Cricketer Harbhajan Singh
-
నాలుగు భాషల్ ఫ్రెండ్షిప్
క్రికెటర్ హర్భజన్‌సింగ్ హీరోగా నటిస్తోన్న తొలి చిత్రం ‘ఫ్రెండ్షిప్’. ఈ చిత్రంలో తమిళ బిగ్‌బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ‘యాక్షన్ కింగ్’ అర్జున్, సతీష్ ప్రధాన పాత్రధారులు. దర్శక ద్వయం జాన్‌పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమాను జేపీఆర్, స్టాలిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హర్భజన్ ఇంజనీరింగ్ స్టూడెంట్‌గా కనిపిస్తారని సమాచారం. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వేల్మురుగన్, రాబిన్. -
పోలింగ్ బూత్‌లో క్రికెటర్‌తో సెల్ఫీ.. దుమారం
జలంధర్: ఓటేసేందుకు వచ్చిన ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్‌తో ఎన్నికల అధికారులు, సిబ్బంది సెల్ఫీలు దిగడంపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్, గోవా రాష్ట్రాల్లో శనివారం ఉదయం నుంచి పోలింగ్ జరుగుతోంది. క్రికెటర్ హర్భజన్ తన తల్లి అవతార్ కౌర్, కుటుంబసభ్యులతో కలిసి జలంధర్ నగరంలోని 23వ నంబర్ పోలింగ్ బూత్‌కు ఓటేయడానికి వచ్చాడు. అందరిలాగే క్యూ లైన్లో నడుస్తూ పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన భజ్జీని చూసి ఎన్నికల అధికారులు ఒకింత ఉత్సాహానికి లోనయ్యారు. భజ్జీతో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ దృశ్యాలుకాస్తా మీడియాలో ప్రసారం కావడంతో సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటువేసిన అనంతరం హర్భజన్ మీడియాతో మాట్లాడాడు. ‘ఇంతకముందు రాష్ట్రంలో రెండే రెండు కూటములు(కాంగ్రెస్, అకాలీ-బీజేపీ) తలపడేవి. ఇప్పుడు బరిలోకి మూడో పార్టీ(ఆప్)కూడా నిలిచింది. దీంతో ఓట్లు భారీగా చీలిపోతాయని అనుకుంటున్నా. ఈ పోరులో ఎవరు గెలిచినా, వారు తమ పార్టీకి కాకుండా పంజాబ్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని హర్భజన్ అన్నాడు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఒకే విడతలో(నేడు) పోలింగ్ జరుగుతున్నది. మార్చి 11న ఫలితాలు వెలువడతాయి. -
ప్రధాని నరేంద్ర మోదీ అతిథిగా...
ఘనంగా జరిగిన హర్భజన్ రిసెప్షన్ న్యూఢిల్లీ: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఆదివారం ఇక్కడ అట్టహాసంగా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా హాజరై దంపతులను ఆశీర్వదించారు. భజ్జీ సహచరులు విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, అశ్విన్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, మురళీ విజయ్, వరుణ్ ఆరోన్ తదితరులతో పాటు మాజీలు కపిల్‌దేవ్, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే దీనికి హాజరయ్యారు. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. హర్భజన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి దాదాపు వేయి మంది ఈ రిసెప్షన్లో పాల్గొన్నారు. మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి