దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. వాళ్ళతో విరోధం కూడా కూడదు. వారిని పట్టించుకోకుండా ఉండడమే మేలు. నిప్పును పట్టుకుంటే కాలుతుంది. చల్లారిన తర్వాత పట్టుకున్నా మసి అవుతుంది. కనుక దాని జోలికి పోకపోవడమే మేలు.
విలువలేని దుమ్ము కూడా ఒక్కోసారి నీ కంట్లో పడి విలవిలలాడేలా చేస్తుంది. విలువ లేని కొందరు మనుషులు కూడా చాలాసార్లు తమ మాటలతో బాధపెడతారు. ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తముల లక్షణం.
నమ్మకం అనేది గాజు పాత్ర లాంటిది. గాజు పాత్ర ఒక్కసారి చేతి నుండి కింద పడితే దాన్ని అతికించడం ఎలా అసాధ్యమో, ఒకసారి మనం ఒక వ్యక్తి దగ్గర నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ తిరిగి ఆ నమ్మకాన్ని సంపాదించడం అలా అసాధ్యం... అసంభవం. కాబట్టి కలుషితమైన ఈ రోజుల్లో కల్మషం లేకుండా నిన్ను ఎవరైనా నమ్మితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం నీ ప్రాణాన్ని అయినా పణంగా పెట్టు తప్పులేదు కానీ నమ్మకాన్ని కోల్పోకు...
Comments
Please login to add a commentAdd a comment