స్నేహానికి గౌరవాన్నిచ్చే నన్భేండా | Honorary friendship nanbenda movie | Sakshi
Sakshi News home page

స్నేహానికి గౌరవాన్నిచ్చే నన్భేండా

Published Sat, Jan 31 2015 4:35 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

స్నేహానికి గౌరవాన్నిచ్చే నన్భేండా

స్నేహానికి గౌరవాన్నిచ్చే నన్భేండా

సృష్టిలో తీయనిది స్నేహం అంటారు. మరి ప్రేమా? ఈ రెండింటినీ చర్చించే చిత్రమే నన్భేండా. నటుడు ఉదయనిధి స్టాలిన్ నాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇంతకుముందు ఇదు కదిర్‌వేలన్ కాదల్ చిత్రం ఉదయనిధితో రొమాన్స్ చేసిన నయనతార ఈ చిత్రంలోనూ ఆయనతో జత కట్టారు. ఎం.రాజేష్ శిష్యుడు ఏ.రాజేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడితో చిన్న భేటీ...
 
ప్ర: నన్భేండా చిత్ర కథేంటి?
జ: జీవితంలో స్నేహం మాత్రం చాలా ముఖ్యమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్నేహం గౌరవాన్ని పెంచే చిత్రమే నన్భేండా. ఇదిచక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ప్రేమ ముఖ్యమా? స్నేహం ముఖ్యమా? అన్న విషయం గురించి ఎలాంటి చర్చ అవసరం లేదు. రెండింటిలోనూ రెండు ఉంటాయి. రెండూ ముఖ్యమే అని చెప్పే చిత్రం నన్భేండా.
 
ప్ర: ఉదయనిధి స్టాలిన్, నయనతారల నటన గురించి?
జ: ఇదు కదిర్ వేలన్ కాదల్ చిత్రం తరువాత ఉదయనిధి స్టాలిన్, నయనతారలు మరోసారి కలసి నటిస్తున్న చిత్రం నన్భేండా. ఇందులో వీరి మధ్య కెమిస్ట్రీ ఎంతగా వర్కౌట్ అయ్యిందంటే చిత్రం చూస్తే మీకే అర్థమవుతుంది. చిత్రం ఆద్యంతం నటనలో విజృంభించారు. షాయాజి షిండే, శ్రీరంజనిల కొడుకుగా జీవితం గురించి ఎలాంటి చింతా పడని పాత్రలో ఉదయనిధి స్టాలిన్ నటించారు. ఆయన మాత్రమే నప్పే పాత్ర అది. ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించగల బుద్ధి శాలి. ఇక నయనతార పూర్తి నిడివిగల పాత్రలో నటించారు. ఒక బ్యాంకులో పనిచేసే యువతి పాత్ర. ఆమె తల్లిదండ్రులు చిత్రంలో చూపించకపోయినా ఫొటోల్లో కనిపిస్తుంటారు. వారెవరన్నది సస్పెన్స్.
 
ప్ర: మరి సంతానం మాటేమిటి?
జ:
ఉదయనిధి స్టాలిన్ పాత్రకు పూర్తి విరుద్దమైన పాత్రలో సంతానాన్ని చూస్తారు. వినోదాన్ని పండించడంలో విరగదీశారు. ఏ విషయాన్నైనా శాస్త్రవేత్త మాదిరి పూర్తిగా పరిశోధించి పరిష్కరించే వ్యక్తిత్వం. తను సీరియస్‌గా చేసే విషయాలన్నీ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తాయి.
 
ప్ర: చిత్రంలో నటి తమన్న కూడా ఉన్నారట?
జ:
అది సస్పెన్స్ పాత్ర. అయితే చాలా ముఖ్యమైన పా త్ర. తమన్నతో పాటు షెరిన్, శుసన్‌తదితరులుముఖ్యపాత్రలు పోషించారు. షెరిన్ ప్రతినాయకి పాత్ర లో నటించారు. కొంచెం గ్యాప్ తరువాత వస్తున్న ఆమెకీ పాత్ర పేరు తెచ్చిపెడుతుంది. కరుణాకరన్, నాన్ కడవుల్ రాజేంద్రన్, మొదలగు వారు వారి పాత్రలకు న్యాయం చేశారు.
 
ప్ర: హరీష్‌జయకుమార్ సంగీతం గురించి?
జ:
ప్రేమ కథా చిత్రాలకు పెట్టింది పేరు హరీష్‌జయరాజ్. ఈ చిత్రం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చాలామంది సం గీతాన్ని అందించారు. చిత్రంలో ఆరు పాటలు ఉన్నాయి. అన్ని పాటలు విజువల్‌గాను కనువిందు చేస్తాయి.
 
ప్ర: చిత్రంలో పంచ్ డైలాగ్స్ ఉంటాయట?
జ:
ఉదయనిధిస్టాలిన్, సంతానం నటిస్తున్నారంటే ఆ చిత్రం గురించి అభిమానులు చాలా ఊహించుకుంటారు. అందువలన చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక్కో పంచ్ డైలాగ్స్ పేలేలా రూపొందించాం. చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తున్నాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement