![Arunachal Pradesh Little Girl Consoles Emotional Classmate - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/22/ap.jpg.webp?itok=FQsDYwP7)
ఈఇటానగర్: ప్రతి మనిషి జీవితంలో బాల్యం అందమైన జ్ఞాపకంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి మన బుర్రలో స్వార్థం, ద్రోహం, మోసం, పేద, ధనిక తేడాలు వంటి దుర్మార్గపు ఆలోచనలు ఉండవు. మనసు నిర్మలంగా.. కల్లాకపటం లేకుండా ఉంటుంది. అందరితో కలిసి పోతాం.. త్వరగా స్నేహం చేస్తాం. ఆ వయసులో మనలో జాలి, దయ, కరుణ మాత్రమే ఉంటాయి. మన నేస్తం బాధపడితే చూడలేం. ఏదోలా వారిని ఓదారుస్తాం.
ఇక చిన్నారుల్లో స్నేహం ఎంత నిజాయతీగా ఉంటుందో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. హాస్టల్‌కి వెళ్లిన ఓ చిన్నారి అమ్మ గుర్తుకువచ్చి ఏడుస్తాడు. అది చూసి వాడి స్నేహితురాలు ‘ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాంలే’ అంటూ ఓదారుస్తుంది. ఈ చిన్నారుల క్యూట్ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రసుత్తం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈ సంఘటన అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో చోటు చేసుకుంది. వీడియోలో ఓ చిన్న పిల్లాడు తన అమ్మ గుర్తుకు వచ్చి.. ఏడుస్తూ ఉంటాడు. అది గమనించి ఆ పిల్లాడి స్నేహితురాలు దగ్గరకు వెళ్లి ఓదారుస్తుంది. ‘‘అరే ఏడవకురా.. ఊర్కో. అమ్మ గుర్తుకు వస్తుందా.. ఏడవకు.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’’ అంటూ తనకు తోచిన రీతిలో తన స్నేహితుడిని ఓదారుస్తుంది.
(చదవండి: భారత్‌లో అందరికంటే ముందు నిద్రలేచే గ్రామం ఏదో తెలుసా?)
‘‘ప్రేమ అనేది మానవుల సహజ లక్షణం.. అలవాటు చేసుకుంటే అయ్యేది కాదు. ప్రేమ విశ్వవ్యాప్తం.. దానికి ఎంతో శక్తి ఉంది. ప్రేమిస్తూ ఉండండి.. హాస్టల్‌లో ఉన్న ఈ ఇద్దరు చిన్నారులు ఒకరినొకరు ఎలా ఓదార్చుకుంటున్నారో చూడండి’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. ఎంత క్యూట్‌గా ఉన్నారో.. నాకు నా బాల్యం గుర్తుకు వచ్చింది. ఎంత అందమైన బంధమో కదా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.
(చదవండి: మేకింగ్ ఆఫ్ ఎ క్వీన్.. పచ్చళ్ల మహారాణి)
Comments
Please login to add a commentAdd a comment