ఆ సంబంధాన్ని ప్రసారం చేయడంపై ఆగ్రహం
జాతి వైరాన్నిమరచిపోవడమే కాదు... రెండు మగ జంతువుల మధ్య ఊహించని రీతిలో ఏర్పడ్డ సంబంధాన్ని రష్యన్ మాస్ మీడియా ప్రసారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఓ పక్క జంతు ప్రేమికులు మీడియా ప్రసారాలకు మద్దతు పలుకుతుంటే... మరోవైపు రష్యాలోని గే ప్రాపగాండను ఉల్లఘించడమేనంటూ నిరసన వెల్లువెత్తుతోంది. ఇటువంటి ప్రసారాలు సాంప్రదాయ విలువలకు నష్టాన్ని తెస్తాయని, జంతువుల మధ్య స్వలింగ సంపర్క సంబంధాలు పిల్లలకు హాని కలుగ జేస్తాయని న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
రష్యా ప్రమోర్సి ప్రాంతానికి చెందిన న్యాయవాదులు అముర్ అనే మగపులి, మగ మేక తిముర్ మధ్య సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఫార్ ఈస్ట్ సఫారి పార్క్లో రెండు వేర్వేరు జాతులకు చెందిన అముర్, తిముర్ల మధ్య లైంగిక సంబంధంపై కవరేజ్కు వ్యతిరేకంగా విచారణ జరపాలని నోవోసిబ్రిస్క్కు చెందిన లాయర్ అలెక్సి క్రిష్టియానావ్ ప్రాసిక్యూటర్లను కోరారు. సఫారీ పార్క్ లోని రెండు మగ జంతువుల మధ్య లైంగిక సహజీవనాన్ని ఇటీవల రష్యన్ మాస్ మీడియా ప్రసారం చేయడంపై ఆయన ఫేస్ బుక్లో విమర్శించారు.
ఇది జంతువులపై ప్రతికూల ప్రచారమే అయినప్పటికీ ఈ ప్రభావం రష్యా ప్రజలపై పడటమే కాక, రష్యా గే-ప్రాపగాండను ఉల్లంఘించినట్లవుతుందని క్రిస్టియానావ్ వాదిస్తున్నారు. అంతేకాక హోమో సెక్సువాలిటీని ప్రోత్సహించినట్లు అవుతుందంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం పిల్లలపై త్వరగా పడే అవకాశం ఉందని, వారు సంప్రదాయ విలువలకు వ్యతిరేకంగా లైంగిక సంబంధాలను పెంచుకునే ప్రమాదం ఉంటుందని క్రిస్టినావ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటువంటి ప్రాపగాండపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, పిల్లలకు రక్షణ కల్పించాలని కోరారు. తన ఫాలోయర్స్ తో కలిపి క్రిస్టినావ్ ప్రాసిక్యూటర్ జనరల్కు బహిరంగ లేఖ రాశారు. ఈ ఫిర్యాదుపై ప్రాసిక్యూటర్లు దర్యాప్తు జరుపుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే జూ అధికారులు ఆ రెండు జంతువులు ఒకదానిపై ఒకటి ప్రేమ పెంచుకోవడం మొదలు పెట్టిన తర్వాత... విడివిడిగా ఎన్క్లోజర్స్ లో ఉంచుతున్నారు.