
చెన్నై : సినీ కళాకారులు, క్రీడాకారులు కాలేరేమో గానీ, క్రీడాకారులు సినీ కళాకారులగా మారడం సులభమే అవుతోంది. ఇప్పటికే పరుగుల రాణి అశ్వినీ నాచప్ప నటిగా నటించింది. ఇక కొందరు క్రికెట్ క్రీడాకారులు హీరోలుగా నటించారు. తాజాగా ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు, బౌలర్ అయిన హర్భజన్ సింగ్ కథానాయకుడిగా అవతారమెత్తనున్నారు. ఈయన సినిమాకు పరిచయం అవుతున్న చిత్రం ఇదే అవుతుంది. క్రీడా మైదానంలో పోటీ జట్టు బ్యాట్స్‌మెన్లను తన బంతులతో దడ పుట్టించిన హర్బజన్‌సింగ్ ఇప్పుడు వెండితెరపై నటుడిగా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తారో చూడాలి. షండో స్టూడియో అండ్ సినిమాస్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో హర్భజన్‌సింగ్ హీరోగా నటిస్తున్నారు. దీనికి జేపీఆర్ - శ్యామ్ సూర్యల ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ దర్శక ద్వయం ఇంతకు ముందు అగ్నిదేవి అనే చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. కాగా హర్భజన్‌సింగ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ఫ్రెండ్‌షిప్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను హర్భజన్‌సింగ్ ఆదివారం విడుదల చేశారు. కాగా ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర వర్గాలు తెలిపారు. కాగా సంకెళ్లు వేయబడ్డ రెండు చేతులు మాత్రమే కలిగిన ఫస్ట్‌లుక్ పోస్టర్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదేదో ఖైదీలకు సంబంధించిన కథాంశంతో కూడిన చిత్రమా అన్న ఆసక్తి నెలకొంది. కాగా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా భారతీయ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. కాగా ఇదే సమయంలో భారత క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఇతివృత్తంతో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్, కోలీవుడ్ నటుడు జీవా నటించిన 83 చిత్రం తెరపైకి రానుందన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment