
అర్జున్, లోస్లియా మరియనేసన్, హర్భజన్‌సింగ్
క్రికెటర్ హర్భజన్‌సింగ్ హీరోగా నటిస్తోన్న తొలి చిత్రం ‘ఫ్రెండ్‌షిప్’. ఈ చిత్రంలో తమిళ బిగ్‌బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో ‘యాక్షన్ కింగ్’ అర్జున్, సతీష్ ప్రధాన పాత్రధారులు. దర్శక ద్వయం జాన్‌పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమాను జేపీఆర్, స్టాలిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హర్భజన్ ఇంజనీరింగ్ స్టూడెంట్‌గా కనిపిస్తారని సమాచారం. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వేల్‌మురుగన్, రాబిన్.
Comments
Please login to add a commentAdd a comment