
మాస్కో: రష్యాలోని ఉత్తర సైబీరియాలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున ఇగర్కా సిటీ నుంచి చమురు బావి దగ్గరకు వెళ్లేందుకు 15 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో ఎంఐ8 అనే హెలికాప్టర్ బయల్దేరింది. అయితే, గాల్లో మరో హెలికాప్టర్‌కు వేలాడదీసిన మెషీనరీకి ఈ హెలికాప్టర్ రెక్కలు తగలడంతో ఇది కుప్పకూలింది. మరో హెలికాప్టర్ మాత్రం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment