నయన క్రేజ్ తగ్గలేదు | Idhu Kathirvelan Kadhal on Valentine's day! | Sakshi
Sakshi News home page

నయన క్రేజ్ తగ్గలేదు

Published Mon, Feb 3 2014 5:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM

నయన క్రేజ్ తగ్గలేదు

నయన క్రేజ్ తగ్గలేదు

 నయనతార క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిజం చెప్పాలంటే మరింత పెరిగిందని అంటున్నారు యువ దర్శకుడు ఎస్ ఆర్ ప్రభాకరన్. సుందర పాండియన్ చిత్రం ద్వారా మెగా ఫోన్ పట్టిన ఈయన తదుపరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదు కదిర్ వేలన్ కాదల్. ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. ఇది ఈ నెల 14న విడుదల కానుంది. దర్శకుడితో మినీ ఇంటర్వ్యూ.    
 
  ఇదు కదిర్ వేలన్ కాదల్ చిత్ర అవకాశం గురించి?
  నా తొలి చిత్రం సుందర పాండియన్ సక్సెస్‌తో చాలా సంస్థలు చిత్రం చేయమని అడిగారుు. అదే విధంగా రెడ్ జెయింట్ సంస్థ నుంచి పిలుపొచ్చింది. మా సంస్థకు ఒక చిత్రం చేయమని ఉదయనిధి స్టాలిన్ అడిగారు. సరేనని రెండు లైన్ల కథ చెప్పాను. బాగుంది. కథను డెవలప్ చేయండి నేనే హీరోగా నటిస్తాను అన్నారు. దీంతో ఆయన్ని మైండ్‌లో ఉంచుకుని కథను సిద్ధం చేశాను. ఉదయనిధి స్టాలిన్ సూపర్‌గా ఉందన్నారు . అలా మొదలైన చిత్రమే ఇదు కదిర్ వేలన్ కాదల్.
 
  ఇది కదిరవేలన్ అనే యువకుడి లవ్ స్టోరీయూ?
  అవును. సుందర పాండియన్ చిత్రంలో స్నేహం గురించి చెప్పాను. ఈ చిత్రంలో ప్రేమ గురించి చెప్పాను. ప్రేమ అనేది ఒక యువకుడు తాను మనసుపడ్డ యువతిపై చూపించడం మాత్రమే కాదు. తల్లిదండ్రులు, సోదరులు, బాబాయి, పిన్ని, మామ, అత్తలపైన చూపేది కూడా ప్రేమే. ఇది ఈ చిత్రంలో చెప్పాను.  హీరో తన కుటుంబంపై చూపే ప్రేమే చిత్రం.
 
  ఇది మదురై నేపథ్యంలో జరిగే కథేనా?
  అలాంటిదే అయి నా మదురై యాస మాత్రం ఉండదు. అక్కడి కుర్రాడి కుటుంబ బంధాలు తద్వారా ఏర్పడే ప్రేమ, చిక్కులు, వాటి నుంచి  ఎలా బయటపడ్డాడు వంటి అంశాల సమాహారమే ఇదు కదిర్ వేలన్ కాదల్.
 
  ఒరు కల్ ఒరు కన్నాడి చిత్రంలో ఉన్నవారే ఇందులోనూ ఉన్నారు?
  ఆ చిత్రం ఛాయలు ఈ చిత్రంపై పడుతాయనే కదా! మీ సందేహం. ఒక్క షాట్ కూడా ఆ చిత్రాన్ని గుర్తుకు తీసుకురాదు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కథతో కలిసి కామెడీ ఉండటంతో ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది.
 
  నటుడు ఉదయనిధి స్టాలిన్‌కు మీకు ఇది రెండవ చిత్రం. ఎలా ఫీలవుతున్నారు?
  ఫీలింగ్ అంటే ప్రతి చిత్రం ఒక అనుభవమే. తొలి చిత్రంలోని చిన్న చిన్న లోపాలను తదుపరి చిత్రంలో సరిదిద్దుకోవాలని నా లాంటి యువ కళాకారులు భావిస్తారు. అలాగే ఒరు కల్ ఒరు కన్నాడి చిత్రంలో ఉదయనిధి స్టాలిన్ పాటల్లో యదార్థంగా ఆడినా చిన్న చిన్న విమర్శలు వచ్చాయి. వాటిని అధిగమించడానికి ఈ చిత్రంలో ప్రత్యేక దృష్టి సారించి రిహార్షిల్స్ చేసి మరీ నటించారు. ఆ మార్పు ఈ చిత్రంలో పక్కాగా కనిపిస్తోంది. నా సైడ్‌లో కూడా ఆ ప్రయత్నం కనిపిస్తుంది.
 
  నయనతార - ఉదయనిధి స్టాలిన్‌ల జోడి గురించి?
  నయనతార చాలా సీనియర్ నటి. రీ ఎంట్రీ అయినా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఉదయనిధి స్టాలిన్, నయనతారలతో ఫొటో షూట్ చేస్తున్నప్పుడు ఆమె మెచ్యూర్‌గా అనిపిస్తుందేమోనన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేశారు. అయితే వీరి కాంబినేషన్ తొలి స్టిల్ బయటకు రాగానే జంట సూపర్‌గా ఉందని అన్నారు. విజువల్‌లో వారు చూడముచ్చటగా ఉంటారు. ప్రేమికులంటే ఇలా ఉండాలని చిత్రం చూసిన తరువాత అందరూ అంటారు. సాధారణంగా పది చిత్రాలు విడుదలైతే వాటిలో రెండు మూడు చిత్రాలలోనే హీరోయిన్లకు ప్రాముఖ్యత ఉంటుంది. అలా ఈ చిత్రంలో పవిత్ర అనే ప్రాముఖ్యత వున్న పాత్రలో నయనతార నటించారు. చిత్ర కథే ఆమె చుట్టూ తిరుగుతుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement