సామాజిక మాధ్యమాల వినియోగంలో 18 ఏళ్ల లోపు పిల్లలకు సంబంధించి కీలక చట్టం రాబోతోంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) యాక్ట్ డ్రాప్ట్ రూల్స్ ప్రకారం ఇకపై 18 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి ముందు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమ్మతి అవసరమని స్పష్టం చేస్తోంది. భారతదేశం వెలుపల వ్యక్తిగత డేటాను బదిలీ చేయడానికి కంపెనీలకు ప్రభుత్వ అనుమతి అవసరమని కూడా పేర్కొంది.
ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (జనవరి 3న) డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 (DPDP) కోసం డ్రాఫ్ట్ నియమాలను నోటిఫై చేసింది. నిబంధనలపై అభిప్రాయాన్ని/కామెంట్‌లను పంచుకోవడానికి మంత్రిత్వ శాఖ వాటాదారులను కూడా ఆహ్వానించింది. ముఖ్యంగా స్కూల్ పిల్లలను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచడం దేశ ప్రయోజనాలకు మంచిదన్న అభిప్రాయం, సోషల్ మీడియా వినియోగానికి కనీసం 21 ఏళ్లు లేదంటే ఓటు హక్కుకు అమలు చేస్తున్నట్టుగా 18 ఏళ్ల వయోపరిమితి ఉండాలన్న వాదనల మధ్య ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది.
The Ministry of Electronics and Information Technology has published the draft rules for the Digital Personal Data Protection (DPDP) Act for public consultation. Suggestions and objections regarding the draft rules can be submitted through the MyGov portal until February 18,… pic.twitter.com/a5X4uPeFyW
— Bar and Bench (@barandbench) January 3, 2025
పిల్లల డేటా ప్రాసెసింగ్‌పై DPDP రూల్స్ ప్రకారం చైల్డ్ (C) వినియోగదారు సోషల్‌మీడియా ఖాతాను సృష్టించాలనుకుంటే, డేటా ఫిడ్యూషియరీ (DF) తప్పనిసరిగా తల్లిదండ్రుల సమ్మతిని ధృవీకరించాలి.
ఈ సందర్భంలో, తల్లిదండ్రులు (P) తనను తాను గుర్తించి, DFతో ఇప్పటికే అందుబాటులో ఉన్న ధృవీకరించిన గుర్తింపు, వయస్సు వివరాలతో రిజిస్టర్డ్ యూజర్ అని నిర్ధారిస్తారు. పిల్లల డేటాను ప్రాసెస్ చేయడానికి ముందు, డీఎఫ్ తప్పనిసరి. అలాగే తల్లిదండ్రుల గుర్తింపు , వయస్సు రికార్డుల విశ్వసనీయతను కూడా నిర్ధారించాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి 18 వరకు ప్రజాభిప్రాయాల సేకరణకుద్దేశించిన ముసాయిదా నిబంధనల ప్రకారం, ప్రభుత్వం నిర్దేశించిన IDని ధృవీకరించి, డిజిటల్ లాకర్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా అందుబాటులో ఉంచడానికి పిల్లల వయస్సును ధృవీకరించాలి.
వివాదం
DPDP చట్టంలో పిల్లల డేటా ప్రాసెసింగ్‌కు సంబంధించిన నిబంధనలు వివాదాస్పదంగా ఉన్నాయి. పౌర సమాజం, పరిశ్రమ వర్గాలతో పాటు, మెటా, గూగుల్ (Meta, Google) లాంటి బిగ్ టెక్ సంస్థలు కూడా ప్రభుత్వాన్ని పిల్లలు, డేటా వినియోగం నిబంధనలపై మార్పులను కోరుతున్నాయి. ప్రధాంగా ఈ నిబంధనలోని వయస్సును 18 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల కంటే తక్కువకు తగ్గించాలంటున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని మినహాయింపులను కూడా ఇచ్చింది. ఫిబ్రవరి 18 తరువాత, ప్రజలనుంచి వచ్చిన సూచనలు, సలహాల మేరకు మరికొన్ని మినహాయింపులుండవచ్చని భావిస్తున్నారు.
పిల్లల డేటాను ప్రాసెస్‌పై పరిమితులు, మినహాయింపులు
మానసిక ఆరోగ్య సంస్థ లేదా ఆరోగ్య సంరక్షణ నిపుణులు
అనుబంధ ఆరోగ్య సంరక్షణ నిపుణులు
విద్యా సంస్థ
చైల్డ్ డే కేర్ సెంటర్
విద్యా సంస్థ
కాగా 2023 ఆగస్టులో పార్లమెంటులో ఆమోదించిన DPDP బిల్లు ఈ నిబంధనను నిర్దేశించింది. దేశ పౌరుల డిజిటల్ హక్కులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment