ముంబై: భారత కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు క్రికెట్ ఆడటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. చిన్ననాటి నుంచి క్రికెటర్‌గా కోహ్లి ఎదుగుదలను దగ్గర నుంచి పరిశీలిస్తున్నానని కేన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం అగ్రశ్రేణి క్రికెటర్లుగా వెలుగొందుతోన్న వీరిద్దరూ... 2008లో టీమిండియా టైటిల్ నెగ్గిన ఐసీసీ అండర్–19 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. ‘కోహ్లి, నేను ఒకే తరంలో క్రికెట్ ఆడటం మా అదృష్టం. చిన్న వయస్సులోనే మేమిద్దరం కలుసుకున్నాం. అప్పటి నుంచి అతని పురోగతిని, క్రికెటర్‌గా అతని ప్రయాణాన్ని అనుసరిస్తున్నా. సుదీర్ఘ కాలంగా ఆటలో మేం ఒకరితో ఒకరం తలపడుతున్నాం. కానీ గత కొన్నేళ్లుగా ఆటపై మా అభిప్రాయాలను, ఆలోచనలను నిజాయితీగా ఒకరితోఒకరం పంచుకుంటున్నాం. మా ఇద్దరి ఆటతీరు వేరైనప్పటికీ... కొన్ని అంశాల్లో మా ఆలోచనా తీరు ఒకేలా ఉంటుంది’ అని విలియమ్సన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment