Siberian
-
తైమూర్-అముర్ విచిత్ర స్నేహం : ఈ మిరాకిల్ స్టోరీ వైరల్
పులికి ఆహారంగా మేకను వేస్తే ఏం చేస్తుంది. చంపి తినేస్తుంది కదా. ఇది మన అందరికి తెలిసిందే. కానీ దీనికి భిన్నంగా తనకు ఆహారంగా వచ్చిన మేకతో స్నేహం చేసిన ఘటన విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి ఎక్స్‌లో సందడి చేస్తోంది.రష్యాలోని ప్రిమోర్స్కీ సఫారీ పార్క్‌లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ క్రూర జంతువులకు వారానికి రెండుసార్లు ప్రాణాలతో ఉన్న జంతువులను ఆహారాన్ని ఇస్తారు. ఇందులో భాగంగానే సైబీరియన్ పులి అమూర్కు, తైమూర్ అనే మేకను రాత్రి భోజనంగా అందించారు. కానీ విచిత్రంగా ఇవి రెండూ స్నేహితులుగా మారిపోయాయి.గతంలో ఇలా చాలాసార్లు పంపించిన మేకలను పులి చంపి తినేసింది ఈ సారి మాత్రం అలా చేయలేదు. తైమూర్, అముర్ విరోధులు కాస్త ఫాస్ట్ స్నేహితులుగా మారిపోవడం మాత్రమే కాదు. కలిసి దోబూచు లాడుకోవడం, కలిసి తినడం, ఆడుకోవడం, మంచులో ఒకర్నొకరు వెంబడించుకోవడం , సరదాగా తలలతో కొట్టుకోవడం లాంటివి చేస్తున్నాయని ఎన్‌క్లోజర్ కెమెరాల ఆధారంగా పార్క్ అధికారులు ప్రకటించారు.2015లో తైమూర్ , అముర్ విచిత్ర స్నేహం వెలుగు చూడగా ఇపుడు మళ్లీ ఎక్స్‌లో వైరల్ అవుతోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ ఖాతా ఈ ఫోటోను షేర్ చేయడంతో 11 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది.Tiger refuses to eat goat who was given to him as live food, instead, they became friends. pic.twitter.com/u6PlxdaKXW— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 21, 2024 ఈ స్నేహం ఎలా జరిగింది?మేకను ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేసినప్పుడు అది ఎటువంటి భయాన్ని చూపలేదు. బెదిరిపోలేదు. అది మృత్యు వేటగా భావించలేదు. అలా వ్యవహరించ లేదు. అసలు పులులకు భయపడాలని మేకకు ఎవరూ నేర్పించలేదు అంటూ జూ చీఫ్ డిమిత్రి మెజెంట్సేవ్ వ్యాఖ్యానించారు. అందుకే ఇవి స్నేహితులుగా మారాయని, ఇది మిరాకిల్ అని పేర్కొన్నారు. -
మళ్లీ తెరపైకి జాంబీ వైరస్!.. పెను విపత్తుకు దారి తీయొచ్చా?
మాస్కో: ప్రమాదకరమైన జాంబీ వైరస్. రష్యాలో అతి శీతల ప్రాంతమైన సైబీరియాలోని ఓ సరస్సులో 48,500 ఏళ్లుగా మంచు పలకల నడుమ గడ్డకట్టిన స్థితిలో నిద్రాణంగా పడి ఉంది. దాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఒకరి నుంచి ఇంకొకరికి సోకే లక్షణమున్న ఈ వైరస్ కరోనాను మించిన పెను ఆరోగ్య విపత్తుకు దారి తీయొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఇలాంటి దాదాపు రెండు డజన్ల పురాతన వైరస్‌లను శాస్త్రవేత్తలు ఇటీవలి కాలంలో గుర్తించారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు నిత్యం సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలుండే ప్రాంతాల్లో కూడా మంచు పలకలు వేగంగా కరిగిపోతుండటం తెలిసిందే. దాంతో ఇంతకాలంగా వాటి కింద నిద్రాణంగా ఉన్న ఇలాంటి ప్రమాదకర వైరస్‌లెన్నో ఒళ్లు విరుచుకుని మానవాళిపైకి వచ్చి పడతాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ శాస్త్రవేత్తల బృందమే 2013లో ఇలాగే 30 వేల ఏళ్ల నాటి వైరస్‌లను వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమిస్తూ పండోరా వైరస్ ఎడొమాగా పేర్కొనే జాంబీ వైరస్‌ను కనిపెట్టిందని బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. -
రష్యా బొగ్గు గనిలో ప్రమాదం.. 52 మంది మృతి
మాస్కో: రష్యాలోని సైబీరియాలో బొగ్గు గనిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు రక్షకులతో సహా ఇప్పటి వరకు 52 మంది ప్రాణాలు కోల్పోయారు. వాయవ్య సైబీరియాలోని కెమెరొరో ప్రాంతంలోని లిట్స్వ్యనయ బొగ్గు గని బయట ఉన్న బొగ్గు పొడిలో ముందుగా మంటలు చెలరేగాయి. వెంటిలేషన్ వ్యవస్థ గుండా అగ్నికీలలు గని లోపలికి వేగంగా వ్యాపించి చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో అనేకమంది గనిలో చిక్కుకుపోయారు. చదవండి: దక్షిణాఫ్రికా ‘దడ’.. కొమ్ములు విరుచుకుంటున్న కొత్త వేరియెంట్ ఈ ఘటన జరిగే సమయానికి గని లోపల 285 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గనిలో ప్రాణాలతో బయటపడిన వారు లేరని రష్యా అధికారులు చెబుతున్నారు. మృతదేహాలు భూగర్భంలోనే ఉన్నాయి. ప్రమాదవశాత్తూ గనిలో ఏవైనా పేలుళ్లు జరిగే ఆస్కారముందనే అంచనాతో సహాయక చర్యల్ని తాత్కాలికంగా ఆపేశామని రష్యా అత్యయక వ్యవహారాల తాత్కాలిక మంత్రి అలెగ్జాండర్ చెప్పారు. ఘటనపై రష్యా దర్యాప్తునకు ఆదేశించింది. కాగా రష్యా దేశంలో ఐదేళ్లలో జరిగిన అత్యంత ఘోరమైన గని ప్రమాదం ఇది. మృతుల కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కెమెరోవో ప్రాంతంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు సంతాప దినాలను రష్యా సర్కారు ప్రకటించింది. -
హెలికాప్టర్ కూలి 18 మంది మృతి
మాస్కో: రష్యాలోని ఉత్తర సైబీరియాలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున ఇగర్కా సిటీ నుంచి చమురు బావి దగ్గరకు వెళ్లేందుకు 15 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో ఎంఐ8 అనే హెలికాప్టర్ బయల్దేరింది. అయితే, గాల్లో మరో హెలికాప్టర్‌కు వేలాడదీసిన మెషీనరీకి ఈ హెలికాప్టర్ రెక్కలు తగలడంతో ఇది కుప్పకూలింది. మరో హెలికాప్టర్ మాత్రం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. -
రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం..37 మంది మృతి
-
‘సైబీరియన్’ అతిథి
చిలమత్తూరు, న్యూస్‌లైన్ : సైబీరియన్ పక్షుల ఆత్మీయ విడిది వీరాపురంలో వాటికి ఆహార కొరత ఏర్పడింది. ప్రతి ఏటా తమ సంతాన అభివృద్ధి కోసం సైబీరియన్ నుంచి వేల కిలోమీటర్ల దూరంలోని వీరాపురం ప్రాంతానికి పక్షులు వలస వస్తుంటాయి. జనవరిలో ఇక్కడికి వలస వచ్చి.. గుడ్లు పెట్టి.. పిల్లలను పొదిగి అవి పెరిగి పెద్దగైన తర్వాత ఆగస్టులో తిరిగి సైబీరియా వెళతాయి. వేలాది పక్షులు కనువిందు చేస్తుండటంతో ఈ ప్రాంతం పర్యాటకంగా పేరుగాంచింది. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సైబీరియన్ పక్షులు ఈ ప్రాంతానికి రాలేదు. పర్యాటకులు నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. ఈ ఏడాది ముందస్తుగా కురిసిన వర్షాలతో వీరాపురం పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు నిండాయి. జనవరి రెండో వారంలో దాదాపు రెండున్నర వేల పైచిలుకు పక్షులు గ్రామానికి చేరుకున్నాయి. వీటికి ఆహారంగా రెండు నెలల క్రితం అటవీ శాఖ అధికారులు హుస్సేన్‌పురం, వీరాపురం, వెంకటాపురం, నెమళ్లకుంట చెరువుల్లో చేపల పెంపకం చేపట్టారు. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండటంతో కుంటలు, చెరువుల్లో నీటి మట్టం తగ్గిపోయింది. ఆయా చెరువుల్లో పెరుగుతున్న చేపల్ని కూడా గ్రామీణులు పట్టుకెళుతున్నారు. దీంతో పక్షులు తమ పిల్లలకు ఆహారాన్ని సేకరించడం కష్టంగా మారింది. ఇలాగే వదిలేస్తే ఆ పక్షులిక ఈ ప్రాంతానికి రాకపోవచ్చని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం వీరాపురం పక్షుల కేంద్రంపై నిర్లక్ష్యం వహిస్తోందని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువుల్లో తక్షణమే ఊట కుంటలు తవ్వించాలని, శాశ్వతంగా సిమెంటు తొట్టెలు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.