
ఎట్‘లాస్ట్’!
ఫ్రెండ్‌షిప్ ప్రేమగా మారి... డేటింగ్‌షిప్‌కు గ్రీన్ సిగ్నల్ వేసి... ఫియాన్స్ మ్యాంగనీలోతో తెగ తిరిగేస్తున్న హాలీవుడ్ తార సోఫియా వెర్గారా ఎట్టకేలకు వెడ్డింగ్ బెల్ మోగించింది.
ఫ్రెండ్‌షిప్ ప్రేమగా మారి... డేటింగ్‌షిప్‌కు గ్రీన్ సిగ్నల్ వేసి... ఫియాన్స్ మ్యాంగనీలోతో తెగ తిరిగేస్తున్న హాలీవుడ్ తార సోఫియా వెర్గారా ఎట్టకేలకు వెడ్డింగ్ బెల్ మోగించింది. త్వరలోనే తమ ప్రేమ పెళ్లిగా మారబోతోందని... డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందని ఎంతో సంతోషంగా చెప్పిందీ చిన్నది. ప్రస్తుతం పాపులర్ టీవీ షో ‘మోడ్రన్ ఫ్యామిలీ’తో బిజీగా ఉన్న సోఫియా... పెళ్లి తంతుకు సంబంధించి ఇంకా ప్లానింగ్ జరగలేదని చెప్పింది.
38 ఏళ్ల నటుడు మ్యాంగనీని తన జీవిత భాగస్వామి అయ్యే రోజు కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానందీ 42 ఏళ్ల నటి. తన జీవితంలో ఇంతకంటే ముఖ్యమైన ఘట్టం మరోటి లేదంటూ మురిసిపోతోంది.