వైరల్‌ : ఇదేం వింత స్నేహం?! | Cat And Snake Friendship Viral News | Sakshi
Sakshi News home page

వైరలైన పాము-పిల్లి వింత స్నేహం

Published Sat, May 2 2020 8:59 PM | Last Updated on Sat, May 2 2020 9:07 PM

Cat And Snake Friendship Viral News - Sakshi

పాముతో ఆడుకుంటున్న పిల్లి

రెండు భిన్న జాతులకు చెందిన జంతువులు స్నేహంగా ఉండటం మనం చూసే ఉంటాం. పిల్లి-కుక్క, పిల్లి-ఎలుక, కుక్క-పులి, కోతి-కుక్క, కుక్క-గుర్రం ఇలా పొంతన కుదరదు అనుకునే జంతువులు స్నేహంతో ఒ‍క్కటై మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ వింత స్నేహానికి సంబంధించి వార్త ఒకటి ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది. పాము- పిల్లి ఈ రెండు జంతువుల మధ్య స్నేహం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. డిచ్‌ పోనీ అనే మహిళకు చెందిన రికీ పేరుగల నల్ల పిల్లి, గత కొద్దిరోజులుగా ఓ నల్ల పాముతో స్నేహంగా ఉంటోంది. ఇది గమనించిన పోనీ వాటి ఫొటోలను తీసింది.

పాముతో ఆడుకుంటున్న పిల్లి

తన ట్విటర్‌ ఖాతాలో ఉంచి ‘‘ నా పిల్లి ఎల్లప్పుడూ ఆ పాముతో ఉంటోంది. దానికి ఎలాంటి హానీ చేయటం లేదు. ఇద్దరూ కలిసి ఎండలో సన్‌బాత్‌ చేయటం లేదు కదా?’’ అంటూ ఫన్నీగా స్పందించింది. ఈ వింత స్నేహం​ దాదాపు లక్ష రీట్వీట్లతో.. 60వేల లైకులతో దూసుకుపోతోంది. కొందరు నెటిజన్లు ‘‘ అలాంటి స్నేహం నాకూ కావాలి... స్నేహితుడితో సన్‌ బాతింగ్‌... ఇదేం వింత స్నేహం?!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి : లాక్‌డౌన్‌ తొలగిస్తే ఇలాగే పరిగెడతారేమో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement