పాము కాటుతో పదో తరగతి విద్యార్థిని మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్‌లో గురువారం చోటుచేసుకుంది.
పాము కాటుతో పదో తరగతి విద్యార్థిని మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్‌లో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన స్నేహ(15) బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కుట్టినా.. గమనించకుండా అలాగే పడుకుంది. ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించేలోపే మృతిచెందింది.