పని ప్రదేశాల్లో ముఖ్యంగా ఉద్యోగాలు చేసే చోట మహిళలు ఒకరికొకరు నిజాయితీతో మనస్ఫూర్తిగా స్నేహితులుగా ఉండగలరా..? సాటి స్త్రీల పట్ల అసూయ, శత్రుత్వాలను అధిగమించి విజయాలను చేరుకోగలరా..? స్త్రీ స్నేహాలు నిస్సారంగా, సత్యానికి దూరంగా ఉంటాయా..? ఈ ప్రశ్నలతో పాటు సమాధానాలనూ హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ప్రచురించారు. ఈ రివ్యూలో ప్రచురించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధన దీనికి కొన్ని రుజువులను చూపింది.
రుజువులు ఇవి..
►మహిళలు స్నేహితులుగా, సన్నిహిత ఆరోగ్యకరమైన బంధాలను పంచుకోవడమే కాదు వారి స్నేహితుల విజయాలకు కూడా కీలకపాత్ర పోషిస్తారు.
►బలమైన స్నేహాలు మహిళల వృత్తిని సానుకూలంగా ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
►విజయాలను సాధించిన మహిళా స్నేహితులను కలిగి ఉంటే వారి నుంచి మంచి కెరీర్ సలహాలను పొందవచ్చు. సమస్యను వారు అర్ధం చేసుకుని, తగిన సహాయాన్ని అందించగలరని నిర్ధారించుకోవచ్చు.
సూచనలివి..
►మీ స్నేహితులతో మీరే అధికంగా మాట్లాడుతూ ఉండటం కన్నా వినడం వల్ల ఎక్కువ విషయాలు తెలుస్తాయి.
►నైపుణ్యాలను పెంచే సలహాలు ఇవ్వగల వ్యక్తిని కలిగి ఉండటమే కాదు.. ఆమె అడుగుజాడలను అనుసరించాలని భావించే స్నేహితులకు ఒక మద్ధతును లభిస్తుంది.
►ఇటీవల కాలంలో ఉద్యోగ నియామకాల విషయానికి వస్తే పురుషులు కూడా లింగభేదాల పట్ల పట్టింపు లేదనే విషయాన్ని వెల్లడించినట్లు ఆ రివ్యూ స్పష్టం చేసింది. దీనికి కారణం ‘పురుషల ఆధిపత్య వృత్తులను స్త్రీలు సమర్ధవంతంగా నిర్వహిస్తుండమే.
అధిగమించేందుకు నైపుణ్యాలు
►స్నేహితులతో ఉన్నప్పుడు మీ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు చర్చించడానికి వెనకడుగు వేయద్దు. పని చేసే చోట మీ అనుభవాలు, పోరాటాలు, సందేహాలను తీర్చడానికి అవి ఉపయోగపడతాయి. అంతేకాదు, మీరు కూడా సలహాలను కోరడానికి సిగ్గుపడకూడదు.
►రెజ్యూమ్‌ను తయారుచేయడానికి లేదా ఇంటర్వూ్యలో నెగ్గడానికి చిట్కాలు, పనిలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించే నైపుణ్యాలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాయి.
►పని చేసేచోట పురుషులతో పాటు మహిళలను సమానంగా పరిగణించినట్లయితే ఈ సహాయక వ్యవస్థ అవసరం లేదు. కిందటేడాది బుకింగ్.కామ్ నిర్వహించిన అధ్యయనంలో పాల్గొన్న 42 శాతం మంది మహిళలు కార్యాలయంలో పక్షపాతాన్ని ఎదుర్కొన్నామని చెప్పారు. సీనియర్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న 52 శాతం మహిళలు, ఎగ్టిక్యూటివ్ బోర్డు సభ్యులుగా పనిచేస్తున్న 57 శాతం మహిళలు కార్యాలయంలో లింగ పక్షపాతాన్ని ఇప్పటికీ ఎదుర్కొంటున్న అంగీకరించారు. అయితే, ఈ పక్షపాతం మహిళ వృత్తిలో ఎదగడానికి నిచ్చెనలా సాయపడుతుంది అని వారు తెలియజేయడం విశేషం.
పని చేసే చోట సమాజంలో లింగ విభజనను సృష్టించే వైఖరి క్రమంగా తగ్గుతోంది. పూర్తిగా కనుమరుగయ్యేవరకు మహిళలు ఒకరికొకరు వ్యక్తిగత, వృత్తిపరమైనా సహాయాన్ని అందించుకోవడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment