సీక్రెట్ ఫార్ములా ఏమీలేదు
సీక్రెట్ ఫార్ములా ఏమీలేదు
Published Sat, Dec 14 2013 10:39 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
సుదీర్ఘకాలంపాటు కొనసాగడంతోపాటు విజయపథంలో దూసుకుపోవడంలో సీక్రెట్ ఫార్ములా ఏదీ లేదని సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ఖాన్‌లతోపాటు బాలీవుడ్‌ను ఏలుతున్న ఆమిర్‌ఖాన్ చెప్పాడు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడాడు. బాలీవుడ్‌లో సల్మానే నంబర్ వన్ అని, తనకంటే అతనికే ఎక్కువ ప్రజాదరణ ఉందని ర్యాంకింగ్‌తోపాటు ప్రజాదరణ విషయంలో మిగిలిన ఇద్దరు ఖాన్‌లతో పోల్చుకునే ఆమిర్ చెప్పాడు. దేశంలోని ప్రేక్షకులంతా స్టార్ అనే పదానికే ఎక్కువ విలువ ఇస్తారని 1988లో విడుదలైన ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగిన ఆమిర్ తెలిపాడు. అయితే పరిశ్రమ కూడా అదేవిధంగా ఉందని తాననుకోవడం లేదన్నాడు.
అమితాబ్ బచ్చన్, దిలీప్‌కుమార్, వహీదా రహమాన్, షమ్మీ కపూర్‌లకు తాను అతి పెద్ద ఫ్యాన్‌నని చెప్పాడు. అందరికీ వినోదం పంచేవ్యక్తి సమాజంలో పెద్ద పాత్ర పోషించాల్సి ఉంటుందని భావిస్తున్నానన్నాడు. షారుఖ్‌ఖాన్ మంచి నటుడంటూ ఆమిర్ ప్రశంసించాడు. షారుఖ్‌ను తెరపై చూసేందుకు తాను కూడా ఇష్టపడతానన్నాడు. తెరపై అతను కనిపిస్తే అందరి ముఖాల్లో చిరునవ్వు దోబూచులాడడం తథ్యమన్నాడు. ‘షారుఖ్ నటించిన దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై తదితర సినిమాలంటే నాకు కూడా ఎంతో ఇష్టం. చక్ దే సినిమాలో అతని పనితనంపై నాకు ఎన్నో మంచి విషయాలు తెలిశాయి. అయితే ఆ సినిమాని నేను ఇంకా చూడలేదు. నేను చూడాల్సిన సినిమాల్లో అదొకటి. షారుఖ్ నటించిన అనేక సినిమాలు నాకు న చ్చాయి’ అని అన్నాడు. కాగా సల్మాన్, ఆమిర్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వారిరువురూ తరచూ ఒకరినొకరు పొగుడుకుంటుంటారు.
Advertisement
Advertisement