, మెసెంజర్, ట్విటర్ వంటివి అందుబాటులోకి వచ్చాక ప్రజలంతా సోషల్ మీడియాలోనే మాట్లాడుకుంటున్నారనేది చాలామంది అభిప్రాయం.
వాషింగ్టన్: ఫేస్‌బుక్, వాట్సాప్, మెసెంజర్, ట్విటర్ వంటివి అందుబాటులోకి వచ్చాక ప్రజలంతా సోషల్ మీడియాలోనే మాట్లాడుకుంటున్నారనేది చాలామంది అభిప్రాయం. అయితే ఈ అభిప్రాయం తప్పంటోంది అమెరికాకు చెందిన కాన్సాస్ యూనివర్సిటీ. వార్తావిశేషాలు, శుభాకాంక్షలు చెప్పుకునేందుకు మాత్రమే సోషల్ మీడియాను వినియోగిస్తున్నారని, వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకునేందుకు చాలామంది నేరుగా కలిసి మాట్లాడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని కాన్సస్ ప్రొఫెసర్ జెఫ్రే హాల్ తెలిపారు.
దీనిని ఇప్పటి యువత ఓల్డ్ ఫ్యాషన్‌గా భావిస్తోందని, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడానికే చాలామంది ఇష్టపడుతున్నారని, సోషల్ మీడియా స్నేహం ఎంతోకాలం సాగడం లేదని, ప్రత్యక్షంగా కలుసుకొని మాట్లాడుకున్నవారి స్నేహం ఎక్కువ రోజులు కొనసాగుతోందని చెప్పారు.