పులికి ఆహారంగా మేకను వేస్తే ఏం చేస్తుంది. చంపి తినేస్తుంది కదా. ఇది మన అందరికి తెలిసిందే. కానీ దీనికి భిన్నంగా తనకు ఆహారంగా వచ్చిన మేకతో స్నేహం చేసిన ఘటన విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి ఎక్స్‌లో సందడి చేస్తోంది.
రష్యాలోని ప్రిమోర్స్కీ సఫారీ పార్క్‌లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ క్రూర జంతువులకు వారానికి రెండుసార్లు ప్రాణాలతో ఉన్న జంతువులను ఆహారాన్ని ఇస్తారు. ఇందులో భాగంగానే సైబీరియన్ పులి అమూర్‌కు, తైమూర్ అనే మేకను రాత్రి భోజనంగా అందించారు. కానీ విచిత్రంగా ఇవి రెండూ స్నేహితులుగా మారిపోయాయి.
గతంలో ఇలా చాలాసార్లు పంపించిన మేకలను పులి చంపి తినేసింది ఈ సారి మాత్రం అలా చేయలేదు. తైమూర్, అముర్ విరోధులు కాస్త ఫాస్ట్ స్నేహితులుగా మారిపోవడం మాత్రమే కాదు. కలిసి దోబూచు లాడుకోవడం, కలిసి తినడం, ఆడుకోవడం, మంచులో ఒకర్నొకరు వెంబడించుకోవడం , సరదాగా తలలతో కొట్టుకోవడం లాంటివి చేస్తున్నాయని ఎన్‌క్లోజర్ కెమెరాల ఆధారంగా పార్క్ అధికారులు ప్రకటించారు.
2015లో తైమూర్ , అముర్ విచిత్ర స్నేహం వెలుగు చూడగా ఇపుడు మళ్లీ ఎక్స్‌లో వైరల్ అవుతోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ ఖాతా ఈ ఫోటోను షేర్ చేయడంతో 11 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది.
Tiger refuses to eat goat who was given to him as live food, instead, they became friends. pic.twitter.com/u6PlxdaKXW
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 21, 2024
ఈ స్నేహం ఎలా జరిగింది?
మేకను ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేసినప్పుడు అది ఎటువంటి భయాన్ని చూపలేదు. బెదిరిపోలేదు. అది మృత్యు వేటగా భావించలేదు. అలా వ్యవహరించ లేదు. అసలు పులులకు భయపడాలని మేకకు ఎవరూ నేర్పించలేదు అంటూ జూ చీఫ్ డిమిత్రి మెజెంట్సేవ్ వ్యాఖ్యానించారు. అందుకే ఇవి స్నేహితులుగా మారాయని, ఇది మిరాకిల్ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment