
ఖాన్ దాదాలు కలిసిపోయారు!!
తనకు, సల్మాన్ఖాన్కు మధ్య స్నేహం, ప్రేమ మెండుగా ఉన్నాయని సూపర్ స్టార్ షారుక్ ఖాన్ అన్నాడు.
తనకు, సల్మాన్ఖాన్కు మధ్య స్నేహం, ప్రేమ మెండుగా ఉన్నాయని సూపర్ స్టార్ షారుక్ ఖాన్ అన్నాడు. మంచి పెయింటర్ కూడా అయిన సల్మాన్ ఖాన్ ఎప్పుడైనా మీకు ఏదైనా స్కెచ్ బహుమతిగా ఇచ్చాడా అని అడిగితే, ఇవన్నీ బాగా పాతప్రశ్నలు అయిపోయాయని షారుక్ అన్నాడు. వాటితో తనకు బోర్ కొట్టేసిందని, ఏమైనా కొత్తవి ఉంటే అడగాలని కోరాడు. ఇప్పుడు తామిద్దరం కలిశామని, పరస్పరం కౌగలించుకున్నామని చెప్పాడు. తామిద్దరి మధ్య స్నేహం, ప్రేమ.. అన్నీ ఉన్నాయని స్పష్టం చేశాడు.
బాలీవుడ్లో ఖాన్ దాదాలు ఇద్దరి మధ్య శత్రుత్వం, మళ్లీ వాళ్లు కలిసిపోవడం లాంటివి చాలాకాలంగా జరుగుతూనే ఉన్నాయి. 2008లో కత్రినా కైఫ్ పుట్టినరోజు పార్టీలో గొడవ జరిగేవరకు సల్మాన్, షారుక్ మధ్య సంబంధాలు బాగానే ఉండేవి. ఆ తర్వాతి నుంచి చాలాకాలం పాటు ఇద్దరూ ఒకరిని ఒకరు కలవడం మానేశారు. అయితే.. గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా కాంగ్రెస్ నాయకుడు బాబా సిద్దిఖీ ఇఫ్తార్ విందులో మాత్రం ఇద్దరూ కౌగలించుకున్నారు.